సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార భారతి-షేర్డ్ ఆడియో-విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిసిమినేషన్ (పీబీ-ఎస్‌హెచ్‌ఏబీడీ): వార్తాలను పంచుకునే సమగ్ర సేవ
లోగో రహిత, క్రెడిట్స్ అవసరం లేని కంటెంట్ అందించనున్న పీబీ-ఎస్‌హెచ్‌ఏబీడీ
దూరదర్శన్, ఆకాశవాణి లైబ్రరీల నుంచి అరుదైన, పాత వీడియోలను పొందదున్న సబ్‌స్ర్కైబర్లు
మార్చి 2025 వరకు మీడియా సంస్థలకు ఉచిత సైన్‌అప్, వినియోగ అవకాశం ఇచ్చిన ప్రసార భారతి
Posted On:
14 AUG 2024 4:12PM by PIB Hyderabad
గత మార్చి 13న ప్రారంభించిన ప్రసార భారతి-షేర్డ్ ఆడియో-విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్(పీబీ-ఎస్‌హెచ్‌ఏబీడీ)ను వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటోలతో సహా వివిధ ఫార్మాట్లలో మీడియా సంస్థలకు రోజువారీ న్యూస్ ఫీడ్‌ను అందించే ఒక సమగ్ర సేవ ప్లాట్‌ఫామ్‌గా రూపొందించారు.
సమగ్ర కవరేజీ కోసం విస్తృత నెట్‌వర్క్
1500 మందికి పైగా రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, స్ట్రింగర్లు బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించి, 24 గంటలూ పనిచేసే 60 ప్రత్యేక ఎడిట్ డెస్క్‌ల సహాయంతో దేశంలోని ప్రతి మూల నుంచి తాజా వార్తలను పీబీ-ఎస్‌హెచ్ఓబీడీ అందిస్తుంది. వ్యవసాయం, సాంకేతికత, విదేశీ వ్యవహారాలు, రాజకీయ పరిణామాలు వంటి 50కి పైగా విభాగాల్లో 1000కు పైగా కథనాలను ప్రాంతీయ వార్తా యూనిట్లు(ఆర్ఎన్‌యూలు), ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రతిరోజూ అప్‌లోడ్ చేస్తాయి.
ప్రధాన లక్షణాలు
పీఎం-ఎస్‌హెచ్ఏబీడీ ద్వారా అందే కంటెంట్ లోగో రహితంగా ఉండనుంది. దీన్ని ఉపయోగించినట్లయితే ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదనంగా ఇందులో ప్రత్యక్ష ప్రసార ఫీడ్ కూడా అందుబాటులో ఉండనుంది. రాష్ట్రపతి భవన్ నుంచి జాతీయ అవార్డు వేడుకలు, ఎన్నికల ర్యాలీలు, ముఖ్యమైన రాజకీయ సంఘటనలు, వివిధ మీడియా సమావేశాలు వంటి లైవ్ కార్యక్రమాలకు ప్రత్యేక కవరేజీని అందిస్తుంది. ఇవన్నీ లోగో లేకుండానే ఉంటాయి.
యాక్సెస్ ను మరింత పెంచడానికి మీడియా రిపోజిటరీని ఆర్కైవల్ లైబ్రరీగా అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా దూరదర్శన్, ఆకాశవాణి లైబ్రరీల నుంచి అరుదైన, ఆర్కైవల్ ఫుటేజీని ప్రత్యేక క్యూరేటెడ్ ప్యాకేజీలతో సులభంగా సబ్‌స్ర్కైబర్లు పొందవచ్చు.
ఇందులో మీడియా సంస్థలు మార్చి 2025 వరకు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఆసక్తిగల సంస్థలు https://shabd.prasarbharati.org/register ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మరిన్ని అప్‌డేట్స్ అందించేందుకు పీబీ-ఎస్‌హెచ్‌ఏబీడీ ఎక్స్(గతంలో ట్విట్టర్) https://x.com/PBSHABD, ఇన్‌స్టాగ్రామ్ https://www.instagram.com/pbshabd/ లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 2045755)
Visitor Counter : 63