రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav g20-india-2023

ఓనం పర్వదిన శుభకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

Posted On: 14 SEP 2024 6:38PM by PIB Hyderabad

ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇచ్చిన సందేశంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  ఇలా అన్నారు:-

 

‘‘ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని పౌరులందరికీ.. ముఖ్యంగా దేశవిదేశాల్లో నివసిస్తున్న కేరళ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

 

పంటలు కోతకు వచ్చిన సందర్భంగా సంతోషంతో, ఉత్సాహంతో కూడిన ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కేరళకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వసంప్రదాయాలను వేడుక చేసుకునే సందర్భం. మన దేశానికి అన్నం పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న రైతులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సౌభాగ్య పండుగ సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. 

 

***



(Release ID: 2055100) Visitor Counter : 21