సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం ప్రపంచ స్థాయిలో మహనీయ స్థానాన్ని భారతదేశం సాధించ గలదన్న అచంచల విశ్వాసాన్ని నింపుతూ, అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న మన భవిత తాలూకు సజీవ చిత్రాన్ని కళ్లెదుట నిలుపుతోంది: కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్
Posted On:
15 AUG 2024 2:21PM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న మన భవిత తాలూకు సజీవ చిత్రాన్ని కళ్లెదుట నిలుపుతోందని సంస్కృతి, పర్యటన శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. అదే సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం భారతదేశం ప్రపంచ స్థాయిలో మహనీయ స్థానాన్ని సాధించ గలుగుతుందన్న అచంచల విశ్వాసాన్ని కూడా దేశ ప్రజలలో నింపింది అని కూడా కేంద్ర మంత్రి అన్నారు.
శ్రీ షెఖావత్ సా తన స్పందన ను సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో తెలియజేస్తూ, ‘‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలను ఉద్దేశించి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇప్పటికి పదకొండో సారి చేసిన ప్రసంగం, భారతదేశం ప్రపంచ స్థాయిలో మహనీయత్వాన్ని సాధించగలుగుతుందన్న అచంచల విశ్వాసాన్ని దేశ ప్రజలలో నింపుతోంది. అదే సమయంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న మన భవిత తాలూకు సజీవ చిత్రాన్ని కట్టెదుట నిలిపేదిగా కూడా ఉంది. భారతదేశం గత పదేళ్లలో ప్రపంచ హితం కోసం సాహసించే, సంరక్షించే, మార్పునకు ప్రేరణనిచ్చే ఒక నవ భారతదేశం గా తనను మార్చేసుకొంది. వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు అందే తరహా కీర్తి ని ప్రపంచం సంపాదించుకోవాలి అని నూతన భారతదేశం కోరుకుంటోంది. మన దేశం దాని వలసవాద మారువేషాన్ని వదిలించుకొని, తన సిసలు వారసత్వాన్ని, సాంప్రదాయిక విలువలను సగర్వంగా అలంకరించుకొని తాను నడుస్తున్న బాటను అనుసరించ వలసిందిగా ప్రపంచాన్ని కోరుతున్న ఒక నవ్య భారతావని. ఇది ఎటువంటి ఒక నయా భారతదేశమంటే ఈ దేశంలో పౌరుల ప్రయోజనాలే పరమార్థంగా నడుస్తున్న పాలన యంత్రాంగం సుపరిపాలనలోను, ప్రజాస్వామ్య నాయకత్వంలోను ఒక కొత్త అధ్యాయాన్ని రచించనున్నటువంటి నవ భారతం సుమా.” అని పేర్కొన్నారు.
****
(Release ID: 2045646)