హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంపూర్ణ స్వచ్ఛత, ప్రభుత్వంలో పెండింగ్ ఉండరాదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో హోం శాఖ - కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో క్రియాశీలంగా సాగుతున్న ప్రత్యేక ప్రచారం 4.౦


మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచారం లో భాగంగా పని ప్రదేశాలను సుస్థిర, పర్యావరణహితంగా మార్చడంపై దృష్టి - పెండింగ్‌లో ఉన్న సూచనలు, పార్లమెంట్ హామీలు, మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు, ప్రజా ఫిర్యాదులు/అప్పీళ్ల పరిష్కారం, రికార్డులను మెరుగ్గా నిర్వహించేందుకు ప్రాధాన్యం

స్పెషల్ క్యాంపెయిన్ 3.0 కు కొనసాగింపుగా, నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు నెలవారీగా పెండింగ్ అంశాలను తగ్గించడానికి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించిన మంత్రిత్వ శాఖ

పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన 352 ప్రతిపాదనలు, 10 పార్లమెంటరీ హామీలు, 3 క్యాబినెట్ ప్రతిపాదనలు, 70 రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, 29 ప్రధాన మంత్రి కార్యాలయం సూచనల పరిష్కారం

ప్రజల నుంచి స్వీకరించిన 40,894 ఫిర్యాదులు, 3173 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లను పరిష్కరించిన మంత్రిత్వ శాఖ

సామాన్య ప్రజలతో సంబంధం ఉన్న ఫీల్డ్/ఔట్‌స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టితో వివిధ ప్రాంతాల్లో 4613 స్వచ్ఛతా ప్రచారాలను నిర్వహించిన మంత్రిత్వ శాఖ

సి ఎ పి ఎఫ్ కార్యాలయాల్లో పనికి రాని సామగ్రి, ఫైళ్లు తొలగించడంతో అందుబాటులోకి వచ్చిన1,04,483 చదరపు అడుగుల స్థలం

Posted On: 18 SEP 2024 5:06PM by PIB Hyderabad

స్వచ్ఛతను క్రమం తప్పక పాటించేలా చూడటానికి, ప్రభుత్వంలో పెండింగ్ ను తగ్గించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి  పొందిన ప్రేరణతో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రత్యేక ప్రచారం 4.0  ను క్రియాశీలకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రచారం 4.0లో సన్నద్ధత దశ (సెప్టెంబర్ 15-30), అమలు దశ (2024 అక్టోబర్ 2-31) అనే రెండు దశలు ఉంటాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీ ఏ ఆర్ పీ జీ  )ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. మంత్రిత్వ శాఖలో చేపట్టిన ప్రత్యేక ప్రచారంతో  పెండింగ్ లో ఉన్న పార్లమెంటు సభ్యుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలు, పార్లమెంటు హామీలు, మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు , ప్రజా ఫిర్యాదుల/అప్పీళ్ల పరిష్కారం, రికార్డ్ ల మెరుగైన నిర్వహణ తో పాటు పని ప్రదేశాలను సుస్థిరంగా, పర్యావరణహితంగా ఉంచడంపై దృష్టి పెట్టింది.  

స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అమలును మంత్రిత్వ శాఖలో అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) ,సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ (సిపిఒ)లకు , ఈ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ప్రాముఖ్యతను వివరించి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు సమష్టిగా పనిచేయాలని ప్రోత్సహిస్తున్నారు.

స్పెషల్ క్యాంపెయిన్ 3.0కు కొనసాగింపుగా 2023 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు నెలవారీగా పెండింగ్ అంశాలను తగ్గించడానికి హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ సమయంలో  ఎంపీలు చేసిన 352 ప్రతిపాదనలు , 10 పార్లమెంటరీ హామీలు, 3 క్యాబినెట్ ప్రతిపాదనలు, 70 రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, 29 ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలను పరిష్కరించారు. అలాగే, నవంబర్ 2023 నుండి ఆగస్టు 2024 మధ్య మొత్తం 40,894 ప్రజా ఫిర్యాదులు,.  3173 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లను ను మంత్రిత్వ శాఖ పరిష్కరించింది.

సామాన్య ప్రజలతో సంబంధం ఉన్న ఫీల్డ్/ఔట్‌స్టేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టితో  వివిధ ప్రాంతాల్లో 4613 స్వచ్ఛతా ప్రచారాలను మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సి ఎ పి ఎఫ్ కార్యాలయాల్లో పనికి రాని సామగ్రి, ఫైళ్లు తొలగించడంతో 1,04,483 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాలు అప్‌లోడ్ చేసే విధంగా, ఒక అంతర్  మంత్రిత్వ శాఖ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేశారు. అన్ని విభాగాలతో సమర్థంగా సమన్వయం చేసుకోవడానికి, తద్వారా ఎటువంటి జాప్యం లేకుండా సరైన డేటాను పొందడానికి ఇది ఎంహెచ్ఏ అనుసరించిన ఉత్తమ పద్ధతులలో ఒకటి.

***



(Release ID: 2056551) Visitor Counter : 26