ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి

విభిన్నబోధనా పద్ధతుల గురించి ప్రధానికి వివరించిన పురస్కార గ్రహీతలు

వికసిత భారత్ కోసం నేటి యువతను సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది: ప్రధానమంత్రి

జాతీయ విద్యావిధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాముఖ్యతల గురించి చర్చించిన ప్రధానమంత్రి

విద్యార్థులకు వివిధ భాషల్లో స్థానిక జానపద కథలను నేర్పించి, ఇతర భాషలను ఉపాధ్యాయులు పరిచయం చేయాలని సూచించిన ప్రధానమంత్రి

తాము అవలంబిస్తున్న ఉత్తమ బోధనా విధానాలను ఒకరితో ఒకరు పంచుకోవాలని సూచించిన ప్రధానమంత్రి

భారత వైవిధ్యాన్ని తెలిపేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యటనలకు తీసుకెళ్లాలి: ప్రధానమంత్రి

Posted On: 06 SEP 2024 4:06PM by PIB Hyderabad

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లోక్ కల్యాణ్ మార్గ్, 7 లోని ఆయన నివాసంలో సంభాషించారు.

పురస్కార గ్రహీతలు తమ బోధనానుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారుఅభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తాము పాటిస్తున్న బోధనా విధానాల గురించి వివరించారుఉపాధ్యాయ వృత్తితో పాటు వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో కొన్నింటిని పంచుకున్నారుఎన్నో ఏళ్లుగా బోధనపై చూపిస్తున్న అంకిత భావాన్నీకొనసాగిస్తున్న ఉత్సాహాన్నీపురస్కారాల ద్వారా సాధించిన గుర్తింపు పొందడాన్నీ ప్రధానమంత్రి ప్రశంసించారు.

జాతీయ విద్యా విధాన ప్రభావంమాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారువేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారుదీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.

 

భారత వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యా యాత్రలకు తీసుకువెళ్లాలని, ఇది వారి అభ్యాసానికి, దేశం గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రధామంత్రి తెలిపారు. ఇలా చేయడం ద్వారా పర్యటక రంగం వృద్ధి చెందుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల ద్వారా తాము పాటిస్తున్న ఉత్తమ బోధనా విధానాలను ఒకరితో మరొకరు పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రతి ఒక్కరూ వాటిని నేర్చుకుని, స్వీకరించి, ప్రయోజనం పొందుతారని ప్రధానమంత్రి అన్నారు.

ఉపాధ్యాయులు దేశానికి అతి ముఖ్యమైన సేవ చేస్తున్నారన్న ప్రధాని నేటి యువతను వికసిత భారత్ కోసం సిద్ధం చేసే బాధ్యత గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

నేపథ్యం

నిబద్ధత, విశిష్టమైన కృషి ద్వారా విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా తమ విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడమే ఈ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. ఈ అవార్డుల కోసం ఈ ఏడాది 82 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో 50 మందిని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం, 16 మందిని ఉన్నత విద్యా విభాగం, మరో 16 మందిని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక విభాగం ఎంపిక చేశాయి.

 


(Release ID: 2052695) Visitor Counter : 60