ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతాం:భారత్ నిబద్దతను వివరించిన ప్రధాన మంత్రి
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రధాన కేంద్రంగా మారిందని, ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులు చేసే స్థితికి చేరుకున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రతి ఒక్క పరికరానికి 'మేడ్ ఇన్ ఇండియా చిప్' ను అభివృద్ధి చేయాలన్న కలను సాకారం చేసే సామర్థ్యం దేశానికి ఉంది: ప్రధాన మంత్రి
Posted On:
15 AUG 2024 12:32PM by PIB Hyderabad
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు, దేశ అధిక వృద్ధిని నమోదు చేసేందుకు.. భవిష్యత్ లక్ష్యాలను 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగం లో పేర్కొన్నారు.
సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి దేశానికి ఉన్న నిబద్ధతను వివరించారు. "ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేవాళ్లం, కానీ నేడు దేశంలో తయారీ వ్యవస్థనే సృష్టించాం. ప్రస్తుతం భారత్, ఫోన్ల తయారీకి కేంద్రంగా అవతరించి.. ప్రపంచానికి ఎగుమతి చేసే స్థితికి చేరుకుంది" అని ఆయన పేర్కొన్నారు.
మేడ్ ఇన్ ఇండియా చిప్-సెమీకండక్టర్ల ఉత్పత్తి
సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేద మన భవిష్యత్తుతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ పై ప్రస్తుతం పనిచేయడం ప్రారంభించామని మోదీ తెలిపారు. ప్రతి పరికరానికి 'మేడ్ ఇన్ ఇండియా' చిప్ ఎందుకు ఉండకూడదని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఈ కలను సాకారం చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉందని... అందువల్ల ఉత్పత్తితో పాటు, సెమీకండక్టర్ల సంబంధిత పనులు భారత్ లోనే జరుగుతాయని ఆయన అన్నారు. ప్రపంచానికి సంపూర్ణ పరిష్కారాలు అందించే సత్తా, సాధనాలు భారత్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
****
(Release ID: 2045616)
Visitor Counter : 112