ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

Posted On: 25 AUG 2024 2:34PM by PIB Hyderabad

జన్మాష్టమిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మంగళప్రదమైన జన్మాష్టమి సందర్భంలో దేశ ప్రజలందరికి నేను నా స్నేహపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

పవిత్ర ప్రేమ, జ్ఞానం, ధర్మబద్ధతలు మూర్తీభవించిన భగవాన్  కృష్ణుని జనన కాలాన్ని సూచించే జన్మాష్టమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రతీక.

ధర్మం, చెడు పైన మంచి గెలుపు, సత్యం, కరుణలతో కూడిన జీవితాన్ని కొనసాగించడాన్ని ఈ పండుగ రోజు గుర్తు చేస్తుంది. 

ఈ పుణ్య దినాన్ని మనం ఉత్సవంగా జరుపుకొనే క్రమంలో.. భగవాన్ కృష్ణుడు బోధించిన గొప్ప పాఠాలను మననం చేసుకుంటూ జీవనాన్ని సాగిద్దాం. సమాజంలో ఐక్యతనీ, శాంతిసామరస్యాల్ని పరిరక్షించుకుందాం.

ఈ పుణ్య సమయంలో- ధర్మవిహిత మార్గాన్ని అనుసరిస్తామనీ, అందరి హితం కోసం ప్రయత్నిస్తామనీ  మనమంతా సంకల్పం చెప్పుకుందాం.

జై శ్రీ కృష్ణ.’’

ఉపరాష్ట్రపతి సందేశం తాలూకు హిందీ అనువాదం ఈ కింద ఉంది:

 


(Release ID: 2048823) Visitor Counter : 41