నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
రవాణా రంగంలో భారీ వృద్ధి, 300కు పైగా కార్యక్రమాలతో రూ. 80 లక్షల కోట్ల కేటాయింపు: నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ జయంత్ చౌదరి
స్విగ్గీతో నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖ అవగాహన ఒప్పందం
‘స్విగ్గీ స్కిల్స్’ నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖ అవగాహన ఒప్పందం
పెంచడానికి కలిసి పనిచేయనున్న మంత్రిత్వ శాఖ, స్విగ్గీ
Posted On:
07 SEP 2024 4:15PM by PIB Hyderabad
ఈ ఒప్పందం సందర్భంగా స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈవో రోహిత్ కపూర్ మాట్లాడుతూ “మా భాగస్వామ్య యాప్ లను ఎంఎస్ డీఈ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (ఎస్ఐడీహెచ్)లో సమీకృతం చేయాలని మేం యోచిస్తున్నాం. ఇది దాదాపు 2.4 లక్షల డెలివరీ భాగస్వాములు, రెండు లక్షల రెస్టారెంట్ భాగస్వామ్య సిబ్బందికి ఆన్ లైన్ నైపుణ్యాభివృద్ధి కోర్సులు, ఆఫ్ లైన్ ధ్రువీకరణలు, శిక్షణ అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇంకో అంశం - రిటైల్, లాజిస్టిక్స్ నిర్వహణ, ఆహార-పానీయ వాణిజ్య నిర్వహణలో ఎంఎస్ డీఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన యువకులకు స్విగ్గీ రెస్టారెంట్లు, రిటైల్ బ్యాకెండ్ కార్యకలాపాల్లో అవకాశం కల్పిస్తాం. అక్కడ వారికి తగిన అవకాశాలు లభిస్తాయి” అన్నారు.
“స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ కార్యకలాపాల్లో, దేశవ్యాప్తంగా 3,000 మందిని మేం నియమించుకోగలం. ఎంఎస్ డీఈ ద్వారా శిక్షణ పొందిన 200 మందికి మా శీఘ్ర వాణిజ్య కార్యకలాపాల్లో సీనియర్ స్థాయిలో శిక్షణ, ఇంటర్న్ షిప్ అందించడానికి కూడా ప్రణాళికలు రూపొందించాం. ఎంప్లాయీ వలంటీర్ ప్రోగ్రామ్ ద్వారా కృత్రిమ మేధస్సు (ఏఐ), మార్కెటింగ్, రిటైల్, శీఘ్ర వాణిజ్యం, లాజిస్టిక్స్, తదితర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో శిక్షణ ద్వారా అంతర్గత నైపుణ్యాలను స్విగ్గీ పెంపొందించగలదు” అని కూడా పేర్కొన్నారు.
****
(Release ID: 2053018)
Visitor Counter : 74