ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 11 SEP 2024 1:41PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారుకేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులుఅశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాదప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలువిద్యపరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములుఇతర విశిష్ట అతిథులుసోదర సోదరీమణులారా అందరికీ నమస్కారం!

 

సెమీతో సంబంధం ఉన్న మిత్రులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన ఈ బృహత్తర కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఎనిమిదో దేశం భారత్భారత్ లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇదే సరైన సమయం అని నేను చెప్పగలనుమీరు సరైన సమయంలోసరైన ప్రదేశంలో ఉన్నారు. 21వ శతాబ్దపు భారత్ లో చిప్స్ తయారీ ఎన్నటికీ తగ్గవుఅంతే కాదునేటి భారత్ ప్రపంచానికి భరోసా ఇస్తుంది చిప్స్ తగ్గినప్పుడల్లా మీరు భారతదేశంపై ఆధారపడవచ్చు!

 

మిత్రులారా,

సెమీకండక్టర్ ప్రపంచంతో సంబంధం ఉన్న మీకు తప్పనిసరిగా డయోడ్లతో అనుబంధం కలిగి ఉంటుందిమీకు తెలిసినట్లుగాఒక డయోడ్ లో శక్తి ఒక దిశలో మాత్రమే ప్రవహిస్తుందికానీ భారత్ సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రత్యేక డయోడ్లను ఉపయోగిస్తారుఇక్కడ శక్తి రెండు దిశలలో ప్రవహిస్తుందిఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చుమీరు పెట్టుబడి పెట్టి విలువను సృష్టించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలోప్రభుత్వం మీకు స్థిరమైన విధానాలను, వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తుంది.సెమీకండక్టర్ పరిశ్రమ 'ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్'తో ముడిపడి ఉందిభారత్ మీకు 'ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్' (సమీకృత విస్తారిత వ్యవస్థ)ను కూడా అందిస్తుందిఈ దేశ డిజైనర్ల అపారమైన ప్రతిభ గురించి మీకు బాగా తెలుసుడిజైనింగ్ ప్రపంచంలో 20 శాతం ప్రతిభను కలిగి ఉన్న భారత్ నిరంతరం విస్తరిస్తోంది. 85,000 మంది టెక్నీషియన్లు (సాంకేతిక నిపుణులు)ఇంజినీర్లుఆర్ అండ్ డీ నిపుణులతో సెమీకండక్టర్ వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేస్తున్నాంసెమీకండక్టర్ పరిశ్రమకు విద్యార్థులనునిపుణులను సిద్ధం చేయడంపై భారత్ దృష్టి సారించిందినిన్ననే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తొలి సమావేశం జరిగిందిఈ ఫౌండేషన్ భారత్ పరిశోధన విస్తారిత వ్యవస్థ (రీసర్చ్ ఎకోసిస్టమ్) కు కొత్త దిశనుకొత్త శక్తిని అందిస్తుందిఅదనంగాభారత్ ఒక ట్రిలియన్ రూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని కూడా ఏర్పాటు చేసింది.

 

మిత్రులారా,

సెమీకండక్టర్సైన్స్ రంగాల్లో ఆవిష్కరణల పరిధిని ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో విస్తరిస్తాయిసెమీకండక్టర్ సంబంధిత మౌలిక సదుపాయాలపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నాంఅంతేకాకమీకు త్రీ డైమెన్షనల్ (త్రిమితీయ) శక్తి ఉంది మొదటిదిభారతదేశంలోని ప్రస్తుత సంస్కరణాత్మక ప్రభుత్వంరెండవదిభారతదేశంలో పెరుగుతున్న తయారీ రంగం, మూడవది భారతదేశంలోని ఆకాంక్షాత్మక మార్కెట్సాంకేతిక పరిజ్ఞాన అభిరుచిని అర్థం చేసుకునే మార్కెట్మీ కోసంత్రీ-డి శక్తి తో కూడిన సెమీకండక్టర్ పరిశ్రమ స్థావరం (బేస్) ఉంది. ఈ రకమైన ఏర్పాటును వేరే చోట కనుగొనడం కష్టం.

 

మిత్రులారా,

భారత దేశ ఆకాంక్షాత్మకసాంకేతిక ఆధారిత సమాజం చాలా ప్రత్యేకమైనదిభారత్ కు చిప్ అనేది కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదుమాకు,లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చే సాధనంప్రస్తుతం భారత్ చిప్స్ ప్రధాన వినియోగదారుగా ఉందిఈ చిప్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించాంఈ చిన్న చిప్ భారత్ లో లాస్ట్ మైల్ డెలివరీని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందికరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా కుదేలైనప్పుడుభారతదేశంలో బ్యాంకులు నిరాటంకంగా పనిచేశాయిభారత్ యూపీఐ అయినారూపే కార్డు అయినాడిజి లాకర్ అయినాడిజి యాత్ర అయినా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్లు భారత ప్రజలకు  దైనందిన జీవితంలో భాగమయ్యాయినేడు భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రతి రంగంలోనూ తయారీని పెంచుతోందినేడుభారతదేశం గణనీయమైన హరిత మార్పు(గ్రీన్ ట్రాన్సిషన్)కు లోనవుతోందిభారత్ లో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందిఅంటే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను ముందుకు నడిపించడంలో భారత్ ప్రధాన పాత్ర పోషించబోతోంది.

 

మిత్రులారా,

ఒక పాత ప్రసిద్ధ సామెత ఉంది - 'చిప్స్ ఎక్కడ అయితే అక్కడ పడనివ్వండి'. అంటే జరుగుతున్నది యథాతథంగా సాగిపోవాలినేటి యువఆకాంక్ష భారత్ ఈ వైఖరిని అనుసరించడం లేదు. 'భారత్ లో తయారయ్యే చిప్ ల సంఖ్యను పెంచడంఅనేది నేటి భారత్ మంత్రంఅందుకే సెమీకండక్టర్ తయారీని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకున్నాంభారత్ లో సెమీకండక్టర్ తయారీ సౌకర్యాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 50 శాతం సహకారం అందిస్తోందిఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనపు సహకారం అందిస్తున్నాయిఈ విధానాల కారణంగా ఈ రంగంలో భారత్ లో తక్కువ కాలంలోనే 1.5 ట్రిలియన్ రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయినేడు అనేక ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయిసెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమంఈ కార్యక్రమం కింద ఫ్రంట్ ఎండ్ ఫ్యాబ్స్డిస్ప్లే ఫ్యాబ్స్సెమీకండక్టర్ ప్యాకేజింగ్కాంపౌండ్ సెమీకండక్టర్లుసెన్సర్లుడిస్ప్లే తయారీకి ఆర్థిక సహకారం అందిస్తోందిఅంటే భారత్ లో 360 డిగ్రీల విధానంతో పనులు జరుగుతున్నాయిమా ప్రభుత్వం భారత్ లో మొత్తం సెమీకండక్టర్ సప్లై చైన్ ఎకోసిస్టమ్ ను ముందుకు తీసుకెళ్తోందిప్రపంచంలోని ప్రతి పరికరంలోనూ స్వదేశీ చిప్ ఉండాలనేది మా కల అని ఈ ఏడాది ఎర్రకోట నుంచి చెప్పాను. సెమీకండక్టర్ పవర్ హౌస్ గా మారడానికి అవసరమైన ప్రతిదాన్ని దేశం చేయబోతోంది.

 

మిత్రులారా,

కీలకమైన ఖనిజాల దేశీయ ఉత్పత్తివిదేశీ సేకరణ కోసం ఇటీవల క్రిటికల్ మినరల్ మిషన్ ను ప్రకటించాంకీలకమైన ఖనిజాలకు కస్టమ్స్ సుంకం మినహాయింపులుమైనింగ్ బ్లాక్ వేలం తదితరాలపై కసరత్తు జరుగుతోందిఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ లో సెమీకండక్టర్ పరిశోధన కేంద్ర ఏర్పాటుకు కృషి చేస్తున్నాంఐఐటీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాంతద్వారా మా ఇంజనీర్లు ప్రస్తుత అవసరాలకు హైటెక్ చిప్ లను అభివృద్ధి చేయడమే కాకుండా తదుపరి తరం చిప్ లను కూడా పరిశోధించవచ్చు.అంతర్జాతీయ సహకారాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాంచమురు దౌత్యం గురించి మీరు వినే ఉంటారునేటి యుగం సిలికాన్ దౌత్యంఈ ఏడాది ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా భారత్ ఎన్నికైందిక్వాడ్ సెమీకండక్టర్ సప్లై చైన్ ఇనిషియేటివ్ లో మేము ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నాం, ఇటీవల జపాన్, సింగపూర్ తో సహా అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాంఈ రంగంలో అమెరికాతో భారత్ తన సహకారాన్ని నిరంతరం పెంచుకుంటోంది.

 

మిత్రులారా,

భారత్ సెమీకండక్టర్ మిషన్ గురించి మీ అందరికీ తెలుసుఈ రంగంపై భారత్ ఎందుకు దృష్టి సారిస్తోందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.అలాంటి వారు మన డిజిటల్ ఇండియా మిషన్ ను అధ్యయనం చేయాలిదేశానికి పారదర్శకమైనసమర్థవంతమైనలీకేజీ రహిత పాలన అందించడమే డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యంనేడుమనం దాని గుణక ప్రభావాన్ని అనుభవిస్తున్నాండిజిటల్ ఇండియా విజయానికి చౌకైన మొబైల్ హ్యాండ్ సెట్లుడేటా అవసరంఅందుకు అనుగుణంగా అవసరమైన సంస్కరణలు అమలు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించాందశాబ్దం క్రితం మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో మనమూ ఉన్నాంనేడుమనం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉన్నాం. 5జీ హ్యాండ్ సెట్లకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ గా అవతరించిందని తాజా నివేదిక వెల్లడించిందిరెండేళ్ల క్రితమే 5జీ సేవలను ప్రారంభించాంఈ రోజు మనం ఎక్కడికి చేరుకున్నామో చూడండినేడు భారత్ ఎలక్ట్రానిక్స్ రంగం 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందిమా లక్ష్యం ఇంకా పెద్దదిఈ దశాబ్దం చివరి నాటికి మన ఎలక్ట్రానిక్స్ రంగాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనుకుంటున్నాందీని వల్ల భారత యువతకు 60 లక్షల ఉద్యోగాలు లభిస్తాయిదీని వల్ల భారత్ సెమీకండక్టర్ రంగం కూడా ఎంతో ప్రయోజనం పొందనుందిఎలక్ట్రానిక్ తయారీ 100 శాతం భారతదేశంలోనే జరగాలన్నదే మా లక్ష్యంఅంటే భారత్ సెమీకండక్టర్ చిప్స్ మాత్రమే కాకుండా వాటి ఫినిష్డ్ గూడ్స్(పూర్తిగా తయారైన వస్తువులు) ను కూడా తయారు చేస్తుంది.

 

మిత్రులారా,

భారత్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్(విస్తారిత వ్యవస్థ) దేశీయ సవాళ్లకే కాకుండా ప్రపంచ సవాళ్లకు కూడా పరిష్కారాలను అందిస్తుందిడిజైనింగ్ కు సంబంధించిన ఒక రూపకాన్ని మీరు వినే ఉంటారుఈ రూపకం - 'సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్'. ఈ లోపాన్ని నివారించడానికి డిజైనింగ్ విద్యార్థులకు బోధిస్తారువ్యవస్థ కేవలం ఒక భాగంపై ఆధారపడకుండా చూడటమే లక్ష్యంఈ పాఠం కేవలం డిజైనింగ్ కే పరిమితం కాలేదుఇది మన జీవితాలకు సమానంగా వర్తిస్తుందిముఖ్యంగా సరఫరా గొలుసుల (సప్లై చైన్) సందర్భంలోకోవిడ్ కావచ్చుయుద్ధం కావచ్చుగతంలో సరఫరా గొలుసు అంతరాయాల వల్ల నష్టపోని పరిశ్రమ లేదుఅందువల్లసరఫరా గొలుసులలో స్థితిస్థాపకత కీలకంఅందువల్లవివిధ రంగాలలో స్థితిస్థాపకతను సృష్టించే మిషన్ లో భారత్ ఒక ముఖ్యమైన భాగం కావడం పట్ల నేను సంతోషిస్తున్నానుమనం మరో విషయం గుర్తుంచుకోవాలిసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజాస్వామిక విలువలు తోడైతే సాంకేతిక పరిజ్ఞాన సానుకూల శక్తి బలపడుతుందిదీనికి విరుద్ధంగాప్రజాస్వామ్య విలువలు సాంకేతిక పరిజ్ఞానం నుండి తొలగించబడినప్పుడుహానికరంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదుఅందువల్ల మొబైల్ తయారీఎలక్ట్రానిక్స్ తయారీసెమీకండక్టర్లు ఇలా ఏవైనా సరే మా దృష్టి చాలా స్పష్టంగా ఉందివిపత్కర సమయాల్లో కూడా ఆగిపోకుండా, నిరంతరం పనిచేసే ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాంమీరు కూడా భారతదేశ ఈ ప్రయత్నాలను బలోపేతం చేస్తారనే నమ్మకంతోమీ అందరికీ శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు!

 

***


(Release ID: 2053920) Visitor Counter : 66