రక్షణ మంత్రిత్వ శాఖ
ఇలా ప్రారంభం అవుతోంది!
ఇండో పసిఫిక్ ప్రాంతీయ సంప్రదింపులు (ఐపీఆర్డీ) 2024
ఇండో పసిఫిక్ అభ్యున్నతి, భద్రతల దిశగా అత్యున్నత
అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాల్లో భారత నావికాదళం
Posted On:
30 SEP 2024 4:42PM by PIB Hyderabad
భారత నావికాదళం వార్షిక అత్యున్నత అంతర్జాతీయ స్థాయి ‘‘ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సంప్రదింపులు (ఐ పీ ఆర్ డి)’’ - 2024 ఎడిషన్ న్యూఢిల్లీలో అక్టోబర్ 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇదే ఏడాది గత నెల 24, 25 తేదీల్లో గోవాలోని నావల్ వార్ కాలేజీలో భారత నావికాదళం- గోవా మారిటైమ్ సింపోజియాన్ని నిర్వహించింది. కొనసాగింపు కార్యక్రమంగా ఈ ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశం ఏర్పాటైంది. (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2058348).
హిందూ మహాసముద్ర ప్రాంత కార్యకలాపాల విషయంలో భారత నావికాదళం- కార్యాచరణ పరంగా ఎలా సహకరించే అవకాశం ఉన్నదీ చూపించేందుకు గోవా మారిటైమ్ సింపోజియం ఉపయోగపడింది. ఈ ప్రాంతంలోని నావికా దళాలు, నౌకా వాణిజ్య సంస్థల మధ్య చర్చకు ఇది ఒక వేదికను అందించింది. దీనికి కొనసాగింపుగా నిర్వహించనున్న ఐపీఆర్డీ- భారత నావికాదళం వ్యూహాత్మక స్థాయిలో అంతర్జాతీయ చొరవకు ప్రధాన రూపం. ఇండో-పసిఫిక్ సముద్ర భద్రతా సమస్యలకు ఇది ఓ సంపూర్ణ పరిష్కారం. భారత నావికాదళం అవగాహన భాగస్వామిగా ఉన్న నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ (ఎన్ఎంఎం) ఐపీఆర్డీ అన్ని సమావేశాలనూ నిర్వహిస్తుంది.
ఐపీఆర్డీ మొదటి రెండు ఎడిషన్లు వరుసగా2018, 2019 సంవత్సరాల్లో న్యూఢిల్లీలో జరిగాయి. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఐపీఆర్డీ 2020 నిర్వహించనప్పటికీ, మూడో ఎడిషన్ -2021 వీడియో మాథ్యమం ద్వారా జరిగింది. 2022 నుండి, ఐపీఆర్డీ సమావేశాలు సాధారణంగానే నిర్వహించారు. ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపిఐఓ)లో ఏడు అంశాలను ప్రధానంగా గుర్తించారు. ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన ఈ ఏడు అంశాలపై ఐపీఆర్డీ దృష్టి సారించింది. ఒక వైపు మలి ప్రాధాన్యంగా భారతదేశపు ‘సాగర్’ వ్యూహాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే, ప్రాధాన్య క్రమంలో గుర్తించిన ఏడు ప్రధాన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
“ఇండో-పసిఫిక్ లక్ష్యాలు- కార్యాచరణ” అన్నది 2022 ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023 ఎడిషన్ ‘‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో నౌకా వాణిజ్యం- అనుబంధాల ఏర్పాటు, దానిపై భౌగోళిక రాజకీయ ప్రభావాలు” గురించి చర్చించింది. ప్రతి ఐపీఆర్డీ ఎడిషన్, 'సాగర్' కి రెండో స్థాయి ప్రాథమ్యాన్ని అందించడానికి, ఐపిఓఐ గుర్తించిన ఏడు ప్రధాన అంశాలను వరుసగా పూర్తి స్థాయిలో చర్చించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు అనుగుణంగానే ఐపీఆర్డీ -2022 ఇతివృత్తం ప్రకారం...అనుకున్న లక్ష్యాలకు కార్యాచరణ కల్పించడం. 2023 ఎడిషన్ “ఇండో-పసిఫిక్ నౌకా వాణిజ్యం, సంబంధాల ఏర్పాటుపై విస్తృత రాజకీయ ప్రభావాలు” అన్న అంశాన్ని చర్చించింది.
‘‘వనరులు- భౌగోళిక రాజకీయాలు- ఇండో పసిఫిక్ భద్రత’’ అన్న అంశంపై ఐపీఆర్డీ- 2024 దృష్టి పెట్టింది. ఇందులో రెండు ప్రధాన అంశాలయిన సముద్ర వనరులు, వనరుల భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తారు. సంప్రదాయ సముద్ర వనరులు, కొత్తగా గుర్తించిన సముద్ర వనరులు సమకాలీన భౌగోళిక రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న దిశగా దృష్టి పెడతారు. ఇవి భవిష్యత్తులో ఎలా ఉండొచ్చన్న కోణంలోనూ సమాలోచనలు సాగుతాయి. తగ్గిపోతున్న సముద్ర సంపద, అక్రమంగా సాగే చేపల వేటతోపాటు, ముఖ్యంగా ఏ దేశానికీ చెందని సముద్ర జలాల్లో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నియంత్రణ లేదన్న భావన ఉంది. వీటి గురించి కనీస సమాచారం కూడా ప్రభుత్వాలకు చేరడం లేదు.
భౌగోళిక రాజకీయాలు- సముద్ర వనరుల చుట్టూ తిరుగుతున్నాయి. కోబాల్టు, లిథియం, నికెల్ తోపాటు అంత తేలిగ్గా లభ్యంకాని లోహాలు, బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్ల వంటి సంప్రదాయ ఇంధన పరికరాల తయారీలో ఉపయోగించే- టెల్లూరియం, నియోడైమియం వంటి కీలక లోహాల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి సంప్రదాయేతర ఇంధనాల వైపు మరలుతున్న నేపథ్యంలో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంది. సంప్రదాయ ఇంధన వనరులే అయినా, భౌగోళిక రాజకీయాల పరంగా- హైడ్రోకార్బన్ల హవా నేటికీ కొనసాగుతోంది. గ్యాస్ హైడ్రేట్లు కూడా ఇలాంటివే. సముద్ర గర్భంలోని ఇంధన వనరుల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఉదాహరణకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్రం నుంచి లభించే హైడ్రోజన్ భవిష్యత్తు భౌగోళిక ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం ఉంది.
నౌకా వాణిజ్య సంస్థల నుంచి వస్తున్న అనేక మంది నిపుణులు, విఖ్యాత వక్తలు ఐపీఆర్డీ-2024లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండో పసిఫిక ప్రాంత భౌగోళిక రాజకీయ యవనికపై అవతరించే సరికొత్త పోకడలను ఐపీఆర్డీ-2024 గుర్తించనున్నది. ఇందువల్ల మనకు అనుకూలంగా ఉండే విధానాల రూపకల్పనకు మంచి అవకాశం లభిస్తుంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు- వాతావరణంపై కూడా దృష్టి పెడతారు. వనరులు-భౌగోళిక రాజకీయాలు అన్న కోణంలో- సహకారం, సమన్వయం, పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా ఎలాంటి కొత్త అవకాశాలను అందిస్తుందన్నది ఈ సదస్సు అన్వేషిస్తుంది.
గౌరవ భారత రక్షణశాఖా మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ అందించననున్న ప్రసంగం ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నది. అలాగే, ఐపీఆర్డీలో- 20 దేశాల నుంచి వస్తున్న వివిధ రంగాలకు చెందిన విఖ్యాత వక్తలు ప్రత్యేక ప్రసంగాలను ఇవ్వనున్నారు. వారంతా సదస్సు ఇతివృత్తంగా- ప్రాంతీయ కోణాలను ఆవిష్కరించనున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, దౌత్యస్థాయి అధికారులు, మేథావులు, పౌరులు ఐపీఆర్డీకి లభించిన మరో ప్రత్యేక ఆకర్షణ.
***
(Release ID: 2060531)
Visitor Counter : 30