ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 30 AUG 2024 2:27PM by PIB Hyderabad

నమస్కారం!

ఆర్బిఐ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ గారుశ్రీ క్రిస్ గోపాలకృష్ణన్రెగ్యులేటరీ సంస్థల గౌరవనీయ సభ్యులుఫైనాన్స్ పరిశ్రమ విశిష్ట నాయకులుఫిన్ టెక్, స్టార్టప్ రంగాలకు చెందిన నా స్నేహితులు, ఇతర విశిష్ట అతిథులుసోదరసోదరీమణులారా!,

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉందిమన ఆర్థిక వ్యవస్థలోనూమార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందిఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాంఅలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుందిదేశం నలుమూలల నుంచిప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుస్వాగతంఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశంపలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించిందిఅక్కడమన యువత నాయకత్వంలోభవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశానుమీ పనికి అనుగుణంగామరో మాటలో చెప్పాలంటేనిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోందిఈ ఉత్సవ నిర్వాహకులనుపాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

మిత్రులారా,

మన మధ్య గణనీయమైన సంఖ్యలో అంతర్జాతీయ అతిథులు కూడా ఉన్నారు. ఒకప్పుడు భారత్ కు వచ్చే సందర్శకులు మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని చూసి అబ్బురపడేవారు. ఇప్పుడు ప్రజలు భారత్ కు వచ్చినప్పుడు మన ఫిన్ టెక్ వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.విమానాశ్రయం వద్ద దిగిన క్షణం నుండి స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ అనుభవాల వరకుభారతదేశంలో ఫిన్టెక్ విప్లవం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తుంది.

గత పదేళ్లలో ఫిన్టెక్ రంగంలో 31 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అదే కాలంలో మన ఫిన్ టెక్ అంకుర సంస్థలు 500 శాతం పెరిగాయి. సరసమైన ధరకు మొబైల్ ఫోన్లుతక్కువ ఖర్చుతో డేటాజీరో బ్యాలెన్స్ జన్ ధన్ బ్యాంకు ఖాతాలు దేశంలో అద్భుతాలు చేశాయి. మీలో కొందరికి గుర్తుండవచ్చుఅంత కాలం కిందట భారతదేశంలో ఫిన్టెక్ విప్లవం ఎలా సంభవించగలదంటూ ప్రశ్నించిన సంశయవాదులు ఉన్నారు. పార్లమెంటులో కూడా అడిగారువారు తమను తాము అత్యంత పరిజ్ఞానం కలిగిన వ్యక్తులుగా భావించారుప్రతి గ్రామంలో సరిపడా బ్యాంకులుశాఖలు లేనప్పుడుఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగా ఉన్నప్పుడువిద్యుత్ సరఫరా విశ్వసనీయంగా లేనప్పుడుప్రజలు తమ పరికరాలను ఎక్కడ రీఛార్జ్ చేస్తారనీఫిన్టెక్ విప్లవం ఎలా జరుగుతుందనీ వారు ప్రశ్నించారుఈ ప్రశ్నలు నన్ను ఉద్దేశించినవేకానీ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో చూడండికేవలం ఒక దశాబ్దంలోభారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు కోట్ల నుండి 94 కోట్లకు పెరిగారునేడుఒక డిజిటల్ గుర్తింపుఒక ఆధార్ కార్డు లేకుండా ఒక భారతీయ యువకుడిని కనుగొనడం చాలా అరుదు. 53 కోట్ల మందికి జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయిఅంటే పదేళ్ల వ్యవధిలో మొత్తం యూరోపియన్ యూనియన్ జనాభాకు సమానమైన జనాభాను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం.

మిత్రులారా,

జన్ ధన్ఆధార్మొబైల్ త్రయం మరో పరివర్తనకు నాంది పలికాయిఒకప్పుడు 'క్యాష్ ఈజ్ కింగ్అని ప్రజలు నమ్మేవారుప్రస్తుతం ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో సగానికిపైగా భారత్ లోనే జరుగుతున్నాయిప్రపంచవ్యాప్తంగా ఫిన్ టెక్ ఆవిష్కరణకు భారత్ యూపీఐ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా మారిందిపల్లెలోనైనానగరంలోనైనావేసవి తాపంలోనైనాశీతాకాలపు చలిలోనైనావర్షం లేదా మంచు వచ్చినాభారతదేశంలో బ్యాంకింగ్ సేవలు రోజుకు 24 గంటలువారానికి ఏడు రోజులుసంవత్సరంలో 12 నెలలు పనిచేస్తాయికోవిడ్ -19 మహమ్మారి తీవ్ర సంక్షోభ సమయంలో కూడాబ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగిన కొన్ని దేశాలలో భారత్ ఒకటి.

మిత్రులారా,

కొద్ది రోజుల క్రితం జన్ ధన్ యోజన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుందిమహిళా సాధికారతకు జన్ ధన్ యోజన ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించింది. 29 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలను తెరిచారుపొదుపు, పెట్టుబడులకు కొత్త మార్గాలను సృష్టించారుఈ పథకానికి ధన్యవాదాలు.  ఈ జన్ ధన్ ఖాతాల ఆధారంగా అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ స్కీమ్ ముద్రాను ప్రారంభించాంఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రూ.27 లక్షల కోట్లకు పైగా రుణాలు అందించాం, ఇందులో సుమారు 70 శాతం లబ్ధిదారులు మహిళలేజన్ ధన్ ఖాతాలు మహిళా స్వయం సహాయక బృందాలను బ్యాంకింగ్ వ్యవస్థలో విలీనం చేశాయినేడు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఈ ప్రయోజనాలను పొందుతున్నారుతద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు జన్ ధన్ కార్యక్రమం బలమైన పునాది వేసింది.

మిత్రులారా,

సమాంతర ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. సమాంతర ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడంలో ఫిన్టెక్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయానికి అభినందనలు అందుకునేందుకు మీరు అర్హులు. డిజిటల్ టెక్నాలజీ దేశంలో పారదర్శకతను ఎలా తీసుకువచ్చిందో మనం చూశాం. నేడువందలాది ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరుగుతున్నాయిదీని వల్ల వ్యవస్థ నుండి లీకేజీని సమర్థవంతంగా తొలగిస్తాయి. ఈ రోజునప్రజలు అధికారిక వ్యవస్థలో చేరడం వల్ల ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా,

భారతదేశంలో ఫిన్టెక్ కారణంగా వచ్చిన పరివర్తన కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి

 

 

 

 

మాత్రమే పరిమితం కాలేదు. దీని సామాజిక ప్రభావం చాలా విస్తృతమైనది.ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుందిగతంలోబ్యాంకింగ్ సేవలను పొందడానికి ఒక రోజంతా పట్టేదిఇది రైతులుమత్స్యకారులు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సవాలుగా ఉండేదిఫిన్ టెక్ ఈ సమస్యను పరిష్కరించిందిగతంలో బ్యాంకులు భౌతిక భవనాలకే పరిమితమయ్యేవినేడుఅవి ప్రతి భారతీయుడి మొబైల్ పరికరాలలో అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా,

ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యీకరించడంలో ఫిన్ టెక్ గొప్ప పాత్రను  పోషించిందిరుణాలుక్రెడిట్ కార్డులుపెట్టుబడులుబీమా వంటి ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయిఫిన్ టెక్ రుణ విధానాల్ని సులభతరం చేసింది, మరింత సమ్మిళితం చేసిందిఒక ఉదాహరణ చెబుతానుభారతదేశంలో వీధి విక్రేతల సంప్రదాయం చాలా పురాతనమైనదని మీకు తెలుసు.కాని వారు గతంలో అధికారిక బ్యాంకింగ్ లో లేరు. ఫిన్ టెక్ ఈ పరిస్థితిని మార్చిందినేడుఈ విక్రేతలు పిఎం స్వనిధి యోజన ద్వారా పూచీకత్తు లేని రుణాలను పొందవచ్చు.  వారి డిజిటల్ లావాదేవీ రికార్డుల ఆధారంగావారు తమ వ్యాపారాలను పెంచడానికి అదనపు రుణాలను పొందవచ్చుగతంలో షేర్లుమ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ప్రధాన నగరాలకే పరిమితమయ్యేవిఇప్పుడు పల్లెలుచిన్న పట్టణాల్లో ఉన్నవారు కూడా ఈ పెట్టుబడుల అవకాశాలను ఎక్కువగా అన్వేషిస్తున్నారుప్రస్తుతం డీమ్యాట్ ఖాతాలను నిమిషాల్లోనే ఇంటి నుంచే తెరవవచ్చుపెట్టుబడి నివేదికలు నెట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.పెద్ద సంఖ్యలో భారతీయులు ఇప్పుడు రిమోట్ హెల్త్ కేర్ సేవలను పొందుతున్నారునెట్ లో చదువుతున్నారు, డిజిటల్ గా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వీటిలో ఏదీ ఫిన్ టెక్ లేకుండా సాధ్యమయ్యేది కాదుఅంటే భారతదేశంలో ఫిన్టెక్ విప్లవంజీవన గౌరవంజీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది.

మిత్రులారా,

భారత్ ఫిన్ టెక్ విప్లవం విజయం సృజనాత్మకత ఫలితం మాత్రమే కాదువిస్తృతమైన ఆదరణకు ఉదాహరణ. భారత ప్రజలు ఫిన్ టెక్ ను ఆదరించిన వేగంస్థాయి అసమానందీని క్రెడిట్లో ఎక్కువ భాగం మా డిజిటల్ పబ్లిక్ వ్యవస్థ (డిపిఐ), మా ఫిన్టెక్స్ కూ చెందుతుందిదేశంలో ఈ సాంకేతికతపై విశ్వాసాన్ని పెంచడానికి అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయిక్యూఆర్ కోడ్ లతో పాటు సౌండ్ బాక్స్ లను ఉపయోగించడం అలాంటి ఆవిష్కరణల్లో ఒకటిమన ఫిన్ టెక్ రంగం కూడా ప్రభుత్వ బ్యాంక్ సఖి కార్యక్రమాన్ని అధ్యయనం చేయాలినేను ఫిన్ టెక్ యువతతో ఒక కథను పంచుకోవాలనుకుంటున్నానుజల్గావ్ సందర్శన సమయంలోనేను ఈ బ్యాంక్ సఖీలలో కొంతమందిని కలిశానురోజుకు రూ.1.5 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు వారిలో ఒకరు గర్వంగా చెప్పారుఎంత ఆత్మవిశ్వాసం? ఆమె ఒక పల్లెటూరికి చెందిన మహిళమన కుమార్తెలు గ్రామాల్లో బ్యాంకింగ్డిజిటల్ అవగాహనను వ్యాప్తి చేసిన విధానం ఫిన్టెక్ కు ఒక కొత్త మార్కెట్ ను అందించింది.

మిత్రులారా,

21వ శతాబ్దపు ప్రపంచం మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందుతోందిసాంప్రదాయ కరెన్సీ నుండి క్యూఆర్ కోడ్ వరకూ ప్రయాణం చేసేందుకు శతాబ్దాలు పట్టిందికానీ ఈ రోజు మనం దాదాపు ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలను చూస్తున్నాండిజిటల్ ఓన్లీ బ్యాంకులునియో బ్యాంకింగ్ వంటి భావనలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయిడిజిటల్ ట్విన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం, డేటా ఆధారిత బ్యాంకింగ్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళుతున్నాయిఇది రిస్క్ మేనేజ్ మెంట్మోసం గుర్తింపు నుండి కస్టమర్  అనుభవం వరకు ప్రతి దాన్ని విప్లవాత్మకంగా మారుస్తున్నాయిభారత్ నిరంతరం కొత్త ఫిన్ టెక్ ప్రొడక్టులను లాంచ్ చేస్తుండటం పట్ల నేను సంతోషిస్తున్నానుమేం స్థానికంగా డిజైన్ చేస్తునప్పటికీప్రపంచ ప్రయోజనాలను కలిగి ఉన్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాంఉదాహరణకుఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్డిసిచిన్న వ్యాపారాలు, సంస్థలను గణనీయమైన అవకాశాలతో అనుసంధానించడం ద్వారా నెట్ షాపింగ్ ను మరింత సమ్మిళితం చేస్తోందివ్యక్తులు, కంపెనీలకు పనులను సులభతరం చేయడానికి ఖాతా అగ్రిగేటర్లు డేటాను ఉపయోగిస్తున్నారుట్రేడ్స్ ప్లాట్ఫామ్ చిన్న సంస్థలకు లిక్విడిటీని నగదు ప్రవాహాన్ని పెంచుతోంది-రూపీ బహుముఖ డిజిటల్ వోచర్ గా అవతరించిందిఇది వివిధ మార్గాల్లో ఉపయోగపడుతున్నదిఈ భారతీయ ఆవిష్కరణలు ఇతర దేశాలకు కూడా అపారమైన విలువను కలిగి ఉన్నాయిదీనిని దృష్టిలో ఉంచుకునిమా జి -20 అధ్యక్ష పదవీకాలంలోమేం గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ వ్యవస్థ రిపోజిటరీని సృష్టించాలని ప్రతిపాదించాంఈ సూచనను జి -20 సభ్య దేశాలు సాదరంగా స్వీకరించాయికృత్రిమ మేధ దుర్వినియోగం గురించి ఆందోళనలను కూడా నేను అర్థం చేసుకున్నానుఅందుకే కృత్రిమ మేధ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని భారత్ వాదించింది.

మిత్రులారా,

ఫిన్ టెక్ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధానపరమైన సర్దుబాట్లు చేస్తోందిఇటీవలమేము ఏంజెల్ టాక్స్ ను రద్దు చేసాం. ఇది సరైన నిర్ణయం కాదాదేశంలో పరిశోధనలుఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాంఅంతేకాకుండా డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చాంఅయితేమా రెగ్యులేటర్ల నుండి నాకు కొన్ని అంచనాలు ఉన్నాయిసైబర్ మోసాలను నివారించడానికి, డిజిటల్ అక్షరాస్యతను పెంచడానికి మనం మరింత ముఖ్యమైన చర్యలు తీసుకోవాలిఅంకుర సంస్థలు, ఫిన్ టెక్ ల ఎదుగుదలకు సైబర్ మోసం అడ్డంకిగా మారకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

మిత్రులారా,

గతంలో బ్యాంకు పతనం అంచున ఉందన్న వార్తలు రావడానికి 5-7 రోజులు పట్టేదినేడుఏదైనా వ్యవస్థ సైబర్ మోసాన్ని గుర్తిస్తేపర్యవసానాలు తక్షణమే ఉంటాయి. ప్రభావిత కంపెనీని నిమిషాల్లో పూర్తి చేయవచ్చుముఖ్యంగా ఫిన్ టెక్ కు ఇది కీలకంఅంతేకాకసైబర్ పరిష్కారాలకు తక్కువ జీవితకాలం ఉంటుందిసైబర్ సొల్యూషన్ ఎంత అధునాతనమైనప్పటికీనిజాయితీ లేని వ్యక్తులు దానిని ఉల్లంఘించడానికి ఎక్కువ సమయం పట్టదుఇది అకాల నిష్క్రమణకు దారితీస్తుందిఅందువల్లనిరంతరం కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయడం అత్యవసరం.

మిత్రులారా,

నేడు సుస్థిర ఆర్థిక వృద్ధి భారత్ కు అత్యంత ప్రాధాన్యాంశంపటిష్ఠమైనపారదర్శకమైనసమర్థవంతమైన వ్యవస్థల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాంఅధునాతన సాంకేతిక పరిజ్ఞానం, రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ లతో మేము మా ఆర్థిక మార్కెట్లను మెరుగుపరుస్తున్నాంఅదే సమయంలో గ్రీన్ ఫైనాన్స్ ద్వారా స్థిరమైన వృద్ధికి మద్దతు ఇస్తున్నాం. .ఆర్థిక సమ్మిళితం ( ఫైనాన్షియల్ ఇంక్లూజన్)ఈ రంగంలో సమగ్ర పరిపక్వత సాధించడంపై మా దృష్టి ఉందిభారతదేశ ప్రజలకు అధిక-నాణ్యమైన జీవనశైలిని అందించే మా మిషన్ లో భారత్ ఫిన్ టెక్ ఎకోసిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నానుప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి భారత్ ఫిన్ టెక్ ఎకోసిస్టమ్ దోహదం చేస్తుందని నేను విశ్వసిస్తున్నానుమన యువత ప్రతిభపై నాకున్న నమ్మక౦ అపారమైనదినేను చాలా నమ్మక౦తో చెబుతున్నానుమన అత్యుత్తమ ప్రతిభ ఇంకా రావాల్సి ఉ౦ది.

ఇది మీ ఐదవ కార్యక్రమం, కదామీ పదో కార్యక్రమానికి కూడా హాజరయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానుమీరు ఇంత ఎత్తుకు చేరుకుంటారని ఊహించి ఉండకపోవచ్చుకానీ స్నేహితులారాఈ రోజుమీ కొన్ని స్టార్టప్ బృందాలను కలిసే అవకాశం నాకు లభించిందినేను అందరినీ కలవలేకపోయినాకొంతమంది వ్యక్తులతో సంభాషించానుఈ రంగం లో ఉన్న  అపారమైన సామర్థ్యాన్ని నేను గుర్తించడం వల్ల నేను ప్రతి ఒక్కరికీ 10 పనులను కేటాయించాను. ఇది గణనీయమైన మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది మిత్రులారాఒక పెద్ద విప్లవం జరుగుతోందిదాని బలమైన పునాదిని ఇక్కడ ఇప్పటికే మనం చూడవచ్చుఈ ఆత్మవిశ్వాసంతో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుచాలా ధన్యవాదాలు!

శ్రీ కృష్ణ గోపాల్ అభ్యర్థన మేరకు మేం ఈ ఫోటో తీసుకున్నాముదీని ప్రాముఖ్యత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చుప్రయోజనాన్ని నేను వివరిస్తాను. నేను కృత్రిమ మేథ ప్రపంచంతో అనుసంధానించబడిన వ్యక్తినినమో యాప్ లోకి వెళ్లి ఫొటో విభాగానికి వెళ్లి అక్కడ సెల్ఫీ సేవ్ చేసుకుంటే ఈ రోజు నాతో ఎక్కడ కనిపించినా ఆ ఫొటోను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. 

ధన్యవాదాలు!

 

***


(Release ID: 2050687) Visitor Counter : 49