మంత్రిమండలి
ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,
ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
Posted On:
18 SEP 2024 3:20PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.
2024-25 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించినట్లు సుమారు 63,000 గ్రామాల్లోని 5 కోట్లకు పైగా గిరిజన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 549 జిల్లాలు, 2,740 బ్లాకుల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా 10.45 కోట్లు కాగా, దేశవ్యాప్తంగా 705కు పైగా గిరిజన తెగలు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చాలని ప్రధాన మంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ సాధించే విజయం, దీని ద్వారా నేర్చుకున్న విషయాల ఆధారంగా గిరిజన సమజాలను, ప్రాంతాలను సమగ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ మిషన్లో 25 రకాలుగా సహాయం అందనుంది. వీటిని 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తాయి. నిర్ణీత కాలవ్యవధితో తమకు కేటాయించిన పనులను చేపడుతూ.. ప్రతి మంత్రిత్వ శాఖ ఈ పథకం అమలులో బాధ్యత వహించనుంది. ఈ కింది లక్ష్యాలను సాధించడానికి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (డీఏపీఎస్టీ) కింద రాబోయే 5 సంవత్సరాలకు నిధులు కేటాయించారు.
లక్ష్యం-1: మౌలిక సదుపాయాల అభివృద్ధి:
(i) ఇతర సదుపాయాలతో పాటు అర్హులైన కుటుంబాలకు పక్కా ఇళ్లు: అర్హత కలిగిన ఎస్టీ కుటుంబానికి గ్రామీణ పీఎంఏవై కింద పక్కా గృహాలు అందించాలి. నల్లా నీటి సదుపాయం (జల్ జీవన్ మిషన్), విద్యుత్ సదుపాయం (ఆర్డీఎస్‌ఎస్) ఉండేలా చూడాలి. అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డు (పీఎంజేఏవై) అందించాలి.
(ii) గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం: పీఎంజీఎస్‌వై కింద ఎస్టీ మెజారిటీ గ్రామాలకు అన్ని కాలాల్లో పనిచేసే రోడ్డు సదుపాయం, భారత్ నెట్ కింద మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్.. ఎన్‌హెచ్ఎం, సమగ్ర శిక్ష, పోషణ్ అభియాన్ కింద ఆరోగ్యం, పోషకాహారం, విద్య సదుపాయాలను మెరుగుపరిచాలి.
లక్ష్యం-2: ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం:
(iii) నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ప్రోత్సహించటం, మెరుగైన జీవనోపాధి (స్వయం ఉపాధి) - శిక్షణ పొందేందుకు కావాల్సిన వనరులు కల్పించటం (స్కిల్ ఇండియా మిషన్ లేదా జేఎస్ఎస్), ఎస్టీ బాలబాలికలు 10, 12వ తరగతి తర్వాత దీర్ఘకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులకు ప్రతి సంవత్సరం అందుకునేలా వనరులను కల్పించటం. ఇంకా, గిరిజన మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్ (టీఎంఎంసీ), టూరిస్టు హోమ్ స్టేలు, ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు వ్యవసాయం, పశుసంవర్ధక, చేపల పెంపకంలో మద్దతునిస్తూ మార్కెటింగ్ కల్పించటం.
లక్ష్యం-3: మంచి విద్య అందరికి అందేలా చూడటం:
(iv) విద్య - పాఠశాల, ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని జాతీయ స్థాయికి సమానంగా తీసుకెళ్లటం. జిల్లా, బ్లాక్ స్థాయిలోని పాఠశాలల్లో గిరిజన వసతి గృహాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సరసమైన ధరల్లో, అందరికి అందుబాటులో ఉండేలా చూడడం (సమగ్ర శిక్షా అభియాన్).
లక్ష్యం-4: ఆరోగ్యకరమైన జీవితం, గౌరవప్రదమైన వృద్ధాప్యం:
(v) ఆరోగ్యం - ఎస్టీ కుటుంబాలకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం. ఐఎంఆర్, ఎంఎంఆర్‌లో జాతీయ ప్రమాణాలకు చేరుకోవడం. మైదాన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం 10 కిలో మీటర్లు, కొండ ప్రాంతాల్లో 5 కిలో మీటర్ల కంటే దూరం ఉంటే ఆయా ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ కింద రోగనిరోధక టీకాలు అందించటం.
ప్రధాన మంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పరిధిలోకి వచ్చే గిరిజన గ్రామాలను సంబంధిత మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తూ పీఎం గతిశక్తి పోర్టల్‌లో మ్యాపింగ్ చేస్తారు. భౌతిక, ఆర్థిక పురోగతిని ఈ పోర్టల్ ద్వారా పర్యవేక్షించి ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలకు అవార్డులు అందజేయనున్నారు.
17 మంత్రిత్వ శాఖలకు సంబంధించి మిషన్ లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
S. No.
|
మంత్రిత్వ శాఖ
|
తీసుకోవాల్సిన చర్యలు/ పథకాలు
|
లబ్ధిదారుల సంఖ్య
|
1
|
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌డీ)
|
పక్కా గృహాలు- (పీఎంఏవై- గ్రామీణ)
|
20 లక్షల ఇళ్లు
|
కనెక్టింగ్ రోడ్ - (పీఎంజీఎస్‌వై)
|
25000 కి.మీ రహదారి
|
2
|
జల శక్తి మంత్రిత్వ శాఖ
|
నీటి సరఫరా-జల్ జీవన్ మిషన్ (జేజేఎం)
|
(i). అర్హత ఉన్న ప్రతి గ్రామం
(ii) 20కి సమానంగా లేదా తక్కువగా కుటుంబాలు ఉన్న 5,000 గ్రామాలు
|
3
|
విద్యుత్ మంత్రిత్వ శాఖ
|
గృహ విద్యుదీకరణ- (పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం- ఆర్‌డీడీఎస్)
|
ప్రతి విద్యుత్ లేని ఇళ్లు , ప్రభుత్వ కార్యాలయం
(సుమారు 2.35 లక్షలు)
|
4
|
నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
|
ఆఫ్-గ్రిడ్, నూతన సౌర విద్యుత్ పథకం
|
(i). గ్రిడ్‌కు అనుసంధానం కాని విద్యుదీకరించని ప్రతి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయం
|
5
#VALUE!
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
|
మొబైల్ మెడికల్ యూనిట్లు- జాతీయ ఆరోగ్య మిషన్
|
1000 మొబైల్ మెడికల్ యూనిట్ల వరకు
|
ఆయుష్మాన్ కార్డ్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)-ఎన్‌హెచ్ఏ
|
ఈ పథకం పరిధిలోకి వచ్చే ప్రతి అర్హత కలిగిన కుటుంబం
|
6
|
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ
|
ఎల్‌పీజీ కనెక్షన్లు-(పీఎం ఉజ్జ్వల యోజన)
|
25 లక్షలు కుటుంబాలు
( పథకం లక్ష్యాల ఆమోదానికి లోబడి, పథకం కొనసాగింపు ఆధారపడి)
|
7
|
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
|
అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు- పోషణ్ అభియాన్
|
8000 (2000 కొత్త సక్షం అంగన్‌వాడీ కేంద్రాలు, 6000 కేంద్రాలను సక్షం అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయటం)
|
8
|
విద్యా మంత్రిత్వ శాఖ
|
వసతి గృహాల నిర్మాణం-సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)
|
1000 హాస్టళ్లు
|
9
|
ఆయుష్ మంత్రిత్వ శాఖ
|
పోషణ వాటికలు- నేషనల్ ఆయుష్ మిషన్
|
700 పోషణ వాటికలు
|
10
|
టెలికాం శాఖ
|
యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్/భారత్ నెట్ (డీఓటీ-ఎంఓసీ)
|
5000 గ్రామాలు
|
11
|
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
|
స్కిల్ ఇండియా మిషన్ (ఇప్పటికే ఉన్న పథకాలు)/ప్రతిపాదనలో ఉన్నవి
|
గిరిజన జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు
|
1000 VDVKలు, గిరిజన సమూహాలు మొదలైనవి
|
12
|
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
|
డిజిటల్ ఇనిషియేటివ్స్
|
వర్తించే విధంగా
|
13
|
వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
|
సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం - వ్యవసాయం శాఖ పరిధిలోని పలు పథకాలు
|
ఎఫ్‌ఆర్‌ఓ పట్టాదారులు
(సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులు)
|
14
|
మత్స్య శాఖ
|
చేపల పెంపకంలో సహాయం-ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)
|
10,000 సామాజిక, 1,00,000 వ్యక్తిగత లబ్ధిదారులు
|
|
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ
|
పశువుల పెంపకం- నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్
|
8500 వ్యక్తిగత/సామూహిక లబ్ధిదారులు
|
15
|
పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ
|
సామర్థ్య పెంపు-రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ)
|
అటవీ హక్కులకు సంబంధించిన సబ్ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి, గ్రామ స్థాయి అధికారులు
|
16
|
పర్యాటక మంత్రిత్వ శాఖ
|
గిరిజన హోమ్ స్టేలు-స్వదేశ్ దర్శన్
|
మొత్తం 5వేల గిరిజన హోమ్ స్టేలు.. కొత్త గిరిజన హోమ్ స్టేలకు సంబంధించి రూ. 5 లక్షల సహాయం, పనురుద్ధరణకు సంబంధించి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం, గ్రామ సామాజిక అవసరాల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం
|
17
|
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
|
ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన (పీఎంఏఏజీవై)
|
ఇతర సహాయాలతో పాటు ప్రత్యేక కేంద్ర ఆర్థిక సహాయం(ఎస్‌పీఏ) పరిధిని గిరిజన అభివృద్ధి /పీఎంఏఏజీవై విస్తరించటం
|
100 గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రాలు.. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వం గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు, సికిల్ సెల్ డిసీజ్(ఎస్‌సీడీ)కి సంబంధించిన సామర్థ్య, కౌన్సెలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం… ఎఫ్‌ఆర్ఏ, సీఎఫ్‌ఆర్ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకు సహాయం, ఎఫ్‌ఆర్‌ఏ సెల్స్ ఏర్పాటు, అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న గిరిజన జిల్లాలకు ప్రోత్సాహకాలతో పాటుగా ప్రాజెక్ట్ నిర్వహణ నిధులు.
|
రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో చర్చించిన తరువాత గిరిజన ప్రాంతాల నిర్దిష్ట అవసరాల ఆధారంగా గిరిజనులు, అటవీ నివాస సమాజాల్లో జీవనోపాధిని ప్రోత్సహించడానికి, ఆదాయాన్ని సృష్టించడానికి కొన్ని వినూత్న పథకాలను ఈ పథకం రూపొందించింది.
ట్రైబల్ హోమ్ స్టే: గిరిజన ప్రాంతాల పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు, గిరిజన సమాజానికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా స్వదేశ్ దర్శన్ కింద 1000 హోమ్ స్టేలను నిర్మించేందుకు సహాయం అందించనున్నారు. పర్యాటక సామర్థ్యం ఉన్న గ్రామాల్లో ఒక్కో ఊరిలో 5 నుంచి 10 హోమ్ స్టేల నిర్మాణానికి సంబంధించి గిరిజన కుటుంబాలకు, గ్రామానికి నిధులు సమకూరుస్తారు. ప్రతి ఇంటికి రెండు కొత్త గదుల నిర్మాణానికి రూ.5 లక్షలు, ప్రస్తుతం ఉన్న గదుల పునరుద్ధరణకు రూ.3 లక్షలు, గ్రామ సామూహిక అవసరాల కోసం రూ.5 లక్షల సహాయం అందించనున్నారు.
అటవీ హక్కులు (ఎఫ్‌ఆర్ఏ) కలిగి ఉన్న వారికి సుస్థితర జీవనోపాధి: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న 22 లక్షల మంది ఎఫ్ఆర్ఏ పట్టాదారులపై ఈ మిషన్ ప్రత్యేక దృష్టి సారించనుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓఏఎఫ్‌డబ్ల్యూ).. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖతో కలిసి వివిధ పథకాల ప్రయోజనాలను ఏకీకృతం చేసి అందిస్తుంది. అటవీ హక్కులను గుర్తించడం, పొందే ప్రక్రియను వేగవంతం చేయడం.. అటవీ నిర్వహణ, సంరక్షణలో గిరిజన సమాజాలకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ పథకాల సహాయంతో వారికి స్థిరమైన జీవనోపాధిని అందించడం వీటి లక్ష్యం. పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించటంతో పాటు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని భాగస్వాములు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం: మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు… స్థానిక విద్యా వనరులను అభివృద్ధి చేయడం, నమోదు, విద్యను కొనసాగించటాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గిరిజన పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రధానమంత్రి-శ్రీ పాఠశాలల తరహాలో అప్‌గ్రేడ్ చేయాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణకు అధునాతన సదుపాయాలు: ప్రసవానికి ముందు రోగ నిర్ధారణపై ప్రత్యేక దృష్టితో సరసమైన ధరల్లో, అందరికి అందుబాటులో ఉండే రోగనిర్ధారణ, ఎస్‌సీడీ నిర్వహణ సౌకర్యాలను అందించటం. భవిష్యత్తులో ఎస్‌సీడీ జననాలను నివారించడం ద్వారా వ్యాధి ప్రాబల్యాన్ని తగ్గించడానికి, సికిల్ వ్యాధి ప్రబలంగా ఉన్న, ఈ వ్యాధికి నిర్వహణ నైపుణ్యం అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లోని ఎయిమ్స్, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలో సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ (సీఓసీ) ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రసవానంతర రోగ నిర్ధారణ కోసం కావాల్సిన సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది, పరిశోధన సామర్థ్యాలను ఈ కేంద్రం కలిగి ఉంటుంది. ఒక్కో సీఓసీపై రూ. 6 కోట్లు ఖర్చు చేయనున్నారు.
గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం (టీఎంఎంసీ): గిరిజన ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడానికి.. మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, అవగాహన, బ్రాండింగ్, ప్యాకేజింగ్, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి 100 టీఎంఎంసీలను ఏర్పాటు చేయనున్నారు. గిరిజన ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులకు సరైన ధర పొందడానికి, వాటిని నేరుగా గిరిజనుల నుంచి సరైన ధరకు కొనుగోలు చేయడానికి ఇవి వీలు కల్పించనున్నాయి. అంతేకాక, ఈ టీఎంఎంసీలను మధ్యవర్తి, విలువ జోడింపు ప్లాట్‌ఫామ్‌గా రూపొందించనున్నారు. పంట కోత అనంతర, ఉత్పత్తి అనంతర నష్టాలను తగ్గించడానికి, ఉత్పత్తి విలువను కాపాడుకోవటానికి ఇది సహాయపడుతుంది.
ప్రధాన మంత్రి జన్ జతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మన్) నుంచి నేర్చుకున్న విషయాలు, దాని విజయం ఆధారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని పీవీటీజీ జనాభాపై దృష్టిలో ఉంచుకొని రూ. 24104 కోట్ల నిధులతో 2023 నవంబర్ 15న జన్ జతీయ గౌరవ్ దివస్ నాడు గౌరవ ప్రధాన మంత్రి ప్రారంభించారు.
సహకార సమాఖ్య విధానానికి ప్రధాన మంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ ఒక ప్రత్యేక ఉదాహరణ. వివిధ పథకాల కలయిక ద్వారా ప్రజా సంక్షేమం కోసం మొత్తం ప్రభుత్వం పనిచేసే విధానాన్ని ఇది తెలియజేస్తుంది.
***
(Release ID: 2056567)
Visitor Counter : 119
Read this release in:
Nepali
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam