విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్ హెచ్ పీ సీ కి నవరత్న హోదా
Posted On:
31 AUG 2024 12:50PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగంలోని ఎన్‌హెహ్‌పిసి సంస్థకు ప్రతిష్టాత్మక 'నవరత్న' హోదా దక్కింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఆగష్టు 30 న ఉత్తర్వులు జారీ చేసింది. 'నవరత్న సంస్థ'గా ప్రకటించడం ద్వారా, ఎన్ హెచ్ పీ సీ సంస్థకు మరింత కార్యాచరణ, ఆర్థిక స్వయంప్రతిపత్తి లభించనుంది.
"ఇది ఎన్ హెచ్ పీ సీ సంస్థకు, సభ్యులకు నిజంగా చారిత్రాత్మక సందర్భం, సంస్థ ఆర్థిక, కార్యాచరణ విజయాలకు గుర్తింపు" అని ఎన్ హెచ్ పీ సీ సీఎండీ శ్రీ ఆర్.కె.చౌదరి ఈ సందర్భంగా అన్నారు. భారత ప్రభుత్వంఎన్ హెచ్ పీ సీ పై అచంచలమైన విశ్వాసం ఉంచి, నవరత్న హోదాను కల్పించినందుకు సంస్థ తరఫున విద్యుత్ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. భారత విద్యుత్ రంగంలో ఎన్ హెచ్ పీ సీ ప్రధాన పాత్ర పోషిస్తోందని... దేశంలోని జలవిద్యుత్ సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించిందని శ్రీ చౌదరి అన్నారు. ఎన్ హెచ్ పీ సీ పూర్తి హరిత ఇంధ సంస్థ అని.. పవన, సౌర విద్యుత్ రంగాల్లోనూ విస్తరించిందని ఆయన అన్నారు.
నవరత్న హోదా పొందడం వల్ల ఎన్ హెచ్ పీ సీకి పలు కీలక ప్రయోజనాలు చేకూరనున్నాయి. సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి, సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. ఉద్యోగులకు మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఇది ప్రధానంగా మూలధన వ్యయం (కాపెక్స్), పెట్టుబడి ప్రణాళికల అవకాశాలను పెంపొందిస్తుంది. వృద్ధిని పెంచి, మార్కెట్ పరిధిని విస్తరిస్తుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలను సమకూరుస్తుంది. ఉమ్మడి వెంచర్లు, విదేశీ కార్యాలయాల ఏర్పాటు, కొత్త మార్కెట్లను అందిపుచ్చుకోవడం, స్థానిక నైపుణ్యాన్ని వినియోగించుకోవడం వంటి అధికారాలు ఎన్ హెచ్ పీ సీ సంస్థకి లభిస్తాయి. సాంకేతిక ఒడంబడికల ద్వారా మార్కెట్ లో మరింత బలపడి వినూత్న విభాగాల వైపు అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది. . ఇది విలీనాలు, కొనుగోళ్లను సులభతరం చేస్తుంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం తో పాటు మార్కెట్ వాటాను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం, సంస్థ స్థాపిత సామర్థ్యం 7144.20 మెగావాట్లు కాగా, సంస్థ ప్రస్తుతం 10,442.70 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణంలో నిమగ్నమై ఉంది. వీటిలో 2000 మెగావాట్ల సుబన్సిరి లోయర్ ప్రాజెక్ట్ (అస్సాం/ అరుణాచల్ ప్రదేశ్), 2880 మెగావాట్ల దిబాంగ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (అరుణాచల్ ప్రదేశ్) ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌హెహ్‌పిసి వివిధ దశల్లో 50,000 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులపై పనిచేస్తోంది. 2032 నాటికి 23 వేల మెగావాట్లు, 2047 నాటికి 50 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించేందుకు సంస్థ కృషి చేస్తోంది.
***
(Release ID: 2050529)
Visitor Counter : 146