రాష్ట్రపతి సచివాలయం
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఇరవై ఒకటో స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి
మార్పును తీసుకు వచ్చే వారిగా నడుచుకోండి అంటూ యువ న్యాయవాద వృత్తినిపుణులకు రాష్ట్రపతి విజ్ఞప్తి
Posted On:
28 SEP 2024 6:15PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు న అంటే 2024 సెప్టెంబరు 28న తెలంగాణ లోని హైదరాబాద్ లో జరిగిన నల్సార్ యూనివర్సిటి ఆఫ్ లా ఇరవై ఒకటో స్నాతకోత్సవం లో పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, మన రాజ్యాంగంలో మన స్వాతంత్ర్య పోరాటం తాలూకు ఆదర్శాలైన న్యాయం, ధర్మం, నీతి, స్వేచ్ఛ, విముక్తి, సమానత్వం, ఇంకా సోదరభావాలు ఇమిడిపోయి ఉన్నాయన్నారు. సమత భావన ను రాజ్యాంగం ప్రస్తావన లోను, ప్రాథమిక హక్కుల లోను ప్రతిష్ఠించడంతో పాటుగా న్యాయం అందజేతకు సంబంధించిన ప్రభుత్వ విధానంలో ఓ భాగం అయిన ఆదేశ సూత్రాలలో కూడా పొందుపరచుకొన్నామని రాష్ట్రపతి అన్నారు. ఆదేశ సూత్రాలు అందరికీ సమాన న్యాయాన్ని, ఉచిత న్యాయ సహాయాన్ని సూచిస్తున్నాయన్నారు. ‘‘ఆర్థిక లేదా ఇతర అశక్తతల కారణంగా ఏ పౌరుడు/పౌరురాలు న్యాయాన్ని అందుకొనే అవకాశాలను కోల్పోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి’’ అని ఆదేశ సూత్రాలు బోధిస్తున్నాయన్నారు.
న్యాయ ప్రాప్తి సంపన్న వ్యక్తి కి వలె ఒక పేద వ్యక్తి కి దక్కక పోతుండడం దురదృష్టకరమన్నారు. అందరి మేలు కోసం ఈ న్యాయవిరుద్ధ పరిస్థితి మారితీరాలన్నారు. ఇలాంటి మార్పునకు మీరు ప్రతినిధులు కండి అంటూ న్యాయవాద వృత్తిని ఎంచుకొన్న యువతకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.
ఇకమీదట న్యాయవాదులుగా తమ పాత్రను పోషించనున్న విద్యార్థులు వారి కక్షిదారుల ప్రయోజనాలను గురించి శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా న్యాయాన్ని అందించడంలో న్యాయస్థానానికి సాయపడే బాధ్యతను కూడా వారి భుజాలకెత్తుకోవాలని రాష్ట్రపతి అన్నారు. న్యాయ రంగంలో వృత్తికుశలురుగా వారు ఏ భూమికను ఎంచుకొన్నప్పటికీ, వారు న్యాయవర్తన, ధైర్యం, ఇంకా సాహసం అనే విలువలకు సదా అంటిపెట్టుకొని ఉండాలి అని రాష్ట్రపతి హితవు పలికారు. న్యాయాధికారుల సమక్షంలో నిజం వైపున నిలిస్తే వారు మరింత బలవంతులుగా మారుతారని ఆమె స్పష్టంచేశారు.
నల్సార్ అనేక రంగాలలో ముందు నడుస్తుండడం చూసి తనకు సంతోషం కలుగుతోందని రాష్ట్రపతి అన్నారు. శారీరిక అశక్తత, న్యాయ సౌలభ్యం, కారాగార సంబంధి న్యాయం, బాలల సంబంధి న్యాయం, ఇంకా న్యాయ సంబంధి సహాయం.. వీటి విషయాలలో శ్రద్ధ తీసుకోవడంలో నల్సార్ చొరవలను ఆమె మెచ్చుకొన్నారు.
పశు న్యాయ కేంద్రం (ఏనిమల్ లా సెంటర్) ను నల్సార్ ఏర్పాటు చేసిందని తెలుసుకొని రాష్ట్రపతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మానవ జాతి శ్రేయానికి పశువులు, పక్షులు, వృక్షాలతో పాటు జలాశయాలను నేటి యువతరం పెంచి పోషిస్తుందన్న ఆశ ఉందని ఆమె అంటూ, ఈ దిశ లో నల్సార్ స్థాపించిన ఏనిమల్ లా సెంటర్ ఒక మంచి ముందడుగు అని అభినందించారు.
మహిళల సురక్ష ను పెంపొందించంలో సంఘంలోని అన్ని విభాగాలకు వాటా ఉంది అని రాష్ట్రపతి అన్నారు. మహిళా వకీళ్లతోను, న్యాయ విద్యార్థినివిద్యార్థులతోను ఒక జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధిత వర్గాలందరి సమర్థనను కూడగట్టి, ఆ యంత్రాంగాన్ని నెలకొల్పడంలో సాయాన్ని అందించండి అంటూ నల్సార్ కు, నల్సార్ పూర్వ పట్టభద్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ యంత్రాంగం మహిళలకు వ్యతిరేకంగా అత్యాచారాలను నివారించడానికి, ఆ తరహా అత్యాచారాల వ్యాజ్యాలను పరిష్కరించడానికి ఉమ్మడి ప్రయాసలకు పూనుకోవాలన్న ఆజ్ఞను తలదాల్చి శ్రమిస్తుందన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
Click here to see President's Address.
(పైన గల ఇంగ్లిషు వాక్యానికి
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు
అని అర్థం వస్తుంది.)
***
(Release ID: 2059967)
Visitor Counter : 43