ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని


భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా అధ్యక్షుడు నెతన్యాహు శుభాకాంక్షలు

పశ్చిమాసియా తాజా స్థితిపై ఇద్దరు నేతల మధ్య చర్చ

సాధారణ స్థితి పునరుద్ధరణ అవసరాన్ని గుర్తు చేసిన ప్రధానమంత్రి

బందీల విడుదల, యుద్ధ విరమణతో పాటు మానవీయ సాయం అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

Posted On: 16 AUG 2024 5:42PM by PIB Hyderabad

ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మాట్లాడారు.

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధాని శ్రీ నెతన్యాహు తన స్నేహపూర్ణ శుభాకాంక్షలను వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న స్థితిపై ఇద్దరు నేతలు చర్చించారు.

తాజా స్థితిలో ఉద్రిక్తతల తగ్గింపు దిశగా కృషి సాగవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బందీలందరినీ వెంటనే విడుదల చేయాలంటూ భారతదేశం ఇప్పటికే ఇచ్చిన పిలుపును ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. యుద్ధ బాధితులకు మానవీయ సాయాన్ని నిరంతరంగా అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చర్చల ద్వారానూ, దౌత్య మార్గాల ద్వారానూ సంఘర్షణకు సత్వరమైన, శాంతిపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు.

ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ పార్శ్వాలను గురించే కాకుండా, భారతదేశం-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచదగిన మార్గాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

పరస్పర సంప్రదింపులు కొనసాగించడంపై ఇరువురు నేతలు అంగీకారం వ్యక్తం చేశారు.


(Release ID: 2046272) Visitor Counter : 57