చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ న్యాయాలయాలు

Posted On: 09 AUG 2024 12:36PM by PIB Hyderabad

   దేశంలో 2009 అక్టోబరు 2 నుంచి న్యాయాలయాల చట్టం-2008 అమలులోకి వచ్చింది. పౌరుల ముంగిటకు సత్వర న్యాయప్రదానం దీని లక్ష్యం. ఈ చట్టంలోని సెక్షన్ 3(5) ప్రకారం- రాష్ట్ర ప్రభుత్వం వివిధ హైకోర్టులను సంప్రదించి ప్రతి గ్రామ న్యాయాలయానికి ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ హోదాకు తక్కువగాని న్యాయాధికారిని నియమిస్తుంది. అవసరాన్ని బట్టి వీరు సంచార కోర్టులు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, ఈ చట్టం కింద ‘గ్రామ న్యాయాలయాల ఏర్పాటు-నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం’ పేరిట ప్రణాళికను 2009లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తదనుగుణంగా పథకం నిర్వహణ మార్గదర్శకాలను రూపొందించింది.

   దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 రాష్ట్రాలు ‘గ్రామ న్యాయాలయాల’ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటిదాకా 481 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రకటనలిచ్చాయి. అటుపైన పథకం మొదలైన నాటినుంచి 10 రాష్ట్రాలలో 509 గ్రామ న్యాయాలయాలు పనిచేయడం ప్రారంభించాయి.  ఈ నేపథ్యంలో రాష్ట్రాలవారీగా ప్రకటిత-పనిచేస్తున్న గ్రామ న్యాయాలయాల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

వ.

సం.

రాష్ట్రం/కేంద్రపాలిత

 ప్రాంతం పేరు

ప్రకటిత

గ్రామన్యాయాలయాలు

పనిచేస్తున్న

గ్రామన్యాయాలయాలు

1

మధ్యప్రదేశ్

89

89

2

రాజస్థాన్

45

45

3

కేరళ

30

30

4

మహారాష్ట

39

26

5

ఒడిషా

24

20

6

ఉత్తరప్రదేశ్

113

92

7

కర్ణాటక

2

2

8

హర్యానా

3

2

9

పంజాబ్

9

2

10

జార్ఖండ్

6

1

11

గోవా

2

0

12

ఆంధ్రప్రదేశ్

42

0

13

తెలంగాణా

55

0

14

జమ్ము కాశ్మీర్

20

0

15

లద్దాఖ్‌

2

0

 

మొత్తం

481

         309

 

   కేంద్ర చట్టం-న్యాయ శాఖ (స్వతంత్ర బాధ్యత); సభా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ ఇవాళ లోక్‌స‌భ‌లో ఒక ప్ర‌శ్ర‌కు లిఖిత‌పూర్వ స‌మాధాన‌మిస్తూ ఈ సమాచారం వెల్ల‌డించారు.

***


(Release ID: 2044208)