రక్షణ మంత్రిత్వ శాఖ
సుఖోయ్ విమానాల ఏరో ఇంజిన్ల కొనుగోలుకు క్యాబినెట్ ఆమోదం
Posted On:
02 SEP 2024 8:24PM by PIB Hyderabad
హెచ్ఏఎల్ నుండి రూ.26,000 కోట్ల విలువైన 240 ఏరో-ఇంజిన్ల కొనుగోలు
భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకెఐ విమానాల కోసం 240 ఏరో-ఇంజిన్లను హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుండి కోనుగోలు చేయాలనే నిర్ణయానికి భద్రతపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దేశీయ కంపెనీల నుంచి కొనుగోలు చేసే విధానం కింద అన్ని పన్నులు, సుంకాలను కలుపుకొని రూ.26,000 కోట్ల విలువైన ఇంజిన్లను కొంటున్నారు. ఒక ఏడాది నుంచి 8 ఏళ్లలోపు సమయంలో ఈ ఇంజిన్లను హెచ్ ఏ ఎల్ అందిస్తుంది.
ఏరో ఇంజిన్ల కీలక విభాగాల దేశీయీకరణ కారణంగా ఈ ఇంజిన్ల విడిభాగాలు దేశీయంగా 54 శాతం వరకూ పెరిగాయి. హెచ్ ఏ ఎల్ కు చెందిన కోరాపుట్ డివిజనులో వీటిని తయారు చేస్తారు.
భారతీయ వైమానిక దళానికి చెందిన ఎస్ యు 30 ఎంకె ఐ విమానాలు అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు. హెచ్ ఏ ఎల్ తయారు చేస్తున్న ఏరో ఇంజిన్ల సరఫరాతో ఐఏఎఫ్ కీలక విడి విభాగాల అవసరాలు నెరవేరుతాయి. ఈ ఏర్పాటు కారణంగా, ఎలాంటి అడ్డంకులు లేని కార్యకలాపాలతో, దేశ రక్షణ సంసిద్ధత మరింత బలపడుతుంది.
***
(Release ID: 2051100)
Visitor Counter : 99