సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో స్వచ్ఛతా హీ సేవలో శ్రీ అశ్విని వైష్ణవ్

పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత కోసం మంత్రిత్వ శాఖ అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి


'అమ్మ పేరుతో ఒక మొక్క' కార్యక్రమం కింద సూచనా భవన్‌లో మొక్క నాటిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

స్థానిక పరిశుభ్రతకోసం సామాజిక సేవా కార్యక్రమాలు చాలా ముఖ్యం : శ్రీ అశ్విని వైష్ణవ్

Posted On: 25 SEP 2024 7:28PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా హీ సేవ, 2024 ప్రచారంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) న్యూఢిల్లీలోని సూచనా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించే వివిధ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

 

సూచనా భవన్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందితో అశ్విని వైష్ణవ్ ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో పాల్గొన్నవారు వారి ప్రాంతాల్లో, ప్రభావిత రంగాలలో పరిశుభ్రత, సుస్థిర పద్ధతులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని ప్రతిజ్ఞ చేశారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం) ప్రచారానికి కొనసాగింపుగా, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే ఇరు లక్ష్యాలను మిళితం చేస్తూ శ్రీ అశ్విని వైష్ణవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులకు మొక్కలు పంపిణీ చేసి పర్యావరణం పట్ల వ్యక్తిగత బాధ్యతను తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర విభాగాల మీడియా అధిపతులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2058867) Visitor Counter : 46