వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న సందర్భంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించిన ప్రొఫెసర్ రమేష్ చాంద్
సదస్సుకు హాజరు కానున్న 75 దేశాలనుంచి 740 మంది ప్రతినిధులు
ప్రతినిధుల్లో 45 శాతం మంది మహిళలు : ప్రొఫెసర్ రమేష్ చాంద్
సుస్థిరాభివృద్దిని బలోపేతం చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్న సమావేశం : ప్రొఫెసర్ రమేష్ చాంద్
Posted On:
30 JUL 2024 6:35PM by PIB Hyderabad
ఆగస్ట్ 2నుంచి 7వరకూ న్యూఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్ లో నిర్వహించబోతున్న 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును పురస్కరించుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చాంద్. ఈ కార్యక్రమంలో ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, దక్షిణ ఆసియాకు చెందిన అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ డైరెక్టర్ శ్రీ షహీదుర్ రషీద్, సమావేశ కార్యదర్శి శ్రీ పి.కె.జోషి, డాక్టర్ ప్రతాప్ ఎస్ భర్తాల్ పాల్గొన్నారు.
పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రొఫెసర్ రమేష్ చాంద్ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తల సంస్థ చాలాకాలంగా సేవలందిస్తోందని అన్నారు. ఈ సంస్థకు సంబంధించిన మొదటి సమావేశాన్ని భారతదేశంలో 1958లో నిర్వహించారని, 66 ఏళ్ల తర్వాత నేడు తిరిగి భారత్‌లో నిర్వహించబోతున్నామని వివరించారు. ఈ సమావేశాన్ని 1958లో నిర్వహించినప్పుడు, పేదరికం, ఆకలి మొదలైన సమస్యలతో భారతదేశం పోరాటం చేస్తూ వుండేదని గుర్తు చేశారు. నేడు ఈ సమావేశానికి రాబోతున్న ప్రతినిధులు నూతన భారతదేశాన్ని దర్శించబోతున్నారని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన భారతదేశ సాధన గురించి చర్చించుకుంటున్నారని ప్రొఫెసర్ రమేష్ చాంద్ అన్నారు. ప్రస్తుతం వాస్తవ సమయంలో తలసరి ఆదాయం 12-13 డాలర్లుగా వుందని 2047 నాటికి దీన్ని 18 వేల డార్లకు తీసుకుపోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. ఆ దిశగా దృష్టి పెట్టి కృషి చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులనుంచి సమగ్రమైన ఉత్పత్తుల దిశగా ప్రయాణం చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం దృష్టి అంతా ఆహార వ్యవస్థ విధానం, సుస్థిరాభివృద్ధిమీదనే వుందని అన్నారు. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని అన్నారు. సుస్థిరాభివృద్ధి బలోపేత కార్యక్రమంపైనే ఈ శిఖరాగ్ర సదస్సు దృష్టి పెట్టబోతున్నదని స్పష్టం చేశారు. సదస్సుకు సంబంధించిన థీమ్ సుస్థిర వ్యవసాయ ఆహార వ్యస్థల దిశగా మార్పు అనే పేరుతో వుండబోతున్నదని వివరించారు ప్రొఫెసర్ రమేష్ చాంద్
ఆహార వ్యవస్థపైన ఈ సదస్సు దృష్టి పెట్టబోతున్నదని ప్రొఫెసర్ రమేష్ చాంద్ అన్నారు. ఈ సమావేశాన్ని ఆగస్ట్ 2నుంచి 7వరకూ నిర్వహించబోతున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనడానికిగా 925 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 60నుంచి 65 మందిదాకా విద్యార్థులకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం లభించింది. మొత్తం మీద వేయి మంది హాజరవుతారని ప్రొఫెసర్ చాంద్ అన్నారు. 75 దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయసంస్థలనుంచి 740 మంది సభ్యులు హాజరవ్వబోతున్నారు.
ఈ కార్యక్రమం సాధించాల్సిన లో్యాలను నిర్ణయించడం జరిగిందని ప్రొఫెసర్ రమేష్ చాంద్ తెలిపారు. వివిధ దేశాలనుంచి వచ్చే ప్రతినిధులతో పరిచయాలు చేసుకొని తద్వారా వృత్తిపరంగా ప్రయోజనాలు పొందే అవకాశం యువశాస్త్రవేత్తలకు లభిస్తోందని అన్నారు. వ్యవసాయరంగ సమస్యలు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయని వాటికి పరిష్కారాలు కనుగొనాల్సి వుందని ఆయన వివరించారు. ఈ సదస్సులో కొన్ని పరిష్కారాలు లభిస్తాయని ఆయన ఆశాభావం ప్రకటించారు. ఆహార వ్యవస్థను అభివృద్ధి చేసి ఆరోగ్యం దిశగా అడుగులు వేయడంపైనే ఈ సదస్సు దృష్టి వుంటుందని అన్నారు. ఈ సదస్సులో పాల్గొనేవారిలో 45 శాతం మంది మహిళే. ఈ సదస్సులో ప్రసిద్ధి చెందిన వ్యవసాయ ఆర్థిక వేత్తల ఉపన్యాసాలు, చర్చలు,ప్రదర్శనలు మొదలైనవి వుంటాయి.
ఈ సదస్సుపైన చాలా అంచనాలను పెట్టుకోవడం జరిగిందని డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. 66 ఏళ్ల తర్వాత ఇండియాలో జరగబోతున్న సద్దస్సు ఇదని ఇందులో పాల్గొనేవారిలో 45 శాతంమంది మహిళలే అని వివరించారు. ఆహార వ్యవస్థ గురించి చర్చలు జరుగుతాయని అన్నారు. ఉత్పత్తినుంచి ఆహార వ్యవస్థకు ఎలా మరలాలనేదానిపైన చర్చ వుంటుందని అన్నారు. ఈ ప్రత్యేక సదస్సులో 75 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొనబోతున్నారని అన్నారు. ఐసిఏఆర్ కు సంబంధించిన ప్రధానమైన కార్యక్రమం సుస్థిరాభివృద్ధి. అన్ని అంశాలను ఆర్ధికరంగంతో లింక్ చేయడం ఎలా అనేదానిపైన సదస్సులో చర్చ చేస్తారు.
వ్యవస్థ మార్పునుంచి సుస్థిర ఆహార వ్యవస్థకు మారడంపైనే ఈ సదస్సును నిర్వహించడం జరుగుతోందని శ్రీ షహీదుర్ రషీద్ అన్నారు. ఆహార వ్యవస్థ అనేది కీలకమైనదని, ఇది ప్రపంచ కార్యక్రమమని ఆయన వివరించారు.
***
(Release ID: 2039550)
Visitor Counter : 82