హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


నిరుపేద కుటుంబంలో జన్మించి నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీజీ

పదిహేను దేశాలు శ్రీ నరేంద్ర మోదీని ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలతో గౌరవించాయి

ఇది శ్రీ నరేంద్ర మోదీకే కాకుండా మన దేశమంతటికీ గర్వకారణం

మోదీ ప్రభుత్వ మూడవ హయాంలో తొలి 100రోజుల్లో ‘అభివృద్ధి చెందిన భారత్’ నిర్మాణానికి బలమైన పునాది పడింది

ఈ 100రోజుల్లో సమాజంలోని అన్ని వర్గాల పేదలకూ అభివృద్ధి, సంక్షేమాలు సమంగా అందాయి

మోదీ ప్రభుత్వ మూడవ హాయంలో తొలి 100రోజుల్లోనే ప్రారంభమైన సుమారు రూ.15 లక్షల కోట్ల ప్రాజెక్టులు

గడిచిన 10ఏళ్లలో పాలసీల అమలులో స్థిరమైన దిశ, వేగం, ఖచ్చితత్వంతో దూసుకెళ్లిన మోదీ ప్రభుత్వం

భద్రత, అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేయడం కొనసాగిస్తుంది

సురక్షిత భారత్ నిర్మాణం కోసం బాహ్య, అంతర్గత భద్రతనూ, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసిన మోదీ ప్రభుత్వం

పీఎమ్ఏవై కింద అదనంగా 3 కోట్ల గృహాలకు ఆమోదం

ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు హామీ నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వం

ప్రపంచ-శ్రేణి మౌలిక వసతుల కల్పన కోసం రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టు

Posted On: 17 SEP 2024 4:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ తొలి 100రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలునిర్ణయాలు అలాగే విజయాలను శ్రీ అమిత్ షా వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 100 రోజులలో సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించే 'వికసిత్ భారత్ సాధనను సులభతరం చేసే మార్గం (పేవింగ్ ద పాత్ టు వికసిత్ భారత్)అనే ప్రత్యేక పుస్తకాన్ని అలాగే ఎనిమిది కరపత్రాలను ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారరైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖా మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.

 

మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర హోం, సహకార మంత్రి ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మోదీజీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయ్యారన్నారు. ప్రపంచంలోని 15 వివిధ దేశాలు ఆయనకు వారి దేశపు అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయన్నారు. ఇది వ్యక్తిగతంగా మన ప్రధానమంత్రికి మాత్రమే కాకుండా మొత్తం భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ రోజు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు.

 

గడిచిన 10 ఏళ్లలో భారత అభివృద్ధిభద్రత అలాగే పేదల సంక్షేమానికి అంకితమై సుపరిపాలన అందిచామన్నారు. అందుకే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దేశ ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ నేత వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై దేశాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. 60 ఏళ్లలో తొలిసారిగా దేశంలో మెరుగైన రాజకీయ సుస్థిరత నెలకొందనీతన స్వంత విధానాలతో దేశం నిలదొక్కుకుందన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో పాలసీల అమలులో వేగం, ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూనేఅంచనాలకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తూ 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా కష్టమనీ అలాగే ఇది గొప్ప విజయమనీ ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోగత 10 ఏళ్లలో దేశ బాహ్య, అంతర్గత భద్రత అలాగే రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ సురక్షిత భారత్ నిర్మాణంలో ప్రభుత్వం గొప్ప విజయాన్ని సాధించిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. మోదీ నాయకత్వంలో ప్రాచీన, ఆధునిక విద్యావిధానంతో కూడిన నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చారన్నారు. ఇది ప్రాంతీయ  భాషలను గౌరవిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు ప్రపంచంలోనే భారత్ అత్యంత ముఖ్యమైన ఉత్పాదక కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు మన డిజిటల్ ఇండియా పథకాన్ని అర్థం చేసుకునిఆమోదించేందుకు అలాగే వారి అభివృద్ధి కోసం ప్రాతిపదికగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీ  అమిత్ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని మొత్తం 13 అంశాలలో క్రమశిక్షణనుపురోగతినీ సాధించినట్లు చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత ఉజ్వల భవిష్యత్తును నేడు ప్రపంచమంతా చూస్తోందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా గడిచిన 10 ఏళ్లలో పటిష్టమైన విదేశాంగ విధానం అమల్లోకి వచ్చిందని హోంమంత్రి చెప్పారు.

 

గడిచిన 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ హయాంలో 60 కోట్ల మంది పేద ప్రజలకు ఇండ్లుమరుగుదొడ్లుగ్యాస్ కనెక్షన్లుత్రాగునీరువిద్యుత్నెలకు 5 కిలోల ఆహార ధాన్యంరూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో సొంత ఇల్లు లేని కుటుంబం లేకుండా అందరికీ ఇండ్లు అందించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం యువతకు అనేక అవకాశాలను కల్పించిందనీనేడు భారత యువత ప్రపంచ యువతతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందని శ్రీ అమిత్ షా తెలిపారు.

 

రైతుల అభివృద్ధిశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఈ పథకాల వల్ల దేశంలో ఆహార నిల్వలు నిలకడగా ఉండే స్థాయికి చేరుకోవడమే కాకుండా ఎగుమతులు కూడా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి సాధించడం ద్వారా రైతులకూ మేలు చేకూరుతుందన్నారు.

 

మోదీ ప్రభుత్వ మూడవ హాయంలో తొలి 100 రోజులు 'అభివృద్ధి చెందిన భారతదేశంకోసం బలమైన పునాది పడినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ 100 రోజుల్లో అన్ని వర్గాల పేదలకు అభివృద్ధి, సంక్షేమం సమంగా అందాయన్నారు. ఈ తక్కువ కాలంలోనే సుమారుగా రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గడిచిన 10 ఏళ్లుగా స్థిరమైన దిశవేగం, ఖచ్చితత్వంతో పాలసీలను అమలు చేస్తున్నామన్నారు. భద్రతఅభివృద్ధిపేదల సంక్షేమం పట్ల మోదీ ప్రభుత్వం అంకితభావంతో పని చేయడం కొనసాగిస్తుందన్నారు.

 

ఈ 100 రోజుల కాలాన్ని 14 మూల స్తంభాలుగా విభజించవచ్చని శ్రీ అమిత్ షా తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో ఈ కాలంలో రూ.3 లక్షల కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని వధావన్‌లో ప్రపంచంలోని 10 ప్రధాన నౌకాశ్రయాలలో ఒకటిగా నిలవబోయే మెగా పోర్ట్‌ రూ.76 వేల కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. రహదారులు లేని 25 వేల గ్రామాలకు రూ. 49 వేల కోట్లతో రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రూ.50,600 కోట్లతో భారతదేశంలోని ప్రధాన రహదారులను విస్తరించాలని నిర్ణయించామన్నారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుపశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాబీహార్‌లోని బిహ్తాలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం అలాగే అగట్టి, మినీకాయ్‌లలో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపారు. బెంగళూరు మెట్రో 3వ దశపూణే మెట్రోథానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో అలాగే అనేక ఇతర మెట్రో రైలు ప్రాజెక్టులు కూడా ఈ 100 రోజుల్లో ముందడుగు వేశాయని తెలిపారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత కింద 9.50 కోట్ల మంది రైతులకు రూ.20000ల కోట్లు పంపిణీ చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12 కోట్ల 33 లక్షల మంది రైతులకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీకూడా పెంచామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువ ఎమ్ఎస్‌పీతో పంటలను కొనుగోలు చేసిందనీ, రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

 

సహకార చక్కెర కర్మాగారాల ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లను మొక్కజొన్న నుండి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం కోసం బహుళ-ఫీడ్ ఇథనాల్ యూనిట్‌లుగా మార్చామన్నారు. దీంతో ఇప్పుడు చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న నుంచి కూడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఉల్లిపాయలు, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర (ఎమ్ఈపీ)ని తమ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఉల్లిపై ఎగుమతి సుంకం 40శాతం నుంచి 20శాతానికి తగ్గిందని తెలిపారు.

 

ఈ 100 రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు ఎన్నో ఉపశమనాలు కల్పించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. పన్ను మినహాయింపు కిందరూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీమూడవ వెర్షన్ అమలు చేశామన్నారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద కోటి ఇండ్లురూరల్ హౌసింగ్ స్కీమ్ కింద 2 కోట్ల ఇండ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

 

ఈ ఏడాది ఇప్పటివరకు ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద 2.5 లక్షల కుటుంబాలకు సౌరశక్తి చేరింది. ఈ ప్రత్యేక పథకం మధ్యతరగతి కుటుంబాల కరెంటు బిల్లు తగ్గించడమే కాకుండా సౌరశక్తి వినియోగ లక్ష్యం నెరవేరేందుకు దోహదపడుతుంది. పర్యావరణ అనుకూల వ్యవస్థను రూపొందించడానికి సుమారు రూ. 3400 కోట్ల సహాయంతో మా ప్రభుత్వం పీఎమ్ ఈ-బస్ సేవలకు ఆమోదం తెలిపింది. అంకుర సంస్థలకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకుఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అంకుర సంస్థలపై పెనుభారంగా ఉన్న 31శాతం ఏంజెల్ ట్యాక్స్‌ రద్దు చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు.

 

జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద12 పారిశ్రామిక జోన్‌లను ప్రధాన జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నామని తెలిపారు.

 

మధ్యతరగతి ప్రజల కోసం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముద్ర రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో పాటు, తమ పాత రుణాలను తిరిగి చెల్లించిన వారందరూ దీని ద్వారా ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఎమ్ఎస్ఎమ్ఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం ప్రారంభించబడిందనీ, దీని కింద చిన్న వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలు హామీ లేకుండా రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.

 

ఏ దేశ అభివృద్ధి కోసమైనా యువత సాధికారత ప్రాథమిక అవసరం అని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించిందనీ, దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది యువత లబ్ధి పొందనున్నారని తెలిపారు. అగ్రశ్రేణి కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలుఅలవెన్సులు అలాగే వన్-టైమ్ సహాయం కూడా అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వేలాది నియామకాల కోసం ప్రకటనలు జారీ చేశామన్నారు.

 

మూలధన వ్యయాన్ని 11 లక్షల 11 వేల కోట్ల రూపాయలకు పెంచడం ఒక గొప్ప విజయంగా శ్రీ అమిత్ షా అభివర్ణించారు. ఇది చాలా మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందనీ అలాగే మన మౌలిక సదుపాయాలు కూడా బలోపేతం అవుతాయన్నారు. పీఎల్‌ఐ పథకం అలాగే 12 పారిశ్రామిక జోన్‌ల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలు యువత కోసం కూడా ప్రయోజనకరం అవుతాయి అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

 

దీనదయాళ్ అంత్యోదయ యోజన కింద 10 కోట్ల మంది మహిళలను సంఘటితం చేసి 90 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని అమిత్ షా తెలిపారు. అలాగే లఖ్‌పతి దీదీ యోజన కింద100 రోజుల్లో 11 లక్షల మంది కొత్త లఖ్‌పతి దీదీలకు సర్టిఫికెట్లు అందించామన్నారు. కోటి మందికి పైగా లఖ్‌పతి దీదీలు ఏటా లక్ష రూపాయలు  సంపాదిస్తున్నారని తెలిపారు. ఏడాదికి లక్ష ఆదాయం సంపాదించడం కలగా భావించిన ఈ మహిలు నేడు ఆ కలను సాకారం చేసుకుని గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.

 

పర్యాటన్ మిత్ర, డ్రోన్ దీదీ ద్వారా మార్గదర్శకంగా పని చేసేందుకు పర్యాటన్ దీదీని స్వయం సహాయక బృందాలకు అనుసంధానం చేశామని శ్రీ అమిత్ షా తెలిపారు. దీంతో పాటు యువతను పర్యాటకంతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 

ప్రధాన్ మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద 63 వేల గిరిజన గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. దీని ద్వారా 5 కోట్ల మంది గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఈ పథకం కింద, ఆయా గ్రామాల్లో ప్రాథమిక అవసరాలన్నీ తీర్చుతూ, కనీస వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ 100 రోజుల్లో షెడ్యూల్డ్ కులాల దివ్యాంగులకు 3 లక్షల కొత్త గుర్తింపు కార్డులు అందించామని తెలిపారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్)ని నూతన విధానంలో తిరిగి ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణరక్షణదుర్వినియోగ నివారణకు వక్ఫ్ సవరణ బిల్లు-2024 కట్టుబడి ఉందనిరానున్న రోజుల్లో దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధానమంత్రికి చాలా ఇష్టమైన కార్యక్రమమనిఈ పథకం కోట్లాది ప్రజల జీవితాలను సులభతరం చేసిందని శ్రీ అమిత్ షా అన్నారు. దీని కింద రూ.5 లక్షల వరకు చికిత్స ఖర్చును నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తోంది. మా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి స్వంత కార్డుతో పాటు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుందనీదీంతో వారి కవరేజీ రూ.10 లక్షలకు పెరుగుతుందని తెలిపారు. దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వృద్ధులు దీని ద్వారా లబ్ధి పొందుతారనిదీనికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదని హోంమంత్రి తెలిపారు.

 

కొత్తగా 75,000ల మెడికల్ సీట్లను చేర్చడం ద్వారా వైద్య విద్య కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితికి స్వస్తి చెప్పే దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. దీనికోసం 3 ఏళ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఆగస్టు 23న మొదటి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామనీదీని కింద యువతను అంతరిక్ష రంగంలో ప్రోత్సహించేందుకువారిలో ఆసక్తి పెంపొందించేందుకు అనేక పథకాలు ప్రారంభించామని శ్రీ అమిత్ షా తెలిపారు. విపత్తు నిర్వహణ కోసం జాతీయ డేటాబేస్ అలాగే గ్రామీణ భూ రికార్డుల కోసం పంచాయతీ పోర్టల్‌ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయబడిందన్నారు. రాబోయే 10 ఏళ్లలోసెమీకండక్టర్ల రంగంలో భారతదేశం ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు.

 

బ్రిటీష్ వారు రూపొందించిన 150 ఏళ్ల నాటి నేర చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్అలాగే భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏఅనే మూడు కొత్త చట్టాలు జూలై 1నుండి అమలులోకి వచ్చినట్లు హోం మంత్రి తెలిపారు. ఈ మూడు కొత్త చట్టాలు రాబోయే రోజుల్లో న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండాన్యాయం పొందుటను సులభతరం చేస్తాయన్నారు. అలాగే సకాలంలో న్యాయాన్ని అందించడం వీలుపడుతుందని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో ఈ చట్టాల పూర్తి స్థాయిలో అమలుతోభారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనది అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా జరుపుకోవాలని నిర్ణయించడం ద్వారా దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ చీకటి కాలం రాకుండా రాబోయే తరాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ రష్యాఉక్రెయిన్‌ల కీలక పర్యటనల గురించి ఈరోజు ప్రపంచం అంతా ఆశగా ఎదురుచూస్తోందన్నారు. మొదటిసారిగాయునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ తన కీలక సమావేశం భారత్‌లో నిర్వహించిందనీ, ఇది రాబోయే రోజుల్లో మన దేశంలోని అనేక వారసత్వ ప్రదేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

35 ఏళ్ల సుదీర్ఘ వివాదం తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 4న త్రిపురలో ఎన్‌ఎల్‌ఎఫ్‌టిఎటిటిఎఫ్‌లతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పట్టణప్రాంతాల్లో వరదల నిర్వహణ కోసం రూ.6350 కోట్లతో కొత్త పథకాన్ని తెచ్చామన్నారు. రూ.4100 కోట్లతో ఈశాన్య ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ ఏడాది లోక్‌సభలో విపత్తు నిర్వహణ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. ఈ బిల్లు అర్బన్ ఫండ్ మేనేజ్‌మెంట్అగ్నిమాపక సేవలుజీఎల్ఓఎఫ్ అలాగే ఇతర విపత్తుల నివారణ అవసరాలను తీరుస్తుంది. ఇందుకోసం రూ.12554 కోట్లు కేటాయించామన్నారు. లదాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు అమిత్ షా చెప్పారు. మాదక ద్రవ్యాల నివారణ, సమాచారం కోసం మానస్ (ఎమ్ఏఎన్ఏఎస్) హెల్ప్‌లైన్ ప్రారంభించామన్నారు. రాబోయే ఐదేళ్లలో 5000 మంది సైబర్‌ కమాండోలకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తున్నామన్నారు. సైబర్‌ నేరాల కోసం నేర అనుమానిత సమాచార నిధి (సస్పెక్ట్ రిజిస్ట్రీ)ని కూడా రూపొందిస్తున్నట్లు చెప్పారు.

 

 

మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలోనే చాలా చేయగలిగామని శ్రీ అమిత్ షా అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సందడితో తీరికలేకుండా ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఎన్నికలకు 6 నెలల ముందే ప్రధాని మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. దీంతో దేశ అభివృద్ధి వేగానికి ఆటంకం కలగలేదన్నారు. ఈ ఆలోచన ఫలితమే 100 రోజుల్లోనే లక్షలుకోట్ల రూపాయల అభివృద్ధి పనులను చాలావరకు పూర్తి చేయడంలో విజయం సాధించామని హోంమంత్రి అన్నారు. వీటి ద్వారా దేశాభివృద్ధిలో వేగం పెరగడమే కాకుండా దేశం సురక్షితంగాసుభిక్షంగా ఉంటుందన్నారు. అలాగే నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా విద్యా రంగంలోనూ ముందుకు సాగుతామని అమిత్ షా పేర్కొన్నారు.

****


(Release ID: 2055851) Visitor Counter : 115