నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఇ-వ్యర్థాల నిర్వహణ
Posted On:
07 AUG 2024 3:42PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇ-వ్యర్థాల (నిర్వహణ) నిబంధనలు-2022ను రూపొందించింది. ఈ నిబంధనలు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా, వీటిని సమయానుసారం సవరిస్తున్నారు. ఇవి అధ్యాయం 5లోని నిబంధనలకు అనుగుణంగా సోలార్ ఫోటో-వోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా ప్యానెల్స్ లేదా సెల్స్ కు వర్తిస్తాయి. తదనుగుణంగా వీటి తయారీ-ఉత్పత్తిదారుల కార్యకలాపాలు కింది అంశాలకు లోబడి ఉండాలి:
- పోర్టల్‌లో నమోదై ఉండాలి
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం 2034-2035 వరకు ఉత్పత్తి అయిన సోలార్ ఫోటో-వోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా ప్యానెల్స్ లేదా సెల్స్ వ్యర్థాలను నిల్వ చేయాలి;
- అలాగే 2034-2035 వరకు ఆయా ఏడాది సంబంధిత వార్షిక రిటర్నులను సంవత్సరం చివరన లేదా అంతకుముందే పోర్టల్ ద్వారా నిర్దేశిత ఫారంలో దాఖలు చేయాలి;
- సోలార్ ఫోటో-వోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా ప్యానెల్స్ లేదా సెల్స్ కాకుండా ఇతర వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రస్తుతం అమలులోగల వర్తించే నిబంధనలు లేదా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి;
- సోలార్ ఫోటో-వోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా ప్యానెల్స్ లేదా సెల్స్ సామగ్రి వివరాలు పోర్టల్ లో స్పష్టంగా నమోదు చేయాలి;
- దీనికి సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు, మార్గదర్శకాలను పాటించాలి.
అంతేకాకుండా సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ లేదా ప్యానెల్స్ లేదా సెల్స్ రీసైక్లింగ్ చేసే సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) నిర్దేశాల ప్రకారం ఆ సామగ్రిని సేకరించడం తప్పనిసరి.
పవన విద్యుదుత్పాదక టర్బైన్ ఉపకరణాల్లో అధికశాతం రీసైకిల్ చేయగల లోహాలతో తయారవుతాయి. ఈ నేపథ్యంలో వీటి బ్లేడ్లకు ఉపయోగించే ‘షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసి)/ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (ఎఫ్ఆర్‌పి)సహా థర్మోసెట్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనపై 2016 మే 25న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) మార్గదర్శకాలు జారీచేసింది.
కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధనశాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
***
(Release ID: 2043083)
Visitor Counter : 154