యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ పోటీలలో కాంస్య పతకాన్ని సాధించిన స్వప్నిల్‌ కుశాలే. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని సాధించిన ఇండియా

Posted On: 01 AUG 2024 4:09PM by PIB Hyderabad

పారిస్‌ లో జరిగిన ఒలింపిక్స్‌ 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ (3పి) ఈవెంట్‌  లో చరిత్రాత్మక విజయం  సాధించి మెడల్‌ సాధించిన తొలివ్యక్తిగా స్వప్నిల్‌ కుశాలే రికార్డుసాధించారు. స్వప్నిల్‌, టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టిఒపిఎస్‌) క్రీడాకారుడు. స్వప్నిల్‌ ఈ పోటీలో  అద్భుతమైన ప్రతిభను, కచ్చితత్వాన్ని ప్రదర్శించారు. అతను కమ్రంగా తన ర్యాంకును మెరుగు పరుచుకుంటూ మొత్తం 451.4 పాయింట్లతో  మూడవ స్థానంలో నిలిచి దేశానికి కాంస్య పతకం సాధించిపెట్టారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇండియా సాధించిన మూడవ పతకం ఇది. ఈమూడు పతకాలూ షూటింగ్‌ ఈవెంట్లనుంచే వచ్చాయి.


క్వాలిఫికేషన్‌ రౌండ్‌:
స్వప్నిల్‌ క్వాలిఫికేషన్‌ దశ పూర్తిచేసుకుని ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సంపాదించాడు. అక్కడ అతను మొత్తం 590 పాయింట్లు సాధించాడు. అతను  నిలకడగా ఆటతీరును మెరుగుపరుస్తూ రావడంతో ఈ ఈవెంట్‌  లో అత్యున్నత అథ్లెట్‌లతో పోటీపడే అవకాశం వచ్చింది.
ప్రభుత్వ కీలక చొరవ, ఆర్థిక సహాయం (పారిస్‌ సైకిల్‌)
` ఆయుధ కొనుగోళ్లు : షూటింగ్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు అవసరమైన వనరులు సమకూర్చడం జరిగింది.
`వ్యక్తిగత కోచ్‌తో దేశీయంగా శిక్షణ: వ్యక్తిగత కోచింగ్‌, లక్షిత మార్గ  నిర్దేశం, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు  పనితీరు మెరుగుపరుచుకునేందుకు మద్దతు.
`టి.ఒ.పి.ఎస్‌ (టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌): రూ 17,58,557
`శిక్షణ, పోటీలకు వార్షిక క్యాలండర్‌ (ఎసిటిసి): రూ 1,42,69,647


స్వప్నిల్‌ కుశాలే సాధించిన విజయాలు:
స్వప్నిల్‌  కుశాలే, ప్రస్తుత చరిత్రాత్మక ఒలింపిక్‌ మెడల్‌ సాధించడానికి ముందు ఎన్నో విజయాలు సాధించారు.అవి...
`ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కైరో (2022) : ఇండియాకు ఒలింపిక్‌ కోటా స్థానాన్ని సంపాదించి పెడుతూ నాలుగో స్థానంలో నిలిచారు.
`ఏసియన్‌ గేమ్స్‌ 2022: టీమఖ ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించారు.
` ప్రపంచ కప్‌ , బాకు (2023): మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ లో స్వర్ణం, వ్యక్తిగత, టీమ్‌  ఈవెంట్‌లలో రెండు రజపతకాలు సాధించారు.
`ప్రపంచకప్‌, న్యూఢల్లీి (2021): టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణపతకం.

 

నేపథ్యం:
స్వప్నిల్‌  కుశాలే 1995 ఆగస్టు 6 వ తేదీన, ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.  ఆయన క్రీడారంగ ప్రస్థానం 2009లో ప్రారంభమైంది. ఆ ఏడాది ఆయన తండ్రి , ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక క్రీడా కార్యక్రమం క్రీడా ప్రబోధినిలో చేర్పించారు. ఏడాది పాటు  కఠోర శిక్షణ అనంతరం ఆయన ఏదో ఒక  క్రీడను  ఎంచుకోవలసి  ఉండేది. ఆ క్రమంలో ఆయన షూటింగ్‌ ను ఎంచుకున్నారు. 2013 వ సంవత్సరంలో  లక్ష్యస్పోర్ట్‌ స్పాన్సర్‌షిప్‌ లభించింది.
2015లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ 3 జూనియర్‌ కేటగిరీలో కువైట్‌లో జరిగిన ఏసియన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వప్నిల్‌ స్వర్ణపతకం సాధించారు. ఆయన తుగ్లకాబాద్‌లో జరిగిన 59 వ నేషనల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌  50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌  ఈవెంట్‌లో గగన్‌ నారంగ్‌, చెయిన్‌ సింగ్‌ లకంటే ముందున్నారు. ఆ తర్వాత  తిరువనంతపురంలో జరిగిన 61 వ జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌లో  ఆయన అదే పనితీరును కనబరిచారు.

***



(Release ID: 2040519) Visitor Counter : 57