సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

దివ్యాంగుల ఆత్మగౌరవ పరిరక్షణకే కారుణ్యపూరిత నిర్ణయాలు: 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని

Posted On: 15 AUG 2024 2:25PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించారు. దివ్యాంగుల ఆత్మగౌరవ పరిరక్షణకు, వారి జీవన నాణ్యత మెరుగుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన నొక్కిచెప్పారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో, సామాజికంగా గౌరవాదరాలు పొందుతూ జీవించేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతోపాటు కొత్త కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా అమలు చేసిన కీలక కార్యక్రమాల్లో కొన్ని:

సుగమ్య భారత్: ఇది సౌలభ్య కల్సన కార్యక్రమం. దీనికింద ప్రజా రవాణా సదుపాయాలు, బహిరంగ ప్రదేశాల వినియోగంలో ఇబ్బందులు తొలగిస్తూ సార్వజనీన వాతావరణం సృష్టించడం దీని లక్ష్యం.

పారా ఒలింపియన్లకు సహాయం: దివ్యాంగ క్రీడాకారుల విజయాలను గుర్తించిన ప్రభుత్వం వారికి  మరింత ప్రోత్సాహంతోపాటు చేయూత దిశగా అదనపు సాయం అందిస్తోంది.

సంకేత భాషాభివృద్ధి: సంకేత భాషను గుర్తించడం, వినియోగించడంలో ముందడుగు దిశగా  మెరుగైన కమ్యూనికేషన్, సార్వజనీనత పెంపొందించేందుకు చర్యలు.

   ఈ చర్యలన్నీ దివ్యాంగులకు సామాజిక గౌరవ పునరుద్ధరణ, కొనసాగింపు నిమిత్తం చేపట్టిన విస్తృత కృషిలో భాగమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ మేరకు సమానత్వం, సహానుభూతి ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

****



(Release ID: 2045765) Visitor Counter : 28