ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

Posted On: 22 SEP 2024 5:55AM by PIB Hyderabad

అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్ లోని విల్మింగ్టన్ లో క్వాడ్ సమావేశాల సందర్భంగా జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో భేటీ అయ్యారు.

ముఖ్యంగా 2022 మార్చిలో జరిగిన తొలి శిఖరాగ్ర సమావేశం తర్వాత పలుసార్లు తామిద్దరం కలసిన సందర్భాలను ఇద్దరు ప్రధానులు గుర్తు చేసుకున్నారుగత కొన్నేళ్లుగా భారత-జపాన్ దేశాల ప్రత్యేక వ్యూహాత్మకప్రపంచ భాగస్వామ్యం దిశగా సాధించిన పురోగతిలో జపాన్ ప్రధానమంత్రి శ్రీ కిషిద చూపిన అచంచల అంకిత భావంనాయకత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మకఅంతర్జాతీయ భాగస్వామ్యం 10వ సంవత్సరంలోకి ప్రవేశించడాన్ని గుర్తించిన ఇద్దరు నేతలు ఇరుపక్షాల సంబంధాల్లో జరిగిన పురోగతిపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ఇరువురు ప్రధానులు సమీక్షించారు. రక్షణభద్రతా సంబంధాలుబీ2బీపీ2పీ భాగస్వామ్యాలు సహా సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారుజపాన్ ప్రధాన మంత్రి కిషిదాకు వీడ్కోలు పలుకుతూ ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు సఫలం కావాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

***

 

(Release ID: 2057638) Visitor Counter : 61