రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

18-20 వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో రాష్ట్రపతి పర్యటన

प्रविष्टि तिथि: 17 SEP 2024 8:50PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
18న జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ) 18వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
19న మధ్య‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉజ్జయినిలో సఫాయి మిత్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోర్-ఉజ్జయిని ఆరు వరుసల రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదే రోజు ఇండోర్‌లోని దేవీ అహల్య విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
20న జార్ఖండ్‌ రాంచీలోని ఐసీఏఆర్ -నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ శతాబ్ది ఉత్సవాలకు హాజరై ప్రసంగిస్తారు.


(रिलीज़ आईडी: 2056250) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Tamil , Kannada , Malayalam