రక్షణ మంత్రిత్వ శాఖ
రాత్రి వేళ సాహసోపేతంగా 11 మంది ప్రాణాలను కాపాడిన భారత తీరగస్తీ దళం
Posted On:
26 AUG 2024 2:50PM by PIB Hyderabad
ఆగస్ట్ 26, 2024న రాత్రి వేళ సవాలుతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ప్రమాదంలో ఉన్న ఎంపీ ఐటీటీ ప్యూమా ఓడలో ఉన్న 11 మందిని భారత తీరగస్తీ దళం(ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ) రక్షించింది. ముంబయిలో నమోదైన ఈ సాధారణ కార్గో నౌక కోల్‌కతా మీదుగా పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్తుండగా సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణాన 90 నాటికల్ మైళ్ల దూరంలో మునిగిపోయింది.
చెన్నైలోని మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు 2024 ఆగస్టు 25న సాయంత్రం విపత్తు సంకేతాలు (డిస్ట్రెస్ సిగ్నల్స్) అందాయి. కోల్‌కతాలోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం (నార్త్ ఈస్ట్) వెంటనే రెండు ఐసీజీ నౌకలు, ఒక డార్నియర్ విమానాన్ని సంఘటనా స్థలానికి పంపింది. రాత్రి సమయంలో పని చేసే అత్యధునిక సెన్సార్లు కలిగిన డార్నియర్ విమానం అస్తవ్యస్తమైన లైఫ్ బోట్లను గుర్తించింది.
విమానం దిశా నిర్దేశం చేయగా లైఫ్ బోట్లున్న ప్రాంతానికి ఐసీజీ నౌక చేరుకుంది. ఒక దానికి ఒకటి కట్టిన రెండు లైఫ్ బోట్లలో సిబ్బంది ఉన్నారు. సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఐసీజీ నౌకలు సారంగ్, అమోగ్లు డార్నియర్ విమానంతో కలిసి, ఆగస్టు 25 అర్థరాత్రి, ఆగస్టు 26 తెల్లవారుజామున సిబ్బందిని కాపాడేందుకు సమన్వయంతో ఈ సముద్ర-వాయు రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించాయి.
***
(Release ID: 2048974)
Visitor Counter : 60