ప్రధాన మంత్రి కార్యాలయం
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
17 SEP 2024 9:07AM by PIB Hyderabad
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారు. నిర్మాణ రంగం తోను, సృజనాత్మక రంగం తోను ముడిపడ్డ నిపుణులకు, కష్టించి పనిచేసే సృజనశీలురు అందరికీ నేను నమస్కరిస్తున్నాను అని ఆయన అన్నారు. స్వయంసమృద్ధియుక్త భారతదేశాన్ని, ‘వికసిత్ భారత్’ను నిర్మించుదాం అనే సంకల్పాన్ని సాధించుకోవడంలో వారు అందించే తోడ్పాటు సాటిలేనిది కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఇచ్చిన సందేశంలో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘విశ్వకర్మ జయంతి నాడు దేశప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు. నిర్మాణంతోను, సృజనతోను ముడిపడ్డ మన ప్రతిభావంతులకు, కష్టపడి పనిచేసే సహచరులకందరికీ ఈ సందర్భంగా నా ప్రత్యేక వందనాలు. ‘వికసిత్ భారత్’ సంకల్పం, ఇంకా ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పం.. ఈ రెండు సంకల్పాలూ సిద్ధించేటట్టు చూడడంలో మీ తోడ్పాటు అసమానమైందిగా ఉండబోతోంది అని నేను విశ్వసిస్తున్నాను.’’
(रिलीज़ आईडी: 2055861)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam