భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎల్ఐ ఏసీసీ పథకం కింద బిడ్డర్‌కు 10 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని కేటాయించిన ఎంహెచ్ఐ


పీఎల్ఐ ఏసీసీ పథకం కింద 10 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల గిగా-స్కేల్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీ కేంద్రాల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్ల కోసం దాఖలైన ఏడు బిడ్లు

భారతదేశంలో టెక్నాలజీ అగ్నోస్టిక్ అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీకి ప్రోత్సాహం అందిస్తున్న పీఎల్ఐ ఏసీసీ పథకం

ప్రధాన మంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లకు అత్యంత కీలకం

Posted On: 04 SEP 2024 3:37PM by PIB Hyderabad

అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్ కోసం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద బిడ్డర్ ఎంపికను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఐ) ప్రకటించింది. క్యూసీబీఎస్ విధానంలో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 10 జీడబ్ల్యూహెచ్ ఏసీసీ సామర్థ్యాన్ని దక్కించుకుంది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అలాగే ఏసీసీ బ్యాటరీ తయారీలో దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశగా ఈ చొరవ మరో అడుగు అవుతుంది.

భారీ పరిశ్రమల శాఖ (ఎమ్‌హెచ్ఐ) 10 జీడబ్ల్యూహెచ్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీకి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్‌ల (పీఎల్ఐ) కోసం గ్లోబల్ టెండర్ కింద ఏడుగురు బిడ్డర్ల నుండి బిడ్‌లను స్వీకరించింది. ఈ ప్రాజెక్ట్ గరిష్ట బడ్జెట్ వ్యయం రూ.3,620 కోట్లుగా జనవరి 24న ప్రకటించింది.

 

మొత్తం 70 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం గురించిన ఈ టెండర్‌ కోసం బిడ్‌లను సమర్పించిన బిడ్డర్‌లలో (అక్షర క్రమంలో) ఏసీఎంఈ క్లీన్‌టెక్ సొల్యూషన్స్, అమర రాజా అడ్వాన్స్ డ్ సెల్ టెక్నాలజీస్, అన్వీ పవర్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్, లూకాస్‌ టీవీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే వారీ ఎనర్జీస్ ఉన్నాయి.

 

మొత్తం ఏడు బిడ్లను పరిశీలించి, ఆర్ఎఫ్‌పీ అవసరాలకు అనుగుణంగా ఉన్న ఆరు కంపెనీలను ఫైనాన్షియల్ ఎవల్యూషన్ కోసం ఎంపిక చేశారు. దీని ప్రకారం, భారత ప్రభుత్వ సీపీపీ పోర్టల్ ద్వారా ఆర్ఎఫ్‌పీ పారదర్శక గ్లోబల్ టెండర్ ప్రక్రియలో టెక్నికల్ ఎవల్యూషన్ ఫలితాల ప్రకటన తర్వాత, అర్హత పొందిన బిడ్డర్‌లకు చెందిన ఆర్థిక బిడ్లను ఆగస్ట్ 2న తెరిచారు.

 

క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) విధానంలో షార్ట్‌ లిస్ట్ చేసిన బిడ్డర్ల ఆధారంగా తుది పరిశీలన చేశారు. అలాగే బిడ్డర్లను వారి సాంకేతిక, ఆర్థిక ఉమ్మడి స్కోర్‌ల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. అత్యధిక స్కోర్‌తో షార్ట్ లిస్ట్ అయిన బిడ్డర్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 10 జీడబ్ల్యూహెచ్ పీఎల్ఐ ఏసీసీ సామర్థ్యాన్ని మంత్రిత్వ శాఖ కేటాయించింది. అలాగే మిగిలిన అయిదు షార్ట్‌ లిస్ట్ చేసిన బిడ్డర్లను వారి ర్యాంక్ ప్రకారం ర్యాంక్ II నుండి ప్రారంభమయ్యే వెయిటింగ్ లిస్టులో ఉంచారు. ప్రోగ్రాం కింద వెయిట్‌ లిస్ట్ లో ఉన్న బిడ్డర్లలో ఏసీఎమ్ఈ క్లీన్‌టెక్ సొల్యూషన్స్, (వెయిట్‌లిస్ట్ 1), అమర రాజా అడ్వాన్స్ డ్ సెల్ టెక్నాలజీస్ (వెయిట్‌లిస్ట్ 2), వారీ ఎనర్జీస్ (వెయిట్‌లిస్ట్ 3), జేఎస్‌డబ్ల్యూ నియో (వెయిట్‌లిస్ట్ 4) అలాగే లూకాస్ టీవిఎస్  (వెయిట్‌లిస్ట్ 5)గా ఉన్నాయి.

 

50 గిగా వాట్ హవర్స్ (జీడబ్ల్యూహెచ్) ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో రూ. 18,100 కోట్ల వ్యయంతో 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్'పై టెక్నాలజీ ఆగ్నోస్టిక్ పీఎల్ఐ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2021 మే నెలలో ప్రకటించింది. ఏసీసీ పీఎల్ఐ బిడ్డింగ్ మొదటి దశ 2022 మార్చి నెలలో ముగిసింది. ఎంపికైన మూడు సంస్థలకు మొత్తం ముప్పై (30) గిగా వాట్ హవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యాన్ని కేటాయించారు. ఎంపికైన ఈ మూడు సంస్థలు 2022 జూలై నెలలో ప్రోగ్రామ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

పీఎల్ఐ ఏసీసీ పథకం భారతదేశంలో అధునాతన కెమిస్ట్రీ సెల్‌లను తయారీ కోసం స్వీకరించిన బిడ్‌ల పరంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ విస్తృత స్పందనను బట్టి ప్రపంచ ఉత్పాదక రంగ గమ్యంగా భారత అద్భుత పురోగతి పట్ల పారిశ్రామిక రంగం తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినట్లు స్పష్టమవుతుంది. దేశ స్వావలంబన లక్ష్యంగా భారత ప్రధాని ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ అనే స్పష్టమైన పిలుపును ఈ పరిణామం ప్రతిఫలిస్తోంది.

 

***


(Release ID: 2052097) Visitor Counter : 64