నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

సాంక్రామిక వ్యాధుల పట్ల మన సన్నద్ధత – భవిష్య కార్యాచ‌ర‌ణపై నిపుణుల బృందం నివేదిక

Posted On: 11 SEP 2024 4:56PM by PIB Hyderabad

సాంక్రామిక వ్యాధుల పట్ల మన సన్నద్ధత – భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల బృందం త‌యారు చేసిన‌ నివేదికను నీతి ఆయోగ్ ఈ రోజు విడుదల చేసిందిభవిష్యత్తులో దాపురించే ఏదైనా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి లేదా వంటి మహమ్మారిని ఎదుర్కొనే విష‌యంలో దేశం సిద్ధంగా ఉండడం కోసంవేగంగా స్పందించే వ్య‌వ‌స్థ‌ను  కలిగి ఉండ‌డంకోసం ఈ నివేదిక ద్వారా ఒక న‌మూనా ప్ర‌ణాళిక‌ను నిపుణుల బృందం అందించింది

 

కోవిడ్ -19 అంటువ్యాధి నిస్సందేహంగా చివరి మహమ్మారి కాదుఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని అనూహ్య ప‌రిస్థితులుజీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో వస్తున్న మార్పులువాతావరణంమానవ-జంతు-వృక్ష జాతుల మధ్య ఉండే పరస్పర సంబంధాల కారణంగా భారీ స్థాయిలో అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉందిభవిష్యత్తులో వచ్చే ప్రజారోగ్య ముప్పుల్లో 75 శాతం జంతువుల‌ ద్వారా సంక్రమించే అవకాశం ఉందిఅనారోగ్య‌ స‌మ‌స్య‌లై ఉండ‌వ‌చ్చ‌ని  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓహెచ్చ‌రించిందిఈ స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం మ‌నుగ‌డ‌లో ఉన్న‌తిరిగి పుట్టుకొచ్చేకొత్త రకం వ్యాధికారకాల కార‌ణంగా సంభ‌వించ‌వ‌చ్చు

 

దీని దృష్ట్యాభవిష్యత్తు మహమ్మారి సంసిద్ధతఅత్యవసర ప్రతిస్పందన కోసం ఒక కార్యాచ‌ర‌ణ వ్యూహాన్ని త‌యారు చేసేందుకు నీతి ఆయోగ్‌ ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందిజాతీయంగానుప్ర‌పంచ స్థాయిలోను కోవిడ్ 19ను ఎలా ఎదుర్కొన్న‌ది పరిశీలించడంఈ విష‌యంలో సాధించిన విజ‌య‌గాధ‌ల‌నుఎదుర్కొన్న స‌వాళ్ల‌ను సేక‌రించి వాటిద్వారా నేర్చుకున్న ముఖ్య‌మైన గుణ‌పాఠాలను తెలియ‌జేయ‌డం మొద‌లైన‌వి ఈ నిపుణుల బృందానికి నిర్దేశించిన నిబంధ‌న‌లుకీల‌క అంత‌రాల‌ను అంచ‌నా వేసి భ‌విష్య‌త్తులో దాపురించే ఏదైనా ప్ర‌జారోగ్య సంక్షోభాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా,  ప్ర‌భావ‌వంతంగా ఎదుర్కొనేలా దేశాన్ని త‌యారు చేసేలా ఈ కార్యాచ‌ర‌ణ చ‌ట్రాన్ని త‌యారు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు

 

ఎస్ ఏ ఆర్ ఎస్ సీఓవి 2 (SARS-COV2) ను ఎదుర్కొన‌డానికి వీలుగా వినూత్న‌మైన చ‌ర్య‌ల‌ను రూపొందించ‌డంలో భార‌త‌దేశం కృషి చేసిందిఅంతే కాదు ఈ విష‌యంలో ప‌రిశోధ‌న‌నుప్ర‌ణాళిక అభివృద్ధిని బ‌లోపేతం చేసిందిపరిశ్రమలు  పరిశోధకులకు నిధులను అందించేభాగస్వామ్య వనరుల స్థాపనకు ప‌నిచేసే  యంత్రాంగాలను ఏర్పాటు చేశారుస‌మాచారంనమూనాలునియంత్రణ భాగ‌స్వామ్యం కోసం విధానంమార్గ‌ద‌ర్శ‌కాలు ఈచ‌ర్య‌ల‌లో  ఉన్నాయిప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం,  ప్రపంచ సహకారాలు వీటిలో ఉన్నాయిమ‌హ‌మ్మారిని ఎదుర్కోవడంలోను,  టీకాల‌ కార్య‌క్ర‌మానికి అవ‌స‌ర‌మైన డిజిట‌ల్ సాధ‌నాల కోసం భార‌త‌దేశం నిధులను వెచ్చించిందిదాంతో  1.4 బిలియన్ల కంటే ఎక్కువ మందికి చెందిన‌ స‌మాచారాన్ని నిర్వహించేందుకు ఈ ప్రయత్నాలు ఉపయోగపడ్డాయి.

 

ఏదైనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ప్పుడు దాన్ని సమర్ధంగా ఎదుర్కొన‌డం కోసం అది వ్యాప్తి చెందిన మొదటి 100 రోజుల్లో ప్రతిస్పందించడం చాలా కీలకమని  కోవిడ్-19 అనుభవం నుండి నిపుణులు  గ్రహించారుఈ వ్యవధిలోనే  అందుబాటులోకి తీసుకురాగల వ్యూహాలు,  ప్ర‌తి చ‌ర్య‌ల‌తో సిద్ధంగా ఉండటం చాలా కీలకం.

సాంక్రామిక వ్యాధులు ప్ర‌బలిన‌ప్పుడు 100 రోజులపాటు ఆచ‌రించాల్సిన‌ కార్యాచరణ ప్రణాళికను ఈ నివేదిక‌ అందిస్తోందిఈ నివేదిక‌ అంటువ్యాధుల‌ను ఎదుర్కొనే సంసిద్ధతఅమలు కోసం వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను అందిస్తోందిఅంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించడంపరీక్షించడంచికిత్స వంటి వాటిని మెరుగైన‌ ప్ర‌ణాళిక‌ ద్వారా ఎలా నిర్వహించవచ్చన్నది ఇది సూచిస్తోందిఇప్ప‌టికే ఉన్న అన్ని అంశాల‌ను ఏకీకృతం చేసేలాబ‌లోపేతం చేసేలా ఒక వ్య‌వ‌స్థ‌ను ఈ నివేదిక సూచిస్తోంది. 100- రోజుల ప్రతిస్పందన‌ కార్య‌క్ర‌మ ల‌క్ష్యాలను చేరుకునేలాఆయా సాధ‌నాల‌ను అందించడానికి  అవ‌స‌ర‌మైన వాటిని ఏర్పాటు చేసుకునేలా ఈ వ్య‌వ‌స్థ ఉండాల‌ని నివేదిక సూచించింది.

 

మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేలా స‌న్న‌ద్ద‌త‌అత్య‌వ‌స‌ర స్పంద‌న ప్ర‌ణాళిక పిపిఇఆర్ నివేదిక సిఫార్సుల ప్ర‌కారం  నాలుగు మూలస్తంభాల్లాంటి వ్య‌వ‌స్థ‌లు ముఖ్యం.  

అవి 1.  పాల‌న‌శాస‌న‌ఆర్ధిక‌నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లు

 

         2. డేటా నిర్వహణనిఘా,  ముందస్తు హెచ్చరికలు అంచనాలు,  న‌మూనాలు.

 

3. పరిశోధన,  ఆవిష్కరణతయారీమౌలిక సదుపాయాలుసామర్థ్య నిర్మాణం/నైపుణ్య‌త‌

 

4. భాగ‌స్వామ్యంరిస్క్ కమ్యూనికేషన్ తోపాటు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం,  ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలుఅంతర్జాతీయ సహకారాలు

 

భవిష్యత్తులో మహమ్మారిని ఎదుర్కొన‌డంలో సంసిద్ధత,  అత్యవసర ప్రతిస్పందన కోసం చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై  ప్రతిపాదిత వ్యూహాన్ని  సిద్ధం చేయడం కోసం 60 మంది నిపుణులు,  వాటాదారులతో సంప్రదించారువీరు ఇప్పటివరకు ఉన్న  అనుభవాన్ని విశ్లేషించడంజాతీయప్రపంచ స్థాయిలో విజయ గాథలను పరిశీలించడం,  శ్రద్ధ పెట్టాల్సిన కీలక అంతరాలను గుర్తించడం వంటి అంశాలను విశ్లేషించారు.

ఇందులో వాటాదారుల సమావేశాలు కీలకంనివేదికను సిద్ధం చేయడానికి విలువైన ఆలోచ‌న‌ల్ని ఈ స‌మావేశాలు అందించాయి.  ప్ర‌జారోగ్య రంగంక్లినికల్ మెడిసిన్ఎపిడెమియాలజీమైక్రోబయాలజీప‌రిశ్ర‌మ‌లువిద్యారంగానికి చెందిన జాతీయఅంతర్జాతీయ నిపుణులు,  కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులతో మాట్లాడారు.

సంప్ర‌దింపుల్లో పాల్గొన్న‌  నిపుణులు స్థానికజాతీయఅంతర్జాతీయ స్థాయిలలో కోవిడ్ 19పై చేసిన పోరాటంలో ముందు భాగాన నిలిచి ప‌ని చేశారు.  కోవిడ్ మ‌హమ్మారి ప్ర‌బ‌లిన‌ప్పుడు ప్రతిస్పందనను త‌యారు చేయ‌డంలో విధాన రూపకల్పనలోప్రణాళిక‌లో  ముఖ్యమైన పాత్ర పోషించారు.

 

భవిష్యత్తులో ఏదైనా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి లేదా మహమ్మారి ప్ర‌బ‌లినప్పుడు దాన్ని ఎదుర్కొనేలా దేశాన్ని సిద్ధం చేయడానికివేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉండటానికి  ఈ నివేదిక ద్వారా ఒక మార్గదర్శన పత్రాన్ని నిపుణుల బృందం అందించిందికోవిడ్ 19 మహమ్మారి సమయంలో నేర్చుకున్న పాఠాలు ఎదుర్కొన్న సవాళ్లను పరిశీలించడం నుండి భవిష్యత్తులో ప్ర‌జారోగ్య అత్య‌వ‌స‌ర స‌మ‌స్య‌ల నిర్వ‌హ‌ణ‌పాల‌నకు సంబంధించిన సిఫార్సుల‌ వ‌ర‌కు భార‌త‌దేశంలో మ‌హ‌మ్మారి స‌న్న‌ద్ద‌త‌నివార‌ణ చ‌ర్య‌ల్లో ఈ నివేదిక ఒక ఆరంభం

ఈ నివేదిక‌ కోసం సంప్ర‌దించాల్సిన లింక్

https://www.niti.gov.in/sites/default/files/2024-09/Report-of-the-Exper-Group--Future-Pandemic-preparedness-and-emergency-response_0.pdf


(Release ID: 2054084) Visitor Counter : 152