రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

హిందూ మహా సముద్ర ప్రాంతంలో అత్యుత్తమ రక్షణ భాగస్వామిగా పెరుగుతున్న భారత ప్రతిష్ఠ


శాంతిసౌభాగ్యాలను కాపాడుతున్న భారత నావికాదళం: రక్షణ మంత్రి

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: నౌకాదళానికి శ్రీ రాజ్ నాథ్ సింగ్ సూచన

Posted On: 19 SEP 2024 3:31PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 19న జరిగిన భారత నావికాదళ కమాండర్ల రెండో సదస్సును ఉద్దేశించి రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ ప్రసంగించారుహిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కొనసాగించడంలో భారత నావికాదళం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసిస్తూఆర్థికభౌగోళికరాజకీయవాణిజ్యభద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఈ ప్రాంతం ఎంతో సున్నితమైనదనీవిలువైనదనీ ఆయన పేర్కొన్నారు.

రెండు వైపులా నీళ్లు ఉన్నందునభారతదేశాన్ని పూర్వం భూపరివేష్టిత దేశంగా భావించేవారనీకానీ ఇప్పుడు ఒక భూ సరిహద్దులు గల ద్వీపంలా భారతదేశాన్ని చూస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారుదేశ నావికా వాణిజ్య ప్రయోజనాలను భారత నావికాదళం సమర్ధవంతంగా పరిరక్షిస్తోందని కొనియాడారుదీని వల్లవిపత్తు సంభవించినప్పుడు మొదటగా స్పందించేది భారత నావికాదళమేనన్న పేరుని తెచ్చుకుందని రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు.

 “ప్రపంచ దేశాల వాణిజ్యం ఎక్కువగా హిందూ మహాసముద్ర ప్రాంతం మీదుగానే సాగుతున్నందునఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉందన్నారుఅదే సమయంలోసముద్ర దొంగల దుశ్చర్యలుహైజాకింగ్డ్రోన్ దాడులుక్షిపణి దాడులుసముద్రంలోని కేబుళ్ళను కత్తిరించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న సున్నితమైన ప్రాంతమిది.

ఇండో-పసిఫిక్ ప్రాంత భాగస్వామ్య దేశాల ఆర్థిక అవసరాలను పరిరక్షిస్తూహిందూ మహాసముద్రంలో వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగిపోవడంలో మన నావికా దళం కీలక పాత్ర పోషిస్తోందిసముద్ర దొంగలను నిలువరించడంలో భారత నావికాదళం చేపట్టిన చర్యలకు కేవలం దేశం నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయిహిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యుత్తమ రక్షణ భాగస్వామిగా భారత్ నిలుస్తోందిఅవసరం వచ్చినపుడుఈ ప్రాంతం అంతటికీ మనం భద్రతను అందించగలం” అని శ్రీ రాజ్ నాధ్ సింగ్  పేర్కొన్నారు.

 

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకదళ ప్రాబల్యం పెరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యాఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకుఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉండాలని నావికాదళ కమాండర్లకు మంత్రి ఉద్బోధించారుఆర్థికపరమైనవాణిజ్యరవాణా రంగాల్లోనే కాక దేశ ప్రయోజనాలను కాపాడేందుకు బలమైన నావికాదళం అవసరమని రాజ్ నాధ్ సింగ్ స్పష్టం చేశారు

 

ఆత్మ నిర్భర్ లేదా స్వావలంబన సాధన ఆశయంగా భారత నావికా దళాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ లక్ష్యమనీఇందుకోసం అత్యాధునిక యుద్ధ నౌకలుజలాంతర్గాములతో  దళానికి అదనపు బలాన్ని జోడిస్తున్నామని మంత్రి చెప్పారుదేశంలోని ఓడరేవుల్లో ఇప్పటికే 64 నౌకలుజలాంతర్గాముల  నిర్మాణం జరుగుతోందనిమరో 24 తయారు చేయాల్సిందిగా చెప్పామని అన్నారు.

 

గత అయిదేళ్లలో నావికదళ ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఖర్చు చేసిస్వదేశీ పరిశ్రమల నుంచే అవసరమైన వాటిని తీసుకున్నామనిదేశ రక్షణ వ్యవస్థల్ని మునుపటి కంటే ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దినట్లు చెప్పారుభారత నావికదళం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రశంసించిన రాజ్ నాధ్ సింగ్, ‘ఆత్మనిర్బరతా’ లక్ష్యాన్ని అందుకునేందుకు మరిన్ని అవకాశాలను పరిశీలించాలని పిలుపునిచ్చారుభారత నావికదళం కొనుగోలుదారు నుండి ఉత్పత్తిదారుగా పరివర్తనం చెందాలన్న ఆశయం నెరవేరి, 2047 సంవత్సరాల కల్లా నావికాదళం  స్వావలంబన సాధించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

సహదళాలతో సహకారంవనరుల సద్వినియోగం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూభారత నావికాదళం,  భారత తీర రక్షణ దళంవేటికవే బలమైనవని అన్నారుస్థిరమైన చక్కని పద్ధతులు/వ్యవస్థలను కలిగి ఉన్నప్పటికీఇరు దళాలు సహకారంతో కలిసి పని చేస్తూ దేశ తీర రక్షణను బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారుకార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన సాంకేతిక ప్రదర్శనను రాజ్ నాధ్ సింగ్ సందర్శించారుఇందులో భారత నావికాదళ పరిశోధన అభివృద్ధి సంస్థఆయుధ/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంస్థ సహా వివిధ రక్షణ సంస్థలు ప్రదర్శించిన దేశవాళీ ఉత్పత్తులుస్వయం ప్రతిపత్తి గల రక్షణ వ్యవస్థలుసాఫ్ట్ వేర్ ఆధారిత రేడియోలుఒక ప్రాంతాన్ని అవగాహన చేసుకునే వ్యవస్థలుతదితర అత్యాధునిక/అత్యున్నత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించిందిరక్షణ మంత్రి సందర్శన సందర్భంగా రక్షణ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిరక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానేఇతర రక్షణఉన్నతాధికారులు పాల్గొన్నారు

ఏడాదికి రెండుసార్లు జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాల్లో కీలకమైన వ్యూహాత్మక పాలనాపరమైన అంశాలను నావికాదళ కమాండర్లు చర్చిస్తారుఎప్పటికప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులుభౌగోళిక వ్యూహాత్మక అంశాలుపశ్చిమాసియాలో తలెత్తుతున్న ప్రాంతీయ సవాళ్లుతీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సంక్లిష్టమైన సమస్యల దృష్ట్యా భారత నావికాదళ పాత్రను తీర్చిదిద్దడంలో ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి

ఈ అత్యున్నత స్థాయి సదస్సులు భారత తీర ప్రాంత ప్రయోజనాలను కాపాడగలమన్న నౌకాదళ నిబద్ధతకు వేదికగా నిలుస్తూనావికాదళ యుద్ధసన్నద్ధతవిశ్వసనీయతఐక్యతసవాళ్ళకు సన్నద్ధంగా ఉండే నావికాదళ ప్రతిష్ఠకు గుర్తుగా నిలుస్తున్నాయి.

***



(Release ID: 2056971) Visitor Counter : 30