ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సింగపూర్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

प्रविष्टि तिथि: 05 SEP 2024 3:32PM by PIB Hyderabad

సింగపూర్ అధ్యక్షుడు గౌరవనీయ హెచ్.ఇ. థర్మన్ షణ్ముగరత్నంతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గురువారం సమావేశమయ్యారు.

భారత్ – సింగపూర్ భాగస్వామ్యంపై అధ్యక్షుడు థర్మన్ చొరవ తీసుకోవడాన్ని ప్రధాని అభినందించారు. ఉమ్మడి ప్రయోజనాలున్న ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ చర్చించారు. నమ్మకం, పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు మెరుగుపడితే, ఉమ్మడి సమన్వయం దిశగా పటిష్ట మార్గం ఏర్పడుతుందని వారు ప్రకటించారు. అధునాతన తయారీ రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్, సింగపూర్ మధ్య సహకార విస్తరణకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వ‌చ్చే ఏడాది భారత్ లో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ కు స్వాగతం పలికేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని వెల్లడించారు. 


(रिलीज़ आईडी: 2052397) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam