సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
प्रविष्टि तिथि:
08 AUG 2024 2:02PM by PIB Hyderabad
దేశంలోని ఐదు చారిత్రక ప్రదేశాలకు గడచిన ఐదేళ్లలో దేప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది. ఇప్పటిదాకా గుర్తింపు ప్రాంతాల జాబితాను అనుబంధం-2లో చూడవచ్చు.
ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం వల్ల ఆయా దేశాల కీర్తి ప్రతిష్టల వ్యాప్తితోపాటు సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతాల పరిసరాల్లో పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత దేశ ఆర్థిక వృద్ధికీ ఇది దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల గుర్తింపు లభించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో అసోంలోని మోయిడాం ఒకటి. ఇక్కడ పర్యాటకుల కోసం ప్రభుత్వ సమాచార కేంద్రం, రెయిన్ షెల్టర్లు, మార్గాలు, గుర్తింపు చిహ్నాల ఏర్పాటు ద్వారా అవగాహన కల్పనకు, పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలవారీగా దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల వివరాలను అనుబంధం-1లో చూడవచ్చు.
కేంద్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(रिलीज़ आईडी: 2043700)
आगंतुक पटल : 166