ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మంకీపాక్స్ అనుమానిత కేసు విచారణలో ఉంది
అనుమానితుడిని ఐసోలేషన్‌లో ఉంచాం
ఆందోళన అవసరం లేదు
प्रविष्टि तिथि:
08 SEP 2024 3:48PM by PIB Hyderabad
ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుండి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించాం. వెంటనే అతడిని ఒక ఆసుపత్రిలో చేర్చి, ఐసోలేషన్ లో ఉంచాం, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది.
రోగి నుండి నమూనాలు సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం పరీక్షలకు పంపించాం. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దీని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ముందస్తు అంచనాలు సిద్ధం చేసిన క్రమంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటి కేసులు వెలుగుచూస్తే వాటిని ఎదుర్కొనేందుకు దేశం పూర్తిగా సన్నద్ధంగా ఉంది. రాబోయే కాలంలో ఈ ముప్పు తలెత్తితే దానిని ఎదుర్కొని దాని తీవ్రతను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు కూడా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
****
(रिलीज़ आईडी: 2053005)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Punjabi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Malayalam