సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లాల్ చౌక్‌లోని అహ్దూస్ రెస్టారెంట్‌లో విపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు స్వేచ్ఛగా భోజనం చేసేలా వీలు కల్పించి, జమ్మూకాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించినందుకు ప్రధాని మోదీని ప్రశంసించిన డాక్టర్ జితేంద్ర సింగ్
జమ్మూకాశ్మీర్ ప్రజలందరికీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే పౌర హక్కులు
ఆర్టికల్ 370 మద్దతుదార్లు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకున్నారు: డాక్టర్ సింగ్
ఆరు దశాబ్దాల అంతరిక్ష విజయాలు, రాబోయే పదేళ్లలో అయిదు రెట్ల వృద్ధి: డాక్టర్ జితేంద్ర సింగ్
చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 చరిత్రాత్మక ల్యాండింగ్ ను ప్రత్యేకంగా పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్.
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విజయంతో అంతరిక్షణ అన్వేషణలో అగ్రగామిగా భారతదేశం
Posted On:
24 AUG 2024 4:05PM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వం కారణంగా జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతల పునరుద్ధరణ జరిగిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ విజయంతో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ నూతన పరిస్థితులను ఆస్వాదిస్తున్నారని అన్నారు. ఈ మధ్యనే లాల్ చౌక్ లోని అహ్దూస్ రెస్టారెంట్ ను విపక్ష నేతలు సందర్శించడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
"ఈ ప్రాంతంలో పునరుద్ధరించిన శాంతియుత వాతావరణానికీ, సాధారణ స్థితికీ ఇది నిదర్శనం" అని భారత్ 24 న్యూస్ సంస్థ విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
"గత ఏడు దశాబ్దాలుగా పౌరసత్వ హక్కులను కోల్పోయిన జమ్మూకాశ్మీర్‌లోని ప్రజలందరికీ చరిత్రాత్మక నిర్ణయమైన ఆర్టికల్ 370 రద్దుతో పౌరహక్కులు వచ్చాయని అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), భూభౌతిక శాస్త్రాలు (స్వతంత్ర) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి, అణుఇంధన శాఖ సహాయ మంత్రి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
జమ్మూకాశ్మీర్‌ని ఆర్టికల్ 370 మద్దతుదార్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పూర్వపు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పాలక వ్యవస్థ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టికల్ 370కి మద్దతుగా ఉందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. దానివల్ల వారు కేవలం 10% లేదా అంతకంటే తక్కువ ఓటింగ్‌తో ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేవారని, తద్వారా తరతరాలుగా వారి రాజవంశ పాలనను కొనసాగించగలిగారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
“మనం 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన పరిణామాలు చాలా గుర్తించదగినవి ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో ప్రజాస్వామ్యం, పాలన, అభివృద్ధి, భద్రత అనే నాలుగు స్థాయుల్లో విస్తృతంగా పరివర్తన జరిగింది” అని కేంద్ర మంత్రి అన్నారు.
పంచాయతీ చట్టంలోని 73వ, 74వ సవరణలను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అయితే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వారి సంకీర్ణ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. 2019కి ముందు కేంద్ర నిధులు అందుబాటులో లేకపోవడంతో జమ్మూకాశ్మీర్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగలేదని ఆయన అన్నారు.
జమ్మూకాశ్మీర్‌కు శాంతినీ, అభివృద్ధినీ తీసుకువచ్చిన ఘనత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి దక్కుతుందని, ఆయన ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలిగించారని, దేశాభివృద్ధిలో జమ్మూకాశ్మీర్ కీలక పాత్ర పోషిస్తుందని, కిరీట రత్నంగా వెలుగొందుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
భారతదేశ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి మాట్లాడుతూ 55 సంవత్సరాల క్రితం 1969లో భారతదేశ అంతరిక్ష ప్రయాణం మొదలైందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అప్పటికే అమెరికా వ్యోమగామి శ్రీ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టారని గుర్తు చేశారు. భారతదేశ శాస్త్రవేత్తల అచంచలమైన అంకితభావాన్ని ప్రశంసించిన ఆయన వారి ప్రతిభ కారణంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు పెట్టిన మొదటి దేశంగా భారతదేశం నిలిచిందని అన్నారు.
2014నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందించిన విధానపరమైన మద్దతు, నాయకత్వం దేశంలో శాస్త్రీయ కార్యక్రమాలు పుంజుకోవడానికి దోహద పడ్డాయని కేంద్ర అంతరిక్ష శాస్త్ర సహాయ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. తద్వారా భారతదేశ శాస్త్రవేత్తల సామర్థ్యం వెలుగులోకి వచ్చిందని అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడంతో అంతరిక్ష రంగ అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రస్తుతం ఆ సంఖ్య 300 కు చేరుకుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 8 బిలియన్ డాలర్లనుంచి 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన అంచనాను ఆయన ప్రస్తావించారు.
భారతదేశ శాస్త్రవేత్తలు తమ వ్యవస్థాపక పితామహుడు విక్రమ్ సారాభాయి కలలను సాకారం చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కృషి చేశారని అన్నారు. భారతదేశ అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా, సరైన వాతావరణాన్ని కల్పించడంద్వారా భారతదేశంలోని అపారమైన శక్తి సామర్థ్యాలు, ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా నిరూపితమయ్యాయని అని కేంద్ర మంత్రి అన్నారు.
***
(Release ID: 2048828)
Visitor Counter : 57