సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కేంద్రమంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రేపు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుక వృద్ధుల గౌరవార్ధం నెలపాటు కార్యక్రమాలను నిర్వహించనున్న ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట, సేవలకు తగిన గుర్తింపు

Posted On: 30 SEP 2024 11:26AM by PIB Hyderabad

దేశంలోని వృద్ధుల సంక్షేమం పట్ల కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం- 2024 సందర్భంగా న్యూఢిల్లీలో రేపు (అక్టోబర్ 1న) జరిగే వేడుకలకు ఆ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షత వహిస్తారు. సహాయమంత్రి శ్రీ బి.ఎల్. వర్మ గౌరవ అతిథిగా పాల్గొంటారు.

వృద్ధుల సంక్షేమం పట్ల నిబద్ధతకు గుర్తుగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవమైన అక్టోబర్ 1న-  సమాజానికి సేవ చేసిన సీనియర్ సిటిజన్లను గౌరవించడంతోపాటు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారువ్యక్తులు, సమాజం, ప్రభుత్వ సంస్థల్లో వృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన పెంపు, వారికి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వామ్యాన్ని పెంచే ఆశయంతో జరిగే ఈ కార్యక్రమాలు నెలరోజుల పాటు కొనసాగుతాయి. తరాల మధ్య అనుబంధాలని బలోపేతం చేయడం, సమాజ శ్రేయస్సుకి వృద్ధులు అందించిన అమూల్యమైన తోడ్పాటును గుర్తించి గౌరవించడం, వారి క్షేమం కోసం తీసుకోవలసిన చర్యల పట్ల ఈ కార్యక్రమాలు దృష్టి సారిస్తాయి.

వృద్ధుల అంశంపై స్పెయిన్ దేశం మాడ్రిడ్ లో జరిగిన 2వ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ రూపొందించిన రాజకీయ ప్రకటనకూ, మాడ్రిడ్ వృద్ధాప్య కార్యాచరణ ప్రణాళికా పత్రం-2002 కు భారత్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ఐరాస 1990, అక్టోబరు 14న ప్రకటించింది. వృద్ధాప్యంపై 1982లో ఖరారైన అంతర్జాతీయ మార్గదర్శక సూత్రాలను ఐరాస సర్వప్రతినిధి సభ ఆమోదించింది. వృద్ధులకు స్వాతంత్రం, భాగస్వామ్య అవకాశం, సంరక్షణ హక్కు, ఆత్మగౌరవం, ఆత్మ సంతృప్తి ఉండాలని ఐరాస ప్రతిపాదించింది. 2021-30 దశాబ్దాన్ని ఐరాస ‘ఆరోగ్యకర వృద్ధాప్య దశాబ్దం’గా ప్రకటించింది. మన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (ఎస్డిపి)లో భాగమైన మంచి ఆరోగ్యం, సంక్షేమాలు, ఐరాస ప్రతిపాదిత లక్ష్యాలకు  అనుగుణంగా ఉన్నాయి. మాడ్రిడ్ ప్రకటనకు ముందుగానే, మన దేశం వృద్ధుల సంక్షేమం కోసం 1999 లో, వృద్ధుల జాతీయ విధానాన్ని (ఎన్పిఓపి)  ప్రవేశపెట్టింది. 

సామాజిక న్యాయం, సాధికారత శాఖ అక్టోబర్ లో నిర్వహించబోయే ముఖ్య కార్యక్రమాలు:

 1. అక్టోబర్ 1న జరిగే కార్యక్రమాలు:

అ) ముఖ్య కార్యక్రమం: న్యూఢిల్లీ విద్యాసంస్థలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రి సమక్షంలో ప్రతిజ్ఞా కార్యక్రమం, వృద్ధులకు అవసరమైన సహాయ సామగ్రి పంపిణీ.

ఆ) రాష్ట్రీయ వయోశ్రీ క్యాంపులు: మంత్రి సమక్షంలో దేశవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేస్తారువృద్ధుల సంపూర్ణ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే లక్ష్యంతో ఏర్పాటైన ఈ క్యాంపుల్లో వారు సులభంగా నడవగలిగేందుకు అనువైన ఉపకరణాలు, అవసరమైన ఇతర వస్తువులను అందజేస్తారు.

2. మంత్రిత్వ శాఖల మధ్య భాగస్వామ్యాలువృద్ధుల సంక్షేమం దృష్ట్యా తీసుకోదగిన చర్యల గురించి, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ వివిధ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, హోం, ఆయుష్ మంత్రిత్వ శాఖలకు రాసిన లేఖల్లో... స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టదగ్గ కార్యక్రమాల గురించి సూచనలు చేస్తూ, కుటుంబ వ్యవస్థలోని వివిధ తరాల మధ్య అనుబంధాల బలోపేతం, విలువల పట్ల అవగాహన పెంపు గురించి ప్రత్యేకంగా పేర్కొంది.

3. ప్రసంగాలు: ‘జాతీయ సామాజిక సురక్ష సంస్థ’–ఎన్ఐఎస్డి, అక్టోబర్ 16న వృద్ధుల హక్కులు, సంక్షేమం సహా వారికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించే ప్రసంగాలను ఏర్పాటు చేస్తోంది. ముదిమి వైపు ప్రయాణం మంచి ఆరోగ్యంతో, క్రియాశీలకంగా జరగడం ఎంత ముఖ్యమో కూడా ఈ ప్రసంగాలు తెలియచేస్తాయి.

4. ప్రాంతీయ వనరులు, శిక్షణ కేంద్రాల్లో (ఆర్ఆర్టీసీ) చేపట్టబోయే కార్యక్రమాలు: మంత్రిత్వశాఖలోని వయోవృద్ధుల విభాగం కింద పని చేసే ‘ప్రాంతీయ వనరులు, శిక్షణ కేంద్రాల’ ద్వారా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక వాకథాన్, ప్రసంగాలు, బాలలు, యువత పాల్గొనే ర్యాలీలు, విద్యాసంస్థల్లో వృద్ధుల పట్ల శ్రద్ధ చూపుతామంటూ ప్రతిజ్ఞా కార్యక్రమాలు, పెద్దవారి పట్ల ప్రేమాభిమానాలు గౌరవం చూపడం గురించి అవగాహన. కల్పన, పోటీలు, బ్యానర్లు, మేళాలు, సాంస్కృతికక్రీడా కార్యక్రమాలు, కథ, కవితా పఠనం కార్యక్రమాల నిర్వహణ. టైమ్ బ్యాంక్ పథకానికి ప్రోత్సాహం, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, హెల్త్ క్యాంపుల నిర్వహణ,  ప్రచారం సహా, వృద్ధుల హితం కోసం మంత్రిత్వశాఖ నుండి నిధులు అందుకున్న సంస్థల ద్వారా వృద్ధాశ్రమాల్లో జానపద కళల ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, వృద్ధులు, యువతరం మధ్య వారధి కల్పించే సంభాషణల ఏర్పాటు.   

5. మై గవ్ క్విజ్ పోటీలు, ప్రతిజ్ఞలు:  

అ) ‘మై గవ్’ వేదికపై  వృద్ధుల హక్కులు, సంక్షేమ పథకాలపై జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు ప్రారంభం. పెద్దవారిపట్ల గౌరవం, వారి పట్ల శ్రద్ధ చూపడం వంటి అంశాల పట్ల అన్ని వయసుల వారికి, ముఖ్యంగా యువతకు  అవగాహన కల్పించడం.   
b. 
వృద్ధుల పట్ల గౌరవం, మర్యాద చూపుతూ, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ‘మై గవ్’ పోర్టల్ పై ప్రతిజ్ఞ చేసేలా పౌరులకు ప్రోత్సాహం.

6. త్వరలో వయోధికుల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలు, విధానాలు, సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచార ప్రసారంలో పోర్టల్ కీలకం.

7. సాంస్కృతిక ఉత్సవం: ‘వృద్ధ్యాప్యం వైపు సగౌరవ ప్రయాణం: 60 ఏళ్ళకు సిసలైన జీవితం ప్రారంభం’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం. ఇందులో పాల్గొనే 70 ఏళ్ల పైబడ్డ కళాకారులు పెద్దవారవుతున్నప్పటికీ క్రియాశీలకంగా ఉండటం, గురు శిష్య పరంపర, తరాల మధ్య గట్టి అనుబంధం, భారతీయ సంస్కృతిలో భాగమైన పెద్దల పట్ల మర్యాద, ప్రేమ, తదితర సందేశాలను  ప్రదర్శిస్తారు.

8. ముగింపు వేడుక: నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాలు న్యూఢిల్లీ లో జరిగే ముగింపు వేడుకతో ముగుస్తాయి.

 

***



(Release ID: 2060541) Visitor Counter : 7