ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం

प्रविष्टि तिथि: 08 AUG 2024 4:34PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మృతికి ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ఉపరాష్ట్రపతి ‘‘ఎక్స్’’ లో నమోదు చేసిన సందేశంలో:  

       ‘‘పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య మరణించారన్న సంగతి తెలిసి బాధపడ్డాను.

 

      తల పండిన ఆయన రాజనీతి కౌశలం తాలూకు ప్రయోజనాన్ని నేను పశ్చిమ బెంగాల్ కు గవర్నరుగా ఉన్నప్పుడు సూచనలు, సలహాల రూపంలో అనేక సార్లు స్వీకరించగలిగాను.

      ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన బంధు వర్గానికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

      దివంగత పవిత్రాత్మకు చిర శాంతి ని ఆ పరమాత్మ కలుగ జేయుగాక. అలాగే, ఆయనను ఎడబాసి, శోక సంద్రంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులు ఈ పెను నష్టాన్నుండి తేరుకొనేందుకు వారికి నైతిక ధైర్యాన్ని కూడా ఆ పరమాత్మ ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2043243) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Tamil , Kannada