రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 01 OCT 2024 7:30PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గాంధీ జయంతి సందర్భంగా తన సందేశాన్ని ఇచ్చారురాష్ట్రపతి సందేశం ఇలా ఉంది:-

జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని ప్రజలందరి తరఫున ఆయనకు నివాళులర్పిస్తున్నాను.

సత్యాన్ని, అహింసను అమితంగా ఆరాధించే బాపూజీ జీవితం యావత్ మానవాళికి ఒక విశిష్ట సందేశంశాంతిసహకార మార్గాన్ని అనుసరించాలని ఆయన మమ్మల్ని ప్రేరేపించారుఅంటరానితనంనిరక్షరాస్యతపారిశుద్ధ్య లోపంఇతర సామాజిక రుగ్మతల నిర్మూలనకు గాంధీజీ ఉద్యమాలు చేపట్టారుమహిళా సాధికారత కోసం అలుపెరగని పోరాటం చేశారు.

గాంధీజీ నిత్య నైతిక సూత్రాలకు ప్రతీకగా నిలిచారునైతిక విలువల ఆధారిత నడవడికను అనుసరించాలని తెలిపారుఅత్యంత బలహీనులను బలోపేతం చేయటంపై ఆయన పోరాటం కేంద్రీకృతమైందిప్రపంచంలోని ఎందరో మహానుభావులను ఆయన ఆలోచనలు ప్రభావితం చేశాయివారు గాంధీజీ ఆశయాలను తమ పద్ధతుల్లోకి స్వీకరించారు.

సత్యంఅహింసప్రేమస్వచ్ఛత వంటి విలువలను అలవర్చుకుంటామని.. గాంధీజీ కలలుగన్న భారతావని కోసం దేశంసమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా సంకల్పం తీసుకుందాం

 

****


(रिलीज़ आईडी: 2060994) आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam , Malayalam