నీతి ఆయోగ్
క్లైమేట్ స్మార్ట్ అగ్రిటెక్ కోసం స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఇండియా ఆస్ట్రేలియా రైజ్ యాక్సిలరేటర్
Posted On:
19 AUG 2024 10:07AM by PIB Hyderabad
భారత్, ఆస్ట్రేలియాల మధ్య అంతర్జాతీయ వ్యాపార విస్తరణను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ‘ఇండియా ఆస్ట్రేలియా ర్యాపిడ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఎక్స్పాన్సన్ (రైజ్) యాక్సిలరేటర్ ’ భాగంగా క్లైమేట్ స్మార్ట్ అగ్రిటెక్ బృందం కోసం రెండు దేశాలకు చెందిన స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల నుంచి- అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్వో సంయుక్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో భారత్, ఆస్ట్రేలియాల్లో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే దిశగా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇది కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.
అక్టోబర్ 2024 నుంచి క్లైమేట్ స్మార్ట్ అగ్రిటెక్ భాగస్వామ్యంపై ‘రైజ్ యాక్సిలరేటర్’ దృష్టి సారిస్తుంది. వాతావరణంలో మార్పులు, వనరుల కొరత, ఆహార అభద్రతల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించి స్థిరత్వాన్ని తీసుకొచ్చే సాంకేతికతనూ, పరిష్కారాలనూ సూచించే స్టార్టప్ లు, ఎంఎస్ఎఈలపై దృష్టి పెడతారు.
ముఖ్యంగా రైతుల అవసరాలు, ప్రాధమ్యాలు, వ్యవసాయంలో క్షేత్ర స్థాయి విధానాలకు అనుగుణంగా పరిష్కారాలు అందించే ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ల కోసం ఎదురు చూస్తున్నారు.
రైజ్ యాక్సిలరేటర్ విధానం 2023లో ప్రారంభమైన నాటి నుంచి కొత్త మార్కెట్లకు అనుగుణంగా స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంతో పాటు, వారి సాంకేతికతల- ధ్రువీకరణ, స్వీకరణ, అమలు దశల్లో కీలకపాత్ర పోషించింది. క్లైమేట్ స్మార్ట్ అగ్రిటెక్ బృంద విధానాన్ని పరిచయం చేయడం ద్వారా పెరుగుతున్న పర్యావరణ సవాళ్లకు తగినట్లుగా వ్యవసాయ ఉత్పాదకత, స్థిరత్వాన్ని పెంపొందించే పరిష్కారాలను అందించే స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలపై దృష్టి సారించింది.
సీఎస్ఐఆర్వో ప్రోగ్రాం డైరెక్టర్ టమారా ఓగిల్వీ మాట్లాడుతూ ‘‘భారత్, ఆస్ట్రేలియా ఒకే తరహా వ్యవసాయ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే రెండు దేశాల మధ్య వ్యవసాయ విస్తీర్ణం, వైవిధ్యం వేర్వేరుగా ఉన్నాయి. భిన్నమైన ఈ సరళి వల్ల ఒక ఉత్పత్తి మార్కెట్టును- విభిన్న మార్కెట్లకు సరిపోయేలా తీర్చిదిద్దడం వీలవుతుంది. ప్రపంచవ్యాప్త డిమాండ్లకు అనుగుణమైన, వేగవంతమైన పరిష్కారాలను అందించడం కూడా సాధ్యం అవుతుంది’’
తొమ్మిది నెలల కాలవ్యవధి కలిగిన యాక్సిలరేటర్ క్యార్యక్రమంలో ఎంపికైన స్టార్టప్ లు, ఎంఎస్ఎఈలు భారత్, ఆస్ట్రేలియా రెండు చోట్లా ఆన్ లైన్ సమావేశాల ద్వారా, వ్యక్తిగత సమావేశాల ద్వారా స్టార్ట్ అప్ లు లబ్ధి పొందుతాయి. విషయ పరిజ్ఞానం ఉన్న వారితోనూ, పారిశ్రామిక నిపుణులతో జరిగే ముఖాముఖి సమావేశాల ద్వారా మార్కెట్ కు సంబందించిన లోతైన అవగాహన లభిస్తుంది. భాగస్వాములు, వినియోగదారులతో సంబంధాలను సులభతరం చేయడం వల్ల- కొత్త మార్కెట్లలో విజయావకాశాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఈ కార్యక్రమం చివరి భాగంలో- క్షేత్రస్థాయి ఆచరణలు, ప్రయోగాత్మకంగా సాంకేతికతలను పరీక్షించడం వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమ ప్రాముఖ్యత గురించి ఏఐఎం కార్యక్రమ అధిపతి ప్రమిత్ డాష్ మాట్లాడుతూ “నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పరిష్కారాలను అందించే వేదికను స్టార్టప్ లకు కల్పించడం ద్వారా, రైజ్ యాక్సిలరేటర్ కార్యక్రమం వ్యవసాయ రంగంలో తక్షణ సవాళ్లను నిర్ధారించి, రైతులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా స్థిరమైన పద్ధతులను అవలంబించవచ్చు” అన్నారు.
కార్యక్రమ తాజా విడతలో ఉత్పాదకతను పెంచడం, ఉద్గారాలను తగ్గించడం, సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం తదితర క్లిష్టమైన వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి నూతన పరిష్కారాలను స్వీకరిస్తుంది.
రైజ్ యాక్సిలరేటర్ దరఖాస్తుల గడువు తేదీ:15 సెప్టెంబర్ 2024. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుమూ లేదు. అలాగే భారత్, ఆస్ట్రేలియాల మధ్య అనేకసార్లు ప్రయాణించే వీలు ఉంటుంది. ఎంపికైన స్టార్టప్‌లు / ఎస్ఎంఈలు భాగస్వామ్యయేతర నిధి రూపంలో గరిష్టంగా 45 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. మరింత్ర సమాచారం, దరఖాస్తు చేసుకోవడానికి https://riseaccelerator.org/ సందర్శించండి.
మరిన్ని వివరాల కోసం ఆగస్టు 28, 2024న జరిగే సమాచార, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
రైజ్ యాక్సిలరేటర్ గురించి:
ఇండియా ఆస్ట్రేలియా రాపిడ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్-అప్ ఎక్స్పాన్సన్ (రైజ్) యాక్సిలరేటర్ అనేది సీఎస్ఐఆర్వో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), నీతి ఆయోగ్ నేతృత్వంలోని ద్వైపాక్షిక కార్యక్రమం.
రైజ్ యాక్సిలరేటర్ వినూత్న అగ్రిటెక్ పరిష్కారాల విస్తరణను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ సమస్యలపై దృష్టి సారించి భారత్, ఆస్ట్రేలియాల్లో ఎదుర్కొంటున్న ఒకే విధమైన సవాళ్లను పరిష్కరిస్తుంది.
***
(Release ID: 2047113)
Visitor Counter : 104