జౌళి మంత్రిత్వ శాఖ

టెక్స్ టైల్స్ పీఎల్ఐ లబ్ధిదారులతో కేంద్ర జౌళి మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ భేటీ

Posted On: 20 AUG 2024 8:21PM by PIB Hyderabad

ఎంఎంఎఫ్ దుస్తులు, వస్త్రాలు, సాంకేతిక వస్త్రాలకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) లబ్ధిదారులతో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పథకానికి సంబంధించిన విజయాలు, అనుభవాలు, అభిప్రాయాలు, సవాళ్లను ఆయా సంస్థల ప్రతినిధులు మంత్రికి వివరించారు.
 

టెక్స్ టైల్ రంగంలో వృద్ధి, ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ పథకం ప్రభావాన్ని మరింత పెంచేందుకు భవిష్యత్ వ్యూహాలు, మెరుగుదల అంశాలపై చర్చించారు. 
 

ఇందులో పాల్గొన్న వారి అంకితభావాన్నీ, వారు అందించిన విలువైన సమాచారం ఇవ్వడాన్నీ మంత్రి కొనియాడారు. " ఇక్కడ పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు అమూల్యమైనవి. సహకారం, దాపరికంలేని సమాచార మార్పిడిపై  టెక్స్ టైల్ రంగపు నిరంతర విజయం ఆధారపడి ఉంటుంది. పీఎల్ఐ పథకం లబ్ధిదారుల అంకితభావం, పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో వారి నిబద్ధత నన్ను ఉత్సాహపరుస్తోంది”  అని వ్యాఖ్యానించారు. 

 

***

 



(Release ID: 2047175) Visitor Counter : 19