సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ సదస్సు


శ్వేత విప్లవం 2.0 తో పాటు, 2 లక్షల కొత్త బహుళ ప్రయోజన వ్యవసాయ పరపతి సంఘాలు, (ఎం.పి.ఎ.సి.ఎస్ ), పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతం కోసం- 'మార్గదర్శిక' నీ, సహకార సంఘాల మధ్య సహకారం కోసం- ఎస్ఓపీని ప్రారంభించిన శ్రీ అమిత్ షా

మహిళల స్వావలంబన, సాధికారతతో పాటు పోషకాహార లోపంపై పోరాటాన్ని బలోపేతం చేయనున్న శ్వేత విప్లవం 2.0

మోదీ 3.0 తొలి 100 రోజుల్లో తీసుకున్న 10 కార్యక్రమాలు సహకార రంగాన్ని స్వయం సమృద్ధిగా, విస్తృత ఆధారితంగా మార్చడానికి పనిచేస్తాయి.

పాడి పశువుల వ్యాపారం, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది

ఇకపై విదేశాల నుంచి పాడి పరిశ్రమకు సంబంధించిన ఎటువంటి యంత్రాలనూ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. 100 శాతం భారత్ లోనే తయారవుతాయి.

రెండు లక్షల ప్రాథమిక సహకార సంఘాలు నమోదైతే పిఎసిఎస్ లు, డెయిరీ, మత్స్య సహకార సంఘాలు లేని పంచాయతీ దేశంలో ఒక్కటి కూడా ఉండదు.

పిఎసిఎస్ లను 25 రకాల పనులకు అనుసంధానం చేయడం ద్వారా వాటిని లాభసాటిగా తీర్చిదిద్దుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వావలంబన సాధించడానికి, స

Posted On: 19 SEP 2024 8:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజుల్లో సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న కార్యక్రమాలపై కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు న్యూఢిల్లీలో ఒక జాతీయ సదస్సు జరిగిందిఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమపంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ శ్రీ లలన్ సింగ్సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా శ్వేత విప్లవం 2.0 తో పాటు, 2 లక్షల కొత్త బహుళ ప్రయోజన వ్యవసాయ పరపతి సంఘాలు, (ఎం.పి..సి.ఎస్ ), పాడిమత్స్య సహకార సంఘాల ఏర్పాటుబలోపేతం కోసం 'మార్గదర్శికనుసహకార సంఘాల మధ్య సహకారం కోసం ఎస్ఓపీని శ్రీ అమిత్ షా ప్రారంభించారు.

జాతీయ సదస్సులో శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాతతొలి 100 రోజుల్లో సహకార మంత్రిత్వ శాఖ 10 ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టిందనివాటిలో మూడు కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయని అన్నారు. 15కు పైగా వివిధ రకాల కార్యకలాపాలతో నిమగ్నమైన సహకార ఉద్యమాన్ని సమగ్ర విధానంతోసమాన అభివృద్ధితో దేశంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లడానికి జాతీయ స్థాయిలో సహకార మంత్రిత్వ శాఖ ఉండాలనే డిమాండు చాలా ఏళ్లుగా ఉందని ఆయన అన్నారుదాదాపు 70 ఏళ్లుగా అధికారంలో ఉన్నవారు ఈ డిమాండుపై దృష్టి పెట్టలేదనికానీ చివరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారుదేశ తొలి సహకార శాఖ మంత్రిగా ప్రధాని మోదీ తనకు గౌరవాన్ని ఇవ్వడం తన అదృష్టమని శ్రీ అమిత్ షా అన్నారు.

సహకారం అనేది వ్యక్తుల బలాలను కలుపుతుందనిదానిని సమాజ సామర్థ్యంగా మారుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారుఅందరూ కలిసి రావాలనిఒకరి మంచి గుణాలను ఒకరు పంచుకోవాలనిలోపాలను పక్కన పెట్టి ఒకరికొకరు కలిసి పనిచేయాలనిదేశాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సహకార మంత్రం... పిలుపు ఇస్తున్నట్టు శ్రీ అమిత్ షా తెలిపారుసహకార మంత్రం అనేక చోట్ల అద్భుత ఫలితాలను ఇచ్చిందనికానీ చాలా కాలంగా మన దేశంలో సహకార ఉద్యమం అసంబద్ధంగా మారుతోందని ఆయన అన్నారుగత 70 ఏళ్లలో సహకార సంఘాల్లో చేయాల్సిన మార్పులు చేయలేదనికొన్ని రాష్ట్రాల్లో సహకార సంఘాలు విజయవంతంకాగామరికొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకే వదిలేశారనిఇంకొన్ని రాష్ట్రాల్లో అది పూర్తిగా కనుమరుగైందని అన్నారు.

సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడినప్పుడుదేశంలోని ప్రతి జిల్లాగ్రామంలో సహకార సంస్థలను పునరుద్ధరించడంసహకార చట్టాలుదాని వ్యవస్థలుసంస్కృతి ప్రస్తుత అవసరాలకుకొత్త ప్రారంభానికి అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర సహకార మంత్రి తెలిపారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఉపాధి అందించడమే కాకుండాదేశ సౌభాగ్యానికిప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి సహకార రంగం పని చేయాలని అన్నారుఈ లక్ష్య సాధన కోసం గత మూడేళ్లలో ఎంతో కృషి చేశామనిఇందులో భాగంగా ఇప్పటివరకు 60కి పైగా కొత్త కార్యక్రమాలు చేపట్టామని తెలిపారుగడచిన 100 రోజుల్లో తీసుకున్న 10 కార్యక్రమాలు సహకార రంగాన్ని పరిపూర్ణం చేయడంలో ఎంతో దోహదం చేస్తాయని శ్రీ షా అన్నారుదేశవ్యాప్తంగా రెండు లక్షల ఎం పి ఎ సి ఎస్పాడిమత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు సంయుక్తంగా ప్రతిపాదనలు రూపొందించి పంపించామనిఅన్ని రాష్ట్రాలు వీటిని ఆమోదించాయని చెప్పారుఒక్కసారి గనుక రెండు లక్షల ప్రాథమిక సహకార సంఘాలు నమోదైతేపిఎసిఎస్ లుడెయిరీమత్స్య సహకార సంఘాలు లేని పంచాయతీ దేశంలో ఒక్కటి కూడా ఉండదని పేర్కొన్నారుఇది జరిగితే సహకార సంఘాలన్ని దేశం మొత్తంగా ఏర్పాటు చేసుకోగలుగుతామని తహసీల్జిల్లా స్థాయిలో సహకార సంస్థల ఏర్పాటుకు దారితీస్తుందనిరాష్ట్ర సంస్థలు కూడా కొత్త బలాన్నిఊపును సంతరించుకుంటాయని అన్నారు.

మొదట్లో ఏర్పాటైన పిఎసిఎస్ లు మూతపడ్డాయనిఅయితే కొత్తగా నమోదు కానున్న పిఎసిఎస్ లను 25 రకాల పనులను చేర్చి విస్తృత ప్రాతిపదిక కలిగిన సంస్థలుగా చేస్తామని శ్రీ అమిత్ షా తెలిపారుగతంలో పిఎసిఎస్ లు వ్యవసాయానికి స్వల్పకాలిక రుణాలు ఇచ్చేవనికానీ ఇప్పుడు డెయిరీఫిషరీస్గోదాముచౌక ధాన్యాల దుకాణంచౌక మందుల దుకాణంపెట్రోల్ బంక్ఎల్పీజీ సిలిండర్నీటి సరఫరా మొదలైన వాటి నిర్వహణతో పిఎసిఎస్ లను అనుసంధానం చేశామన్నారుదీంతో ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ లు మూడంచెల సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాయిపిఎసిఎస్ లు బలపడితేవాటి సంఖ్య పెరిగినప్పుడు జిల్లా సహకార బ్యాంకులు వాటికవే బలపడతాయనిజిల్లా సహకార బ్యాంకుల బలోపేతం వల్ల రాష్ట్ర సహకార బ్యాంకులు బలోపేతమవుతాయని అన్నారు.


 

శ్వేత విప్లవం 2.0 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపిను ఈ రోజు విడుదల చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారుశ్వేత విప్లవం 2.0 మహిళా స్వావలంబనమహిళా సాధికారత కోసం పనిచేస్తుందన్నారుతల్లులుసోదరీమణులు పాల ఉత్పత్తితోముఖ్యంగా సహకార డెయిరీలతో సంబంధం కలిగి ఉన్నారని ఆయన అన్నారుమన తల్లులనుసోదరీమణులను బలోపేతం చేసివారికి స్వావలంబనస్వతంత్రత కల్పించడంలో పాడి పరిశ్రమకు మించింది మరొకటి లేదని పేర్కొన్నారుగుజరాత్ లో 36 లక్షల మంది సోదరీమణులు పాడిపరిశ్రమలో భాగస్వాములయ్యారనివారు మొత్తం రూ.60,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారని చెప్పారుఈ రోజు అమూల్ మొత్తం ప్రపంచంలో ఆహార రంగానికి అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ గా మారిందని ఆయన అన్నారుశ్వేత విప్లవం 2.0 ఒక వైపు మహిళలకు సాధికారత కల్పించడం తో పాటుమరో వైపు పోషకాహార లోపంపై పోరాటానికి కూడా ఇది బలాన్ని ఇస్తోందని ఆయన అన్నారుపాల లభ్యత పెరిగితే పేదలుపౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారుగుజరాత్ ఉదాహరణగా పేర్కొంటూపాడిపరిశ్రమతో సంబంధం ఉన్న తల్లి ఎల్లప్పుడూ తన పిల్లలకు సరైన పోషణను అందిస్తుందని ఆయన అన్నారుపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని ప్రభుత్వాల కృషి కంటే మన తల్లుల కృషితోనే నిర్మూలించగలమని శ్రీ అమిత్ షా అన్నారు.

తల్లులుసోదరీమణులు మన ఇళ్లలో చాలా పనులు చేస్తారనిఅయినా వారిని నిరుద్యోగులుగా పరిగణిస్తున్నారని అంటూ శ్వేత విప్లవం 2.0 ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తుందన్నారుబ్యాంకు చెక్కులు మహిళల పేరిట వస్తే వారు ఎంతో సంతోషిస్తారని అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహజ సేద్యం కోసం భారీ ప్రచారం ప్రారంభించారని శ్రీ అమిత్ షా అన్నారు. పశుపోషణ వ్యాపారాన్ని కొనసాగించడం ద్వారా సహజ సేద్యం బలోపేతం అవుతుందనిపశువుల పేడ తోనే ప్రకృతి వ్యవసాయం విజయవంత మవుతుందని ఆయన అన్నారు.

పశుపోషణ ద్వారా సాగుభూముల సారాన్ని పెంచే పని కూడా జరుగుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. ఈ లక్ష్యాలను ఒకచోట చేర్చి శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం చుట్టామని చెప్పారుఈ కార్యక్రమానికి బడ్జెట్ లో నిధులు లభిస్తాయా లేదా అని చాలా మంది భయపడుతున్నారనిఅయితే ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశం అనిఈ కార్యక్రమానికి పూర్తి బడ్జెట్ మద్దతు లభిస్తుందని పశుసంవర్ధక శాఖకు హామీ ఇస్తున్నామని ఆయన చెప్పారు.

"సహకార సంఘాల మధ్య సహకారంరూపంలో ఒక ముఖ్యమైన చొరవ తీసుకున్నట్లు శ్రీ అమిత్ షా చెప్పారుదీని కింద గుజరాత్ లోని పంచమహల్బనస్కాంత అనే రెండు జిల్లాల్లో ప్రయోగాలు నిర్వహించామని చెప్పారుసహకార రంగంలోని అన్ని సంస్థల బ్యాంకు ఖాతాలను సహకార బ్యాంకుల్లో తెరవాలని నిర్ణయించామని చెప్పారువీటితో పాటు ప్రాథమిక సహకార సంఘంపాల ఉత్పత్తిదారుల కమిటీతో సంబంధం ఉన్న తల్లులుసోదరీమణులకు డెబిట్క్రెడిట్ కార్డులు ఇవ్వడంతో వారు ఆర్థికంగా బలోపేతం అయ్యారుఇందులో భాగంగా ఇప్పటి వరకు సహకార బ్యాంకుల్లో నాలుగు లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా కేవలం రెండు జిల్లాల్లోనే రూ.550 కోట్లకు పైగా జమ అయ్యాయి. 1732 మైక్రో ఏటీఎంలను ప్రారంభించి 20 వేల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేశారుకొత్త క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు 24 లక్షల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరిగాయిగుజరాత్ లో ఇప్పటి వరకు ఇది పూర్తిస్థాయిలో అమలు కాకున్నా ఇప్పటివరకు లక్షలకు పైగా ఖాతాలు తెరిచారనిసహకార బ్యాంకుల్లో సుమారు రూ.4 వేల కోట్ల డిపాజిట్లు పెరిగాయని చెప్పారుఇందులో భాగంగా మొత్తం 2600 మైక్రో ఏటీఎంలను పంపిణీ చేశామనిఇప్పుడు దాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెడుతున్నామని తెలిపారు.


 

సౌలభ్యం కోసం ఈ కార్యక్రమానికి జిల్లాను యూనిట్ గా చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. సహకార వ్యాపారం బాగున్న జిల్లాల్లో 'సహకార సంఘాల మధ్య సహకారంఅనే కాన్సెప్ట్ ను ప్రారంభించనున్నారుబీహార్ లోని ప్రతి జిల్లా లేదా తహసీల్ లో సహకార సంఘాలను చూస్తారని ఆయన అన్నారుసహకార మంత్రిత్వ శాఖకు ప్రతి పంచాయతీప్రతి తాలూకాప్రతి జిల్లాదేశంలోని ప్రతి రాష్ట్రం వివరాలు (డేటాబేస్ఉన్నాయనిజాతీయ డేటాబేస్ కూడా ఉందని ఆయన అన్నారుదీని ద్వారా ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయిఅవి ఏ రకంవాటి ఆడిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చుసహకార డేటాబేస్ ను జిల్లా/రాష్ట్ర సహకార రిజిస్టర్ లోనూ జిల్లా సహకార బ్యాంకు శాఖల్లోనూ అందుబాటులో ఉంచామని తెలిపారు.

నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ (ఎన్ డిడిబికొత్త డెయిరీలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తోందని శ్రీ అమిత్ షా చెప్పారుఇందుకోసం శాస్త్రీయ ఏర్పాట్లు చేశామనిఅన్ని రకాల ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

శ్వేత విప్లవ రంగంలో భారత్ ఒక వెలుగు తారగా అవతరించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి అన్నారుప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ అవతరించిందిపశువుల దాణావిత్తనాలుకృత్రిమ గర్భధారణఆవు పేడ కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుదలజంతువుల ఆరోగ్యం వంటి రంగాల్లో సమూల మార్పులు వచ్చాయిదీన్ని మరింత బలోపేతం చేయడం వల్ల డెయిరీ ద్వారా కూడా విదేశీ కరెన్సీని సంపాదించవచ్చని ఆయన అన్నారు. ‘‘మనం మన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ కు కూడా ఎగుమతి చేస్తాందీని కోసంపరీక్షా పరికరాలుబల్క్ పాల సేకరణ పాడి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 38 పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వం ఒక శాస్త్రీయ కార్యక్రమాన్ని నిర్వహించిందిదీనిని రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి మన ముందు ఉంచుతారునెదర్లాండ్స్జపాన్ నుంచి డెయిరీ యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక లేదువాటి 100% ఉత్పత్తి భారతదేశంలో జరుగుతుందిఒక రకంగా పాడిపరిశ్రమలో పూర్తిగా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’’ అని శ్రీ అమిత్ షా అన్నారు

 

***


(Release ID: 2056966) Visitor Counter : 82