పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ
Posted On:
29 JUL 2024 12:13PM by PIB Hyderabad
పర్యావరణం, ప్రజల ఆరోగ్యంకై ప్రతికూల ప్రభావాన్ని కలిగించకుండా ప్రమాదకరమైన వ్యర్థాలను సురక్షితంగా నిల్వ చేయడం, శుద్ధి చేయడం మరియు పారవేయడం కోసం పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 కింద ప్రమాదకర వ్యర్థాల (నిర్వహణ, నిర్వహణ మరియు ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్) నిబంధనలు, 2008 స్థానంలో ప్రమాదకరమైన మరియు ఇతర వ్యర్థాల (నిర్వహణ మరియు ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్) (హెచ్ఓడబ్ల్యుఎం) నిబంధనలు, 2016 ను భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. దేశంలో ప్రమాదకర వ్యర్థాల సమర్థ నిర్వహణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సాంకేతిక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సిపిసిబి వెబ్సైట్
https://cpcb.nic.in/technical-guidelines/ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ప్రమాదకరమైన మరియు ఇతర వ్యర్థాలను వనరుగా ఉపయోగించడానికి, సిపిసిబి 71 విభిన్న కేటగిరీల ప్రమాదకర వ్యర్థాల కోసం 102 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ను సిద్ధం చేసింది. ఈ ఎస్ఓపీలు http://cpcb.nic.in/sop-for-hw-specific/ లింక్ సీపీసీబీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
2018-24 మధ్యకాలంలో రూల్ 23(2) HOWM రూల్స్, 2016 ప్రకారం సంబంధిత ఎస్పీసీబీలు/పిసిసి ల ద్వారా నిబంధనలు పాటించని 283 డిఫాల్టర్ యూనిట్లపై చర్యలు తీసుకోవాలని 8 రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (ఎస్పీసీబీలు)/కాలుష్య నియంత్రణ కమిటీల (పీసీసీ) నుంచి సీపీసీబీకి ప్రతిపాదనలు అందాయి.. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి
.
క్రమసంఖ్య
|
రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం
|
డిఫాల్టర్ యూనిట్ల సంఖ్య
|
1
|
ఛత్తీస్ ఘడ్
|
16
|
2
|
గుజరాత్
|
17
|
3
|
హర్యానా
|
02
|
4
|
కర్నాటక
|
04
|
5
|
మహారాష్ట్ర
|
238
|
6
|
ఒడిశా
|
02
|
7
|
పుదుచేరి
|
01
|
8
|
తమిళనాడు
|
03
|
|
మొత్తం
|
283
|
సిపిసిబి ప్రకారం, దేశంలో 127 కలుషిత ప్రదేశాలు ఉన్నాయి. కలుషితమైన 19 ప్రదేశాలలో దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీకి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ అండ్ సీసీ) నిధులు సమకూర్చింది. 'భారతదేశంలో కలుషితమైన ప్రదేశాల మదింపు మరియు దిద్దుబాటు చర్యల' కొరకు ఒక మార్గదర్శక పత్రాన్ని MoEF&CC జారీ చేసింది. 'కలుషితమైన ప్రదేశాల గుర్తింపు, తనిఖీ మరియు మదింపు' పై సిపిసిబి ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ ను జారీ చేసింది. ఇంకా, రాష్ట్ర ప్రభుత్వాలు కలుషితమైన 13 ప్రదేశాల్లో దిద్ద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి.
ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2039317)
Visitor Counter : 178