ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఐఎన్ఎల్ గర్భమ్ మాంగనీస్ గని కౌలును పొడిగించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆర్ఐఎన్ఎల్ సిఎండీ శ్రీ అతుల్ భట్ ధన్యవాదాలు

Posted On: 18 AUG 2024 12:44PM by PIB Hyderabad

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు నిర్వహిస్తున్న గర్భమ్ మాంగనీస్ గని కౌలును పొడిగించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆర్ఐఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండీ) శ్రీ అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు.

 

ఆర్ఐఎన్ఎల్ కు గర్భమ్ మాంగనీస్ గని కౌలును పొడిగించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండీ) శ్రీ అతుల్ భట్ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వాన్ని ప్రదర్శించారని శ్రీ భట్ అన్నారు. ఈ పొడిగింపు ఆర్ఐఎన్ఎల్ కు కీలక విజయం. దీంతో సంస్థ ఉత్పత్తికి అవసరమైన మాంగనీస్ ముడి ఖనిజానికి కొరత ఉండదని ఆయన తెలిపారు.

 

ఈ విషయంలో అలుపెరుగని ప్రయత్నాలను చేసినందుకుగాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, విశాఖపట్నం గాజువాకకు చెందిన శాసనసభ్యుడు శ్రీ పల్లా శ్రీనివాసరావుకు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు శ్రీ యం. శ్రీ భరత్ కు కూడా శ్రీ అతుల్ భట్ నిజాయతీ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారు అందించిన మద్దతు, వారి క్రియాశీలత్వం ఆర్ఐఎన్ఎల్ కు అవసరమైన ముఖ్యవనరులను సంపాదించి పెట్టడంలో దోహదం చేశాయి. దేశాభివృద్ధిలో తన వంతు తోడ్పాటును అందించాలన్న  ఆర్ఐఎన్ఎల్ నిబద్ధత మరింతగా బలపడనుంది.

 

గర్భమ్ మాంగనీస్ గని కౌలు ప్రాంతం 654 ఎకరాల మేర విస్తరించి ఉంది. ఆర్ఐఎన్ఎల్ వినియోగం ఏటా సుమారు 6000 టన్నులు ఉంటుంది. ఉక్కును కరిగించే కొలుముల్లో వేడి లోహాన్ని ఉత్పత్తి చేయడానికి మాంగనీసును ఉపయోగిస్తుంటారు.

 

సమష్టి సహకారం వల్లనే, కౌలు పొడిగింపు సాధ్యమైందని, పరిశ్రమకీ- ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు  ఎంత ముఖ్యమన్నది  ఇది నిరూపిస్తోంది. 

 

***


(Release ID: 2046527) Visitor Counter : 56