రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వాషింగ్టన్ డిసిలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ జేక్ సల్లివాన్‌తో సమావేశమైన భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్


మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కీలక ప్రాంతీయ భద్రతా సమస్యలు, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యంపై చర్చలు

అమెరికా రక్షణ పరిశ్రమల నేతలతో మాట్లాడిన రక్షణ మంత్రి, సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా అమెరికా రక్షణ పారిశ్రామిక రంగంతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు చెప్పిన రక్షణ మంత్రి

Posted On: 24 AUG 2024 8:59AM by PIB Hyderabad

భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2024, ఆగస్టు 23న వాషింగ్టన్ డీసీలోని శ్వేత సౌధంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ జేక్ సల్లివాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పలు కీలక భద్రతా సమస్యల గురించి చర్చించారు. అలాగే ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య కొనసాగుతున్న రక్షణ రంగ సహకార ప్రాజెక్టుల గురించి ఇరు దేశాల రక్షణ రంగాలు కలిసి పనిచేయగల అంశాలను గురించి కూడా వారు చర్చించారు.

 

వాషింగ్టన్ డీసీలో యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో యూఎస్ రక్షణ పారిశ్రామిక రంగ ప్రముఖులతో రక్షణ మంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి యూఎస్ రక్షణ, సాంకేతిక రంగ కంపెనీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.

యూఎస్ పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని భారత్ స్వాగతిస్తున్నదని రక్షణ మంత్రి తెలిపారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ధృడమైన ఎఫ్‌డిఐ అనుకూల, వ్యాపార అనుకూల పరిస్థితులతో పాటు అతిపెద్ద దేశీయ మార్కెట్‌తో భారత్ సిద్ధంగా ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రక్షణ రంగాలలో సామర్ధ్యం మెరుగుపరచగల, అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించగల సుస్థిరమైన సాంకేతిక, పారిశ్రామిక భాగస్వామ్యం కోసం అమెరికాతో కలిసి పనిచేయడానికి భారతదేశం ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు.

 

***



(Release ID: 2048526) Visitor Counter : 15