ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాజీ సిఇఎ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ భేటీ
Posted On:
16 AUG 2024 10:29PM by PIB Hyderabad
పూర్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ), ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ప్రొఫెసర్ కృష్ణమూర్తి వి. సుబ్రమణియన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. పుస్తక రచన, విధాన రూకల్పన అంశాలపై ప్రొఫెసర్ సుబ్రమణియన్ కు ఉన్న ఆసక్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రొఫెసర్ సుబ్రమణియన్ సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్టు చేసిన సందేశానికి ప్రధాన మంత్రి స్పందిస్తూ,
‘‘కృష్ణమూర్తి సుబ్రమణియన్ గారు, మీతో సమావేశం కావడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఎప్పటి మాదిరిగా అదే ఆలోచనల ఉద్ధృతి, అదే లోతైన అవగాహన. రచనలు, విధానపరమైన విషయాలపై తపనను కొనసాగిస్తున్నందుకు అభినందన’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2046296)
Visitor Counter : 54