సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో తొలి సినిమా దర్శకుల విభాగం

ఉత్తమ తొలి సినిమా చలనచిత్ర

విభాగం-2024 లో 5 తొలి సినిమాల ప్రదర్శన

ఉత్తమ తొలి సినిమా దర్శకుడికి సర్టిఫికెట్, రూ.5 లక్షల నగదు
బహుమతి

Posted On: 14 SEP 2024 3:25PM by PIB Hyderabad

55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా -ఐఎఫ్ఎఫ్ఐ) 2024 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. ఐఎఫ్ఎఫ్ఐ, 2024 లో భాగంగా యువ దర్శకుల కోసం "బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్-2024" అనే కొత్త విభాగాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్-2024

ఈ విభాగం ద్వారా, ఐఎఫ్ఎఫ్ఐ యువ దర్శకుల తొలి చిత్రాలపై దృష్టి పెడుతుంది, దేశవ్యాప్తంగా విభిన్న కథాంశాలనూ, భిన్నమైనశైలినీ కలిగిన సినిమాలను ప్రదర్శిస్తారు. యువ చిత్ర దర్శకుల సృజనాత్మకతకూ, వినూత్నమైన కథన రీతులకూ ఈ విభాగం అద్దం పడుతుంది. కొత్త దర్శకుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు యువ ప్రతిభావంతులకు ఒక వేదికను అందించడమే దీని ఉద్దేశం. భారతీయ సినిమాకు కొత్త దృక్కోణాలు, కథలు అందిస్తున్న కొత్త దర్శకుల ప్రతిభను చాటే తొలి చిత్రాలలో గరిష్ఠంగా అయిదు సినిమాలను నియమ నిబంధనల ప్రకారం ఎంపిక చేసి, వాటిని బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శిస్తారు.

ఉత్తమ తొలి దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్) అవార్డు

దీనితో పాటు 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం- 2024  లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా ప్రదానం చేయనున్నారు. భారతీయ సినిమా పురోగమనానికి తొలిసారి దర్శకుల కృషిని గుర్తిస్తూ వారి సృజనాత్మకత, సామర్థ్యాన్ని గౌరవించడమే ఈ పురస్కారం ఉద్దేశం. 

భారతీయ కథా చిత్రాల ఉత్తమ తొలి దర్శకుని అవార్డు వివరాలు ఇలా ఉన్నాయి.

అవార్డు పేరు 

వివరాలు 

గ్రహీత

అవార్డు కింద ఇచ్చేవి 

భారతీయ కథా చిత్రాల ఉత్తమ తొలి దర్శకుని అవార్డ్ (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు) 

సృజనాత్మక దృష్టికోణం, కళాత్మక ప్రతిభ, కథనశైలి , సమగ్ర ప్రభావం ఆధారంగా భారతీయ తొలి దర్శకునికి/  దర్శకురాలికి అందిస్తారు. 

దర్శకుడు

ఎ. దర్శకునికి సర్టిఫికెట్  బి. దర్శకునికి రూ. 5 లక్షల నగదు బహుమతి

55వ ఐఎఫ్ఎఫ్ఐలో బెస్ట్ డెబ్యు ఇండియన్ ఫిల్మ్ విభాగానికి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చు: https://iffigoa.org/festival/indian-debut-director వద్ద ఎంట్రీ సినిమాను సమర్పించవచ్చు."

ఎంట్రీలు సమర్పించేందుకు 23 సెప్టెంబర్ 2024 చివరి తేదీ. ఇతర సంబంధిత వివరాలు www.iffigoa.org. లో అందుబాటులో ఉన్నాయి. 

కొత్తవారిపై దృష్టి పెట్టడం ద్వారా నవతరం సినీ దర్శకులను ప్రోత్సహించడంలో ఐఎఫ్ఎఫ్ఐ నిబద్ధతకు ఈ విభాగం అద్దం పడుతుంది. 

మూలం: ఎన్ ఎఫ్ డి సి

 

***


(Release ID: 2055114) Visitor Counter : 64