వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

బిడ్కిన్ పారిశ్రామికవాడను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి మోదీ


మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో పారిశ్రామిక వృద్ధి నవ శకారంభం;

ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి.. ప్రపంచ పోటీతత్వానికి ఉత్ప్రేరకం ఈ పారిశ్రామిక వాడ;

₹56,200 కోట్లకుపైగా పెట్టుబడుల ప్రవాహం.. 30 వేలకుపైగా ఉద్యోగాల సృష్టి.. పారిశ్రామిక నైపుణ్య వికాసానికి సంసిద్ధం

Posted On: 29 SEP 2024 4:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహారాష్ట్రలోని ‘బిడ్కిన్ పారిశ్రామిక వాడ’ (బిఐఎ)ను వాస్తవిక సాదృశ (వర్చువల్మాధ్యమం ద్వారా ఇవాళ జాతికి అంకితం చేశారుదీంతో దేశ పారిశ్రామిక ప్రగతి కీలక మలుపు తిరిగినట్లయిందికాగాదీనికి సంబంధించి ఫుణె నగరంలో నిర్వహించిన ప్రధాన వేడుకలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండేఇతర ప్రముఖులు పాల్గొన్నారుఈ కార్యక్రమాన్ని ‘ఆరిక్ హాల్’ నుంచి వెబ్‌కాస్ట్ చేయగాఇక్కడ మహారాష్ట్ర గృహనిర్మాణ-‘ఒబిసి’ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అతుల్ సేవ్రాజ్యసభ సభ్యుడు డాక్టర్ భగవత్ కరద్ తదితరులు పాల్గొన్నారు.

   ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం (ఎన్‌ఐసిడిపికింద 7,855 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘బిడ్కిన్ పారిశ్రామికవాడ’ ఒక విస్తృత ప్రగతిశీల ప్రాజెక్టుమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌కు దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో రూపుదిద్దుకున్న ఈ పారిశ్రామికవాడకు మరాఠ్వాడా ప్రాంతంలో ఆర్థిక వృద్ధి దిశగా ఉత్ప్రేరక పాత్ర పోషించగల అపార సామర్థ్యం ఉంది.

ప్రాజెక్టు కీలకాంశాలు:

వ్యూహాత్మక భౌగోళిక ప్రదేశం: ఈ పారిశ్రామికవాడకు అన్నిరకాలుగా అద్భుత అనుసంధానం ఉందిఈ మేరకు జాతీయ రహదారి ‘752ఇ’కి పక్కననాగ్‌పూర్-ముంబై నగరాలను సంధానించే సమృద్ధి మహామార్గ్ నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిఅలాగే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 20 కి.మీవిమానాశ్రయం 30 కి.మీదూరంలోనే  ఉంటాయిఇక అతి ముఖ్యమైన జల్నా డ్రై పోర్ట్ 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిఅంటే- ‘పిఎం గతిశక్తి’ బృహత్ ప్రణాళిక సూత్రావళికి అనుగుణంగా నిరంతర బహుళ రవాణా అనుసంధాన సౌలభ్యంతో ‘బిఐఎ’ నిర్మితమవుతోంది.

దశలవారీ నిర్మాణం: కేంద్ర ప్రభుత్వం 6,414 కోట్లతో మూడు దశల్లో ‘బిఐఎ’ను నిర్మిస్తోందిఈ మేరకు 2,511 ఎకరాల్లో చేపట్టే తొలిదశ (ఫేజ్-పనుల కోసం 2,427 కోట్లు వెచ్చించారు. ‘‘మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ లిమిటెడ్ (ఎంఐటిఎల్)మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి)నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసిడిఐటి)’’ల మధ్య 51:49 భాగస్వామ్య నిష్పత్తితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పివిఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేసింది.

సంసిద్ధ మౌలిక సదుపాయాలు: ‘బిఐఎ’లో ఇప్పటికే విశాలమైన రహదారులునాణ్యమైన నీటి సరఫరానిరంతరాయ విద్యుత్ సౌకర్యంఅధునాతన మురుగు-సాధారణ కలుషితాల శుద్ధి ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయిఈ కీలక మౌలిక సదుపాయాల పనులు పూర్తికావడంతో పారిశ్రామికమిశ్రమ వినియోగార్థం కోరిన సంస్థలకు ప్లాట్ల కేటాయించడమే ఇక మిగిలి ఉంది.

ప్రధాన పెట్టుబడులు ఆర్థిక ప్రభావం

   ఈ పారిశ్రామికవాడలో పెట్టుబడులకు ప్రసిద్ధ సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపాయిఈ మేరకు అథర్ ఎనర్జీ (100 ఎకరాలు), లుబ్రిజోల్ (120 ఎకరాలు)టయోటా-కిర్లోస్కర్ (850 ఎకరాలకు ‘ఎంఒయు’)జెఎస్‌డ‌బ్ల్యు గ్రీన్ మొబిలిటీ (500 ఎకరాలువంటి కంపెనీలు పరిశ్రమల స్థాపనకు సిద్ధమయ్యాయిఈ నాలుగు సంస్థల ద్వారా 56,200 కోట్లదాకా పెట్టుబడులు రానుండగా, 30,000కుపైగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

   నిర్మాణం మొదలయ్యాక కేవలం మూడేళ్లలోనే పారిశ్రామికమిశ్రమ వినియోగ జోన్లలో 1,822 ఎకరాల (38 ప్లాట్లుకేటాయింపు పూర్తయిందిఈ నేపథ్యంలో ‘బిఐఎ’ నిర్మాణం ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక వృద్ధిపై గొలుసుకట్టు ప్రభావం చూపుతుందనినిపుణ మానవ సౌలభ్యంతో పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంటుందని అంచనా.

పారిశ్రామిక నైపుణ్య వికాసం దిశగా ముందడుగు

   బిడ్కిన్ పారిశ్రామిక వాడ (బిఐఎ)ను ప్రధాని నేడు జాతికి అంకితం చేయడం ప్రపంచ తయారీ రంగంలో అగ్రగామిగా నిలిచేలా భారత్ ముందంజకు బలమైన అడుగు కాగలదు. ‘‘మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్’’ నినాదానికి అనుగుణంగా సిద్ధమైన ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో పారిశ్రామికవృద్ధిఆర్థిక శ్రేయస్సుసుస్థిర ప్రగతికి బాటలు పడతాయి.

   ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూపారిశ్రామిక నైపుణ్యానికిఉపాధి సృష్టికిఎగుమతులను పెంచడంతోపాటు ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2060138) Visitor Counter : 10