ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ లో పేర్కొన్న విదేశీ మారక (కాంపౌండింగ్ ప్రొసీడింగ్స్) నిబంధనలు నోటిఫై
2000 వ సంవత్సరం నాటి నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలు
కొత్త నిబంధనలతో "పెట్టుబడుల ఆకర్షణ", "వ్యాపార కార్యకలాపాల నిర్వహణ" సులభతరం
Posted On:
12 SEP 2024 4:23PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో చేసిన ప్రకటనను అనుసరించి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నియమాలు, నిబంధనలను సరళీకృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఈఏ), ఈరోజు విదేశీ మారక (కాంపౌండింగ్ ప్రొసీడింగ్స్) నిబంధనలు-2024ను నోటిఫై చేసింది.విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)-1999 సెక్షన్ 15తో కలిపి సెక్షన్ 46 కింద ఇచ్చిన అధికారాల ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ కొత్త నిబంధనలు 2000లో జారీ చేసిన ప్రస్తుత విదేశీ మారక (కాంపౌండింగ్ ప్రొసీడింగ్స్) నిబంధనల స్థానంలో అమల్లోకి వస్తాయి.
వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను క్రమబద్ధీకరించడానికి, హేతుబద్ధీకరించడానికి ఈ చర్యలు చేపట్టారు. రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించి కాంపౌండింగ్ ప్రొసీడింగ్ నియమాలను సమగ్రంగా సమీక్షించారు. కాంపౌండింగ్ అప్లికేషన్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి క్రమబద్ధీకరించడానికి నిబంధనలను రూపొందించడంపై దృష్టి పెట్టారు. అలాగే అప్లికేషన్ ఫీజులు, అపరాధ రుసుముల డిజిటల్ చెల్లింపు ఎంపికలను ప్రవేశపెట్టడం, అస్పష్టతను తొలగించడానికి, ప్రక్రియను స్పష్టం చేయడానికి నిబంధనల సరళీకరణ, హేతుబద్ధీకరణపై దృష్టి సారించారు.
ఈ సవరణలు పెట్టుబడులను విస్తృత స్థాయిలో ఆకర్షించేందుకు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలకు నిదర్శనంగా నిలుస్తాయి.
CLICK HERE TO ACCESS NOTIFICATION
****
(Release ID: 2055127)
Visitor Counter : 52