ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 16 SEP 2024 4:08PM by PIB Hyderabad

నా మంత్రివర్గ సహచరులుసర్బానంద సోనావాల్ జీశాంతనూ ఠాకూర్ జీటుటికోరిన్ పోర్ట్ అధికారులుఉద్యోగులుఇతర ప్రముఖ అతిథులుసోదర సోదరీమణులారా,

'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశందిశగా మన ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనదిఈ కొత్త టుటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తారగా నిలుస్తుందిఈ టెర్మినల్ వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరిస్తుందిపద్నాలుగు మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో వి..సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందిఇది వి..సీ నౌకాశ్రయం వద్ద రవాణాపరమైన ఖర్చులు తగ్గించడంతో పాటుభారత్ కోసం విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుందిఈ సందర్భంలో మీ అందరికీ అలాగే తమిళనాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 రెండేళ్ల క్రితం పలు వి..సీసంబంధిత ప్రాజెక్ట్‌లను ప్రారంభించే అవకాశం నాకు లభించిన విషయం ఇంకా నాకు గుర్తుందిఆ సమయంలోఈ నౌకాశ్రయంలో సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక పనులు ప్రారంభమైనాయిఈ ఏడాది ఫిబ్రవరిలో నేను టుటికోరిన్‌ సందర్శించిన సమయంలో కూడానౌకాశ్రయానికి సంబంధించి మరిన్ని పనులు ప్రారంభమైనాయిఈ రోజు వేగంగా జరుగుతున్న ఈ పనులు చూస్తుంటే నా సంతోషం రెట్టింపు అవుతుందిఈ కొత్త టెర్మినల్‌లో 40% మంది ఉద్యోగులు మహిళలే కావడం నాకు చాలా ఆనందంగా ఉందిసముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

మిత్రులారా,

తమిళనాడు తీరప్రాంతాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయిఇక్కడ నౌకాశ్రయ మౌలికవసతులలో మూడు ప్రధాన ఓడరేవులు అలాగే పదిహేడు చిన్న ఓడరేవులు ఉన్నాయిఈ సామర్థ్యం కారణంగా తమిళనాడు ఇప్పుడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉందిపోర్ట్ ఆధారిత అభివృద్ధి మిషన్‌ను మరింత వేగవంతం చేయడానికిమేము ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నాముదీనికోసం ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నాముమేము వి..సీ. సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాముఈ వి..సీనౌకాశ్రయం భారతదేశ సముద్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

భారత సముద్ర మిషన్ నేడు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదుభారత్ ఇప్పుడు సుస్థిరమైనముందుచూపు గల అభివృద్ధితో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. ఇది మన వి..సీ నౌకాశ్రయం విషయంలో స్పష్టంగా కనిపిస్తుందిఈ నౌకాశ్రయం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గాఅలాగే సముద్రతీర పవన శక్తి కోసం నోడల్ పోర్ట్‌గా గుర్తింపు పొందిందిప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మన కార్యక్రమాలు అత్యంత ప్రభావవంతమైనవి అని ఇది రుజువు చేస్తుంది.

మిత్రులారా,

ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆవిష్కరణలుఇతరులతో కలిసి పని చేయడం భారతదేశపు గొప్ప బలాలుగా ఉన్నాయినేడు ప్రారంభించుకున్న కొత్త టెర్మినల్ ఐక్యతా బలానికి నిదర్శనంగా నిలుస్తుందిబాగా అనుసంధానించబడిన భారత్‌ నిర్మాణం కోసం సమష్టిగా కృషి జరుగుతున్నదిదేశవ్యాప్తంగా నేడు రహదారులుజాతీయ రహదారులుజలమార్గాలువాయుమార్గాల విస్తరణతో అనుసంధానం ఎంతో మెరుగైందిదీని ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానం గణనీయంగా బలపడిందిప్రపంచ సరఫరాల వ్యవస్థలో భారతదేశం ప్రధాన వాటాదారుగా మారుతున్నదిమెరుగవుతున్న ఈ సామర్థ్యం మన ఆర్థికవృద్ధికి పునాది అవుతుందిఇదే బలం భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతుంది. భారత్ సామర్థ్యాలను మరింతగా పెంచుటలో తమిళనాడు కీలక పాత్ర పోషించడం నాకు సంతోషం కలిగిస్తున్నదివీ..సీ నౌకాశ్రయం వద్ద కొత్త టెర్మినల్‌ ప్రారంభ సందర్భంగా మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలుధన్యవాదాలు.

 వణక్కమ్ (నమస్కారం).

 

***


(Release ID: 2055492) Visitor Counter : 50