రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వాషింగ్టన్ డీసీలో అమెరికా రక్షణ కంపెనీల సీనియర్ లీడర్లతో రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ సంభాషణ


భారతదేశం రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న వివిధ సహ-అభివృద్ధి,

సహ-ఉత్పత్తి అవకాశాలను వివరించిన కేంద్ర మంత్రి

Posted On: 24 AUG 2024 6:28PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నిర్వహించిన ఇండస్ట్రీ రౌండ్ టేబుల్‌లో 2024 ఆగష్టు 23న వాషింగ్టన్ డీసీలో అమెరికా రక్షణ కంపెనీల సీనియర్ నాయకత్వంతో సంభాషించారు. భారతదేశంలో రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న వివిధ సహ-అభివృద్ధిసహ ఉత్పత్తి అవకాశాలను ఆయన వివరించారు. ‘‘భారత ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలు అమెరికాలోని సంస్థలతో సహా అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించడానికి భారత్ ప్రోత్సహిస్తుంది. జాయింట్ వెంచర్‌లను అభివృద్ధి చేయడానికిభారతదేశాన్ని వారి ప్రత్యామ్నాయ ఎగుమతి స్థావరంగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో జిఈ 414 ఏరో-ఇంజన్‌ల సహ-ఉత్పత్తి భారతదేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి’’ అని పేర్కొన్నారు.

'భాగస్వామ్యం', 'ఉమ్మడి ప్రయత్నాలుఅనే రెండు కీలక అంశాలు భారతదేశ రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఇతర దేశాలకన్నా వైవిధ్యంగా ఉంచుతామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారుఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికా రక్షణసాంకేతిక సంస్థల బోయింగ్జీఈ,  జనరల్ అటామిక్స్ నుండి సీనియర్ లీడర్లు హాజరయ్యారు. అలాగే జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ఎల్3 హారిస్లాక్‌హీడ్ మార్టిన్రేథియాన్ టెక్నాలజీస్,  రోల్స్ రాయిస్థాయర్‌మహన్ పాల్గొన్నాయి. వీటితో పాటుఐడియాఫోర్జ్టాటా సన్స్సెకండ్ వంటి కొన్ని భారతీయ కంపెనీలుకోహెన్ గ్రూప్‌లోని సీనియర్ లీడర్స్ రక్షణ మంత్రితో జరిగిన భేటీలో పాల్గొన్నారు. ఈ చర్చల సందర్బంగా వ్యాపార దిగ్గజాలు భారత్ లో తమ కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రణాళికలను క్లుప్తంగా వివరిస్తూ, విలువైన తన అభిప్రాయాలను వారి ముందు ఉంచారు.

 

***


(Release ID: 2048826) Visitor Counter : 55