వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు పాకిస్థాన్ శరణార్థ మహిళల రాఖీ
రాఖీ పర్వదినాన సీఏఏ పౌరసత్వ లబ్ధిదారులైన మహిళలను కలుసుకున్న పీయూష్ గోయల్
పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు భారత్ భద్రత కల్పిస్తుంది: పీయూష్ గోయల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృఢ సంకల్పం వల్లే పౌరసత్వ చట్టం అమలు: పీయూష్ గోయల్
Posted On:
19 AUG 2024 1:32PM by PIB Hyderabad
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో స్థిరపడిన మహిళలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సోమవారం రాఖీ కట్టారు.
సాధ్వి రితంబర, బ్రహ్మకుమారీలతో సైతం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రక్షాబంధన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ సీఏఏ ద్వారా పౌరసత్వం పొందిన శరణార్థులకు పౌరసత్వ చట్టం భద్రత కల్పిస్తుందన్నారు.
‘‘పౌరసత్వ (సవరణ) చట్టం మీ హక్కు అయిన గౌరవం, భద్రతను అందిస్తుంది’’ అన్నారు. అలాగే ‘‘నా జీవితంలో జరుపుకున్న అత్యుత్తమ రక్షాబంధన్ వేడుకల్లో ఇది ఒకటి’’ అని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పం వల్లే ఈ సోదరీమణులంతా సీఏఏ ద్వారా భారత పౌరసత్వం పొందారని ఆయన అన్నారు.
***
(Release ID: 2046615)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam